Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) మేనేజీరియల్‌ విద్యలో ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న సంస్థ. రెండేళ్ల ఫుల్‌టైం ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’లో ప్రవేశానికి ప్రకటనను విడుదల చేసింది. డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలుంది. సంప్రదాయ స్పెషలైజేషన్లతోపాటు ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సెక్టోరియల్‌ ఏరియాల్లోని వాటినీ ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కోర్సును సెమిస్టర్‌ విధానంలో నిర్వహిస్తారు.పరిశ్రమ నిపుణులతో బోధన ఉంటుంది. 10 వారాల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి.

అర్హత: ఏదైనా డిగ్రీని కనీసం 50% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. క్యాట్‌/ మ్యాట్‌/ జీమ్యాట్‌/ ఏటీఎంఏ లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన తత్సమాన ప్రవేశపరీక్షలో అర్హత పొందివుండాలి. వీటి స్కోరు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య: 30
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైనుల్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ఫీజు రూ.1000. ఎంపికైనవారి జాబితాను మే మూడో వారంలోగా వెల్లడిస్తారు. తరగతులు జులై మొదటి వారం నుంచి ప్రారంభం అవుతాయి.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31, 2020
వెబ్‌సైట్‌: www.ascipgdm.in

Back..

Posted on 05-03-2020