Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
71 పీజీలకు ఆసెట్‌ దారి ఎస్‌వీయూ స్వాగతం

ఆంధ్రా విశ్వవిద్యాలయం వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. పరీక్షలో చూపిన ప్రతిభతో ఏయూ క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్సులో వైవిధ్యమైన పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించడం ఆంధ్రా యూనివర్సిటీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో 27 ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్, 44 సైన్స్‌ కోర్సులు పీజీ స్థాయిలో ఉన్నాయి. వీటన్నింటిలోకీ ఆసెట్‌-2020తో ప్రవేశం లభిస్తుంది.

ఏయే కోర్సులు?
ఎమ్మెస్సీ: బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ బయో టెక్నాలజీ, హార్టికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేప్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, బోటనీ, హ్యూమన్‌ జెనెటిక్స్, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయోటెక్నాలజీ, జువాలజీ, మైక్రో బయాలజీ, ఫిషరీ సైన్స్, హోం సైన్స్, ఆంత్రపాలజీ, ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, టెక్‌ జియోఫిజిక్స్, మెరైన్‌ జియోఫిజిక్స్, మెటీరియాలజీ, ఫిజికల్‌ ఓషనోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌), అప్లయిడ్‌ మ్యాథమేటిక్స్, మ్యాథమేటిక్స్, కంప్యూటర్‌ సైన్స్, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఫుడ్స్, డ్రగ్స్‌ అండ్‌ వాటర్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మెరైన్‌ కెమిస్ట్రీ, న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీ, స్టాటిస్టిక్స్, సైకాలజీ, జాగ్రఫీ.

ఎంఏ: హిస్టరీ, ఫిలాసఫీ, ఆంత్రొపాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ వర్క్, యోగా అండ్‌ కాన్షస్‌నెస్, ఇంగ్లిష్, అప్లయిడ్‌ ఎకనామిక్స్, ఎకనామిక్స్,
* ఎంజేఎంసీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎడ్, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 5
పరీక్షలు: ఆగస్టు 7,8,9 తేదీల్లో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ.

ఎంటెక్‌: అట్మాస్ఫిరిక్‌ సైన్స్, పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌.
అర్హత: సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును డిగ్రీలో చదివుండాలి. కొన్ని కోర్సులకు గ్రాడ్యుయేట్లు ఎవరైనా పోటీపడవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుకు ఇంటర్‌ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంటెక్‌ కోర్సులకు కొన్ని బ్రాంచీల్లో బీటెక్‌ లేదా కొన్ని విభాగాల్లో ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు. బీఎడ్‌ పూర్తిచేసుకున్నవాళ్లు ఎంఎడ్‌లో చేరవచ్చు.
పరీక్ష ఇలా: ఇందులో వంద మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఇస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అన్ని పీజీ కోర్సులకు మొత్తం 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌: http://audoa.in/Default1.aspx?cet=aucet

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌లలో వివిధ పీజీ కోర్సుల్లోకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. బీఏ, బీకాం, బీఎస్సీ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీపడవచ్చు. క్యాంపస్‌తోపాటు అనుబంధ కళాశాలల్లో పీజీ చదవాలనుకున్నవారు ఎస్‌వీయూ సెట్‌ -2020కి హాజరుకావాలి.
ఎస్‌వీయూ సెట్‌ ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ తరహాలో ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అన్ని పరీక్షలూ తిరుపతిలోనే నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 3 విభాగాలుంటాయి. సెక్షన్‌-ఎ 30, సెక్షన్‌- బి 30, సెక్షన్‌ సి- 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. లాంగ్వేజ్‌ పరీక్షల ప్రశ్నపత్రం మాత్రం సంబంధిత భాషలోనే ఉంటుంది. కంప్యూటర్‌ సైన్స్, హైడ్రాలజీ ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌లోనే వస్తాయి.

ఇవీ కోర్సులు
ఎంఏ: అడల్ట్‌ ఎడ్యుకేషన్, రూరల్‌ డెవలప్‌మెంట్, ఏన్షియంట్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, ఉర్దూ, సౌత్‌ ఈస్ట్‌ ఆసియన్‌ అండ్‌ పసిఫిక్‌ స్టడీస్, ఉమన్‌ స్టడీస్, ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, హిందీ, హిస్టరీ, టూరిజం, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, పర్ఫామింగ్‌ ఆర్ట్స్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ వర్క్, పాపులేషన్‌ స్టడీస్, సోషియాలజీ, సంస్కృతం, తమిళం, తెలుగు.

ఎమ్మెస్సీ: ఆంత్రపాలజీ, బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బోటనీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, అగ్రికల్చర్, జాగ్రఫీ, జియాలజీ, హైడ్రో జియాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, హోం సైన్స్, అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్, మ్యాథమాటిక్స్, ఇండ[స్టియల్‌ మైక్రో బయాలజీ, మైక్రో బయాలజీ, ఎల్రక్టానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిజిక్స్, కౌన్సెలింగ్‌ సైకాలజీ, సైకాలజీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్, వైరాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌. ఎంఎడ్, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంకాం, ఎంకాం (అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌), ఎంకాం ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 40 శాతం మార్కులతో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. కొన్ని కోర్సులకు 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
దరఖాస్తుల గడువు: జులై 5
పరీక్షలు: జులై చివరివారంలో నిర్వహిస్తారు
వెబ్‌సైట్‌: http://www.svudoa.in//svucet.aspx?cet=CET

Back..

Posted on 11-06-2020