Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంజినీర్లకు బెల్‌ ఆహ్వానం!

* మొత్తం 119 పోస్టులు

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 119 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. హైదరాబాద్‌ కేంద్రంలో 64, పుణెలో 18, మిగిలిన అన్ని చోట్లా కలిపి 37 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల్లో నియమితులైనవారు ఏడాది నుంచి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉంది.

జూనియర్‌ ఇంజినీర్‌గా ఎంపికైనవారు ఏడాది పాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థి సమర్థతల ప్రాతిపదికన మరికొన్నాళ్లు సేవలు పొడిగిస్తారు. వీరు గరిష్ఠంగా మూడేళ్లపాటు కొనసాగుతారు. వీరికి మొదటి ఏడాది రూ.25 వేలు, రెండో సంవత్సరం రూ.28వేలు, మూడో ఏట రూ.31 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్‌గా ఎంపికైనవారు రెండేళ్ల ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి. అవసరాలు, సమర్థతల ప్రాతిపదికన ఈ వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. వీరికి తొలి సంవత్సరం రూ.35 వేలు, రెండో ఏడాది రూ.40 వేలు, మూడో సంవత్సరం రూ.45 వేలు, చివరిదైన నాలుగో ఏట రూ.50 వేలు ప్రతి నెల చెల్లిస్తారు.

ఎంపిక ఎలా?
అకడమిక్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 10 మార్కులు అనుభవానికి, 15 ఇంటర్వ్యూకు కేటాయించారు. కనీస అనుభవం ఉన్నవారికి 2.5 మార్కులు ఇస్తారు. ప్రతి ఆరేళ్ల అదనపు అనుభవానికీ 1.25 మార్కులు చొప్పున కలుస్తాయి. ఇలా గరిష్ఠంగా 10 మార్కులు వేస్తారు. ఇంటర్వ్యూ ప్రత్యక్షంగా కాకుండా వీడియో రూపంలో నిర్వహిస్తారు. అకడమిక్‌ బోధననూ, పరిశోధన అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకోరు. అప్రెంటిస్‌గా పని చేసినవారూ అర్హులే.

బెల్‌ హైదరాబాద్‌లో - మొత్తం ఖాళీలు: 64
పోస్టు: ట్రెయినీ ఇంజినీర్‌
విభాగాలవారీ: ఎల్రక్టానిక్స్‌ 16, మెకానికల్‌ 11, కంప్యూటర్‌ సైన్స్‌ 6.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత
వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.

పోస్టు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌
విభాగాలవారీ ఖాళీలు: ఎల్రక్టానిక్స్‌ 22, మెకానికల్‌ 5, కంప్యూటర్‌ సైన్స్‌ 1
అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.

ట్రెయినీ ఆఫీసర్‌ ఫైనాన్స్‌: 2, ప్రాజెక్టు ఆఫీసర్‌ హెచ్‌ఆర్‌: 1 ఖాళీలు
అర్హత: ఫైనాన్స్‌ పోస్టులకు ఎంబీఏ ఫైనాన్స్‌.హెచ్‌ఆర్‌ పోస్టులకు ఎంబీఏ (హెచ్‌ఆర్‌) లేదా ఎంహెచ్‌ఆర్‌ఎం లేదా ఎంఎస్‌డబ్ల్యు (హెచ్‌ఆర్‌) అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్‌ / ఆఫీసర్‌ పోస్టులకు రూ. 500. ట్రెయినీ ఇంజినీర్‌ / ఆఫీసర్లకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబరు 22. ముందుగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం వాటి ప్రింట్‌ అవుట్‌ తీసుకుని పోస్టు ద్వారా పంపాలి. గడువు తేదీలోగా సంబంధిత చిరునామాకు చేరుకోవాలి.
చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), ఐఈ నాచారం, హైదరాబాద్‌ - 500076, తెలంగాణ.

బెల్‌ పుణెలో....
ఇక్కడ 18 ఖాళీలు ఉన్నాయి. వీటినీ ఒప్పంద ప్రాతిపదికనే భర్తీ చేస్తున్నారు వీటిలో ట్రెయినీ ఇంజినీర్‌ 9, ట్రెయినీ ఆఫీసర్‌ 2, ప్రాజెక్టు ఇంజినీర్‌ 6, ప్రాజెక్టు ఆఫీసర్‌ 1 ఖాళీలు ఉన్నాయి. వయసు, అర్హతలు, అనుభవం, వేతనం, ఎంపిక విధానం అన్నీ బెల్‌ హైదరాబాద్‌ మాదిరిగానే ఉంటాయి. సెప్టెంబరు 15లోగా దరఖాస్తు చేరేలా పంపాలి.
చిరునామా: సీనియర్‌ డిప్యూటీ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఏ), భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్, ఎన్‌డీఏ రోడ్, పాశాన్, పుణె- 411021.
వెబ్‌సైట్‌: http://www.belnindia.in/

బెల్‌ వివిధ కేంద్రాల్లో
పోస్టు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (సివిల్, ఈఈఈ, మెకానికల్‌)
మొత్తం ఖాళీలు: 37. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 01.09.2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 27, 2020.
వెబ్‌సైట్‌: https://belnindia.in/

Back..

Posted on 08-09-2020