Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలివీ....

త్రివిధ ద‌ళాల్లో ఉన్నట్టుగానే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్ఎఫ్‌)లోనూ ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, ఇంట‌ర్‌, డిగ్రీ అర్హత‌ల‌తో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా వీటికి ప్రక‌ట‌న‌లు వెలువ‌డుతుంటాయి. రాత‌ప‌రీక్ష, దేహదారుఢ్య ప‌రీక్ష, మెడిక‌ల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. జ‌న‌ర‌ల్ డ్యూటీ విభాగంలో కానిస్టేబుల్‌, స‌బ్ ఇన్‌స్పెక్టర్‌; క‌మ్యూనికేష‌న్ విభాగంలో అసిస్టెంట్ క‌మాండెంట్‌, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో మెకానిక్‌), హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆప‌రేట‌ర్‌), హెడ్ కానిస్టేబుల్ (ఫిట్టర్‌) ఉద్యోగాలుంటాయి. వీటికి కావాల్సిన అర్హత‌ల వివ‌రాలు చూద్దాం...

పోస్టుల వారీ అర్హత‌లిలా...
పోస్టు: కానిస్టేబుల్‌
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌. నిర్ధేశిత శారీర‌క ప్రమాణాలు త‌ప్పనిస‌రి.
వ‌యోప‌రిమితి: 18 - 23 ఏళ్లు (ఆగ‌స్టు 1 నాటికి) (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులుంటాయి)
శారీర‌క ప్రమాణాలు: పురుషులైతే 170 సెం.మీ. ఎత్తు, చాతీ 80-85 సెం.మీ. ఉండాలి. మ‌హిళ‌లైతే 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు త‌గ్గ బ‌రువు త‌ప్పనిస‌రి.

పోస్టు: స‌బ్ ఇన్‌స్పెక్టర్‌
అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత‌. నిర్దేశిత శారీర‌క ప్రమాణాలు త‌ప్పనిస‌రి. 170 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వ‌యోప‌రిమితి: 20 - 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి)

పోస్టు: అసిస్టెంట్ క‌మాండెంట్‌
అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత‌తోపాటు ఎన్‌సీసీ బీ లేదా సీ స‌ర్టిఫికెట్ ఉండాలి. ఏవైనా క్రీడ‌ల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం.
వ‌యోప‌రిమితి: 19 - 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి)
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

పోస్టు: అసిస్టెంట్ క‌మాండెంట్ (టెక్నిక‌ల్‌)
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో బీఎస్సీ ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: 19 - 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి)

పోస్టు: అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో మెకానిక్‌)
అర్హత‌: రేడియో అండ్ టీవీ టెక్నాల‌జీ, ఎల‌క్ట్రానిక్స్‌, టెలిక‌మ్యూనికేషన్స్‌, కంప్యూట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్ విభాగాల్లో ఎందులోనైనా డిప్లొమా లేదా ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 170 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వ‌యోప‌రిమితి: 18-25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)

పోస్టు: హెడ్ కానిస్టేబుల్ (ఆప‌రేట‌ర్‌)
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు రేడియో, టీవీ; ఎల‌క్ట్రానిక్స్ విభాగాల్లో రెండేళ్ల ఐటీఐ లేదా ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 170 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వ‌యోప‌రిమితి: 18 - 23 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి)

హెడ్ కానిస్టేబుల్ (ఫిట్టర్‌)
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు ఇంజిన్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఆటోమొబైల్‌, మోటార్ మెకానిక్ విభాగాల్లో ఎందులోనైనా రెండేళ్ల ఐటీఐ కోర్సు లేదా ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణత‌. జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 170 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వ‌యోప‌రిమితి: 18 -23 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)

వెబ్‌సైట్‌: http://bsf.nic.in/en/career.html


Back..

Posted on 18-06-2016