Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఏపీఎఫ్‌లో 179 అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టులు

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) గ్రూప్‌-ఎ అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి యూపీఎస్సీ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. డిగ్రీ అర్హత‌తో నిర్వహించే ఈ ప‌రీక్షలో ఎంపికైన‌వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్ఎఫ్‌), సెంట్రల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్సు(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌), స‌శ‌స్త్ర సీమ బ‌ల్ (ఎస్ఎస్‌బీ)ల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ హోదాలో ప‌నిచేయ‌వ‌చ్చు. వీటికి మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్‌, మెడిక‌ల్ టెస్టులు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఖాళీల వివ‌రాలు
బీఎస్ఎఫ్‌-28
సీఆర్‌పీఎఫ్‌-65
సీఐఎస్ఎఫ్‌-23
ఎస్ఎస్‌బీ-63

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: ఆగ‌స్టు 1, 2017 నాటికి క‌నిష్ఠం 21, గ‌రిష్ఠం 25 ఏళ్లు. ఆగ‌స్టు 2, 1992 కంటే ముందు; ఆగ‌స్టు 1, 1997 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమ‌తిలో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.
ప‌రీక్ష ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు ఫీజు పూర్తిగా మిన‌హాయించారు. మిగిలిన‌వాళ్లు రూ..200 చెల్లించాలి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: www.upsconline.nic.in

ప‌రీక్ష ఇలా...
అభ్యర్థులు 2 పేప‌ర్లు రాయాల్సి ఉంటుంది. ఈ రెండూ ఒకేరోజు నిర్వహిస్తారు. పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ విభాగంలో 250 మార్కుల‌కు నిర్వహిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. (ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు) ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి.
పేప‌ర్‌-2లో జ‌న‌ర‌ల్ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్సన్ అంశాలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు.
పేప‌ర్‌-1లో క‌నీస అర్హత మార్కులు సాధిస్తేనే పేప‌ర్‌-2 జ‌వాబు ప‌త్రాన్ని మూల్యాంక‌నం చేస్తారు. ఈ రెండు పేప‌ర్లలోనూ అర్హత మార్కుల సాధించిన‌వారిని మెరిట్ ఆధారంగా త‌ర్వాత ద‌శ‌కు ఎంపిక‌చేస్తారు.

త‌ర్వాత ద‌శ‌
రాత ప‌రీక్షలో అర్హుల‌కు ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ, మెడిక‌ల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీలో భాగంగా వంద మీట‌ర్ల ప‌రుగును పురుషులు 16 సెకెన్లలో, మ‌హిళ‌లైతే 18 సెకెన్లలో పూర్తిచేయాలి. అలాగే 800 మీట‌ర్ల ప‌రుగును పురుషులైతే 3 నిమిషాల 45 సెకెన్లలో, మ‌హిళ‌లు 4 నిమిషాల 45 సెకెన్లలో పూర్తిచేయాలి. మూడు ప్రయ‌త్నాల్లో పురుషులు 3.5 మీ దూరాన్ని లాంగ్‌జంప్ చేయ‌గ‌ల‌గాలి. అదే మ‌హిళ‌లైతే 3 మీ దూరాన్ని దూకాలి. షార్ట్‌పుట్‌లో భాగంగా 7.26 కి.గ్రా. బ‌రువును పురుషులు 4.5 మీ దూరంలో విస‌ర‌గ‌లగాలి. మ‌హిళ‌ల‌కు షార్ట్‌పుట్ లేదు. ఫిజిక‌ల్‌, మెడిక‌ల్ టెస్టుల్లో ఉత్తీర్ణుల‌ను ఇంట‌ర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 5, 2017
ప‌రీక్ష తేదీ: జులై 23 (ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం12 వ‌ర‌కు పేప‌ర్‌-1, మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు పేప‌ర్‌-2)
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం

సిల‌బ‌స్ (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2)
Paper I : General Ability and Intelligence

The objective type questions with multiple choices in this paper will broadly cover the following areas:
1. General Mental Ability
The questions will be designed to test the logical reasoning, quantitative aptitude including numerical ability, and data interpretation.
2. General Science
The questions will be set to test general awareness, scientific temper, comprehension and appreciation of scientific phenomena of everyday observation including new areas of importance like Information Technology, Biotechnology, Environmental Science.
3. Current Events of National and International Importance:
The questions will test the candidates’ awareness of current events of national and international importance in the broad areas of culture, music, arts, literature, sports, governance, societal and developmental issues, industry, business, globalisation, and interplay among nations.
4. Indian Polity and Economy:
The questions shall aim to test candidates’ knowledge of the Country’s political system and the Constitution of India, social systems and public administration, economic development in India, regional and international security issues and human rights including its indicators.
5. History of India :
The questions will broadly cover the subject in its social, economic and political aspects. This shall also include the areas of growth of nationalism and freedom movement.
6. Indian and World Geography:
The questions shall cover the physical, social and economic aspects of geography pertaining to India and the World.

Paper II : General Studies, Essay and Comprehension

Part-A – Essay questions which are to be answered in long narrative form either in Hindi or English totaling 80 Marks. The indicative topics are modern Indian history especially of the freedom struggle,geography, polity and economy, knowledge of security and human rights issues, and analytical ability.
Part-B – Comprehension, précis writing, other communications/language skills – to be attempted in English only (Marks 120) – The topics are Comprehension passages, précis writing, developing counter arguments, simple grammar and other aspects of language testing.

Notification

Back..

Posted on 14-04-2017