Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీడ్యాక్‌లో ఐటీ కోర్సులు

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: జూన్‌ 17
* ఆన్‌లైన్‌ పరీక్ష: జూన్‌ 23 నుంచి 30 వరకు

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌.. దాని అనుబంధ రంగాల్లో కొత్త పరిశోధనలు, యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటిల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో కోర్సులున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సీడ్యాక్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీ-సీఏటీ) నోటిఫికేషన్‌ విడుదలైంది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్ని ఉన్నత స్థాయికి చేరేలా మేధోపరమైన నిపుణులను అందించడమే సీడ్యాక్‌ ముఖ్య ఉద్దేశం. ఏటా రెండు సార్లు ప్రవేశాలకు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అగస్టు ప్రవేశాలకోసం జూన్‌లో; ఫిబ్రవరి ప్రవేశాలకు డిసెంబరులో టెస్ట్‌ ఉంటుంది.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (పీజీడీ)లో మొత్తం 13 విభాగాలున్నాయి. వీటిని ప్రధానంగా మూడు సెక్షన్లుగా విభజించి ప్రవేశ అర్హత, ఎంపిక విధానాన్ని రూపొందించారు. ప్రతి కోర్సు కాలపరిమితీ ఆరు నెలలు.
పరీక్ష కేంద్రాల ఎంపిక: దేశవ్యాప్తంగా 36కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమ సొంత ల్యాప్‌టాప్‌లో పరీక్ష రాసే వీలుంది. అందుకోసం దరఖాస్తు చేసే సమయంతో ఓన్‌ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ ఇవ్వాలి.
హైదరాబాద్‌లో: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో సీ డ్యాక్‌ సెంటర్‌ ఉంది. ఇది పీజీ డిప్లొమాలో పీజీడీఏసీ (120 సీట్లు), పీజీడీఈఎస్‌డీ (120 సీట్లు), పీజీడీఐటీఐఎస్‌ఎస్‌ (60 సీట్లు), పీజీడీవీఎల్‌ఎస్‌ఐ (40 సీట్లు), పీజీడీఎస్‌ఎస్‌డీ (60 సీట్లు), పీజీడీఏఎస్‌ఎస్‌డీ (40 సీట్లు) కోర్సులను అందిస్తోంది.
ఉద్యోగ అవకాశాలు: పీజీ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉపాధి అవకాశాలున్నాయి. సీడ్యాక్‌ కామన్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ఏటా నిర్వహిస్తోంది. ప్రతి బ్యాచ్‌ వారిని వారు చదువుతున్న సెంటర్లను బట్టీ ప్రాంతాల వారీగా విభజించి బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, నొయిడా, పుణెలో ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. దీనివల్ల దేశంలోని ఇతర సెంటర్లలో చదివే విద్యార్థులంతా సమాన ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. 2018లో సీడ్యాక్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సుమారు 300 ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో మొత్తం 80 శాతం విద్యార్థులు ఉద్యోగం సాధించారు.
మరింత సమాచారం కోసం: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌), నలంద బిల్డింగ్‌, నెం.1 శివబాగ్‌, సత్యం థియేటర్‌ రోడ్‌, అమీర్‌పేట్‌, హైదరాబాద్‌-500016, తెలంగాణ.
వెబ్‌సైట్‌: www.cdac.in
సెక్షన్‌ 1- పీజీడీ ఇన్‌ జియోఇన్‌ఫర్మాటిక్స్‌ (పీజీడీజీఐ):
అర్హత: బీఈ/ బీటెక్‌/ నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్‌ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌) లేదా నాలుగేళ్ల డిగ్రీలో జియోసైన్సెస్‌/ పెట్రోలియం/ మైనింగ్‌/ సివిల్‌/ ప్లానింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ ఉత్తీర్ణత లేదా చివరిసంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఉమ్యడి ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లో 50 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట.
సెక్షన్‌ 2- పీజీడీ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(పీజీడీఏసీ), బిగ్‌ డేటా అనలిటిక్స్‌(పీజీడీబీడీఏ), ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ(పీజీడీఐటీఐఎస్‌ఎస్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(పీజీడీఐఓటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(పీజీడీఏఐ), మొబైల్‌ కంప్యూటింగ్‌(పీజీడీఎంసీ), సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌(పీజీడీఎస్‌ఎస్‌డీ), అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌(పీజీడీఏఎస్‌ఎస్‌డీ), హెచ్‌పీసీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌(పీజీహెచ్‌పీసీఎస్‌ఏ).
అర్హత: బీఈ/ బీటెక్‌/ నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్‌ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌) లేదా ఎంసీఏ, ఎంసీఎం లేదా పీజీలో ఫిజిక్స్‌/ కంప్యుటేషనల్‌ సైన్సెస్‌/ మ్యాథమేటిక్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: సెక్షన్‌ 1 సిలబస్‌తో పాటు కంప్యూటర్‌ ఫండమెంటల్స్, సీ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, డేటా కమ్యునికేషన్‌ అండ్ నెట్‌వ‌ర్కింగ్‌, ఆబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ కాన్సెప్ట్స్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో 50 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ మూడు మార్కులు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
సెక్షన్‌ 3- పీజీడీ ఇన్‌ ఎంబడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌(పీజీడీఈఎస్‌డీ), వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌(పీజీడీవీఎల్‌ఎస్‌ఐ), బయోమెడికల్‌ ఇర్‌స్ట్రూమెంటేషన్‌ అండ్‌ హిల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌(పీజీడీబీఐహెచ్‌ఐ)
అర్హత: బీఈ/ బీటెక్‌/ నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్‌ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్‌సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణత లేదా చివరిసంవత్సరం చదువుతున్నవారు అర్హులు.
ఎంపిక విధానం: సెక్షన్‌ 1, సెక్షన్‌ 2 సిలబస్‌తో పాటు కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్స్‌పై 50 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.


Back..

Posted on 17-06-2019