Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి చేనేత కోర్సు

పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు, మూడు సంవత్సరాల డిప్లొమాలో చేరి పూర్తిచేస్తే ఉద్యోగానికి ఢోకా ఉండదని ప్రసిద్ధి. ఏమిటా కోర్సు? ఎక్కడ ఉందది? వివరాలు తెలుసుకోండి మరి!
తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక చేనేత విద్యాసంస్థ ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి 1991లో వెంకటగిరిలో చేనేతలను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ శిక్షణ సంస్థను ప్రారంభించారు. ఇక్కడి ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సులో మొత్తం 60 సీట్లు. తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 సీట్లు, తమిళనాడుకు 4, కేరళకు 3, కర్ణాటకకు 3, మహారాష్ట్రకు 2, పుదుచ్చేరి రాష్ట్రానికి 1 సీటు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగినా ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు కలిసి ఉండాలనే నిబంధనతో రెండు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంది. దీంతో ఇక్కడ సీటు దక్కడమే గగనంగా ఉంది. ప్ర¾తిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. వెబ్‌సైట్‌- www.iihtvgr.com

మూడు సంవత్సరాల కోర్సు పూర్తి కాగానే వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. ఈ విద్యార్థులు మనŒదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారు. సంప్రదాయ వస్త్రాలు తయారీ చేసే వెంకటగిరిలో ఈ కేంద్రం నెలకొల్పడం వల్ల చేనేతలకు మంచి జరగడమే కాకుండా వారి పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలకు ఆస్కారం ఏర్పడింది.

ఏ అంశాల్లో?
చేనేత శిక్షణ సంస్థలో మూడేళ్ళ డిప్లొమాలో స్పిన్నింగ్‌, డైయింగ్‌, ప్రింటింగ్‌, ఫినిషింగ్‌, డిజైన్‌, క్వాలిటీ పరీక్షలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. దేశంలో కేంద్రప్ర¾భుత్వం ఆధ్వర్యంలో సేలం, వారణాసి, గువాహటి, జోద్‌పూర్‌, బర్గర్‌, శాంతిపూర్‌లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటగిరి, చాంపా, గద్గగ్‌, కన్నూరు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. కానీ తొమ్మిది చేనేత శిక్షణ సంస్థల్లో విద్యార్థులకు లభించని ‘గార్మెంట్రీ మేకింగ్‌ టెక్నాలజీ’ శిక్షణ వెంకటగిరిలో ప్రత్యేకంగా ఇస్తున్నారు. విద్యార్థులకు షర్టు, ప్యాంట్‌, పంజాబి డ్రెస్‌, మహిళలకు సంబంధించి పలు రకాలు వస్త్రాల తయారీపై శిక్షణ ఇస్తారు. దీంతో వీరు దేశంలో ఉన్న చేనేత, జౌళి రంగంలోని పరిశ్రమల్లో కొలువులు సాధిస్తున్నారు.

విద్యార్థులకు మొదటి సంవత్సరం ఉపకార వేతనంగా రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో సంవత్సరం రూ. 1,200 నగదు అందిస్తారు. బాలురకు వసతి గృహం అందుబాటులో ఉంది.
కోర్సు పూర్తి కాగానే కళాశాలలోనే వివిధ చేనేత, జౌళి పరిశ్రమలకు చెందినవారు ప్రాంగణ ఎంపికలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. అరబ్‌, ఆఫ్రికా, చైనా వంటి దేశాల్లో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌లో వీవర్స్‌ సర్వీస్‌ కేంద్రం, జాతీయ హ్యాండ్లూమ్‌ అభివృధ్ధి కార్పొరేషన్‌, టెక్స్‌టైల్స్‌ కమిటీ, హ్యాండ్లూమ్‌ చేతివృత్తులు, ఎగుమతులు కార్పొరేషన్‌, ఆలిండియా హ్యాండ్లూమ్‌ ఫ్యాబ్రిక్స్‌ మార్కెటింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీల్లోనూ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తోంది.


Back..

Posted on 12-06-2017