Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఐఎస్ఎఫ్‌లో 487 కానిస్టేబుల్ పోస్టులు

- ఇంట‌ర్ సైన్స్ విద్యార్థులు అర్హులు

సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) ఫైర్ క్యాడ‌ర్‌లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సైన్స్ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు వీటికి పోటీప‌డ‌వ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా 487 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఏపీకి 34, తెలంగాణ‌కు 28 కేటాయించారు. పీఎస్‌టీ, పీఈటీ, రాత‌ప‌రీక్ష, మెడిక‌ల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం..

పోస్టు: కానిస్టేబుల్/ ఫైర్ (పురుషులు)
ఖాళీలు: 487 (ఇందులో ఏపీకి 34, తెలంగాణ‌కు 28 పోస్టులు కేటాయించారు.)
అర్హతః సైన్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియట్ ఉత్తీర్ణత‌. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వ‌య‌సుః 23 ఏళ్లకు మించ‌కూడ‌దు. అంటే డిసెంబ‌రు 1, 1995 కంటే ముందు; న‌వంబ‌రు 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు గ‌రిష్ఠంగా అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎంపికః ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ), రాత‌ప‌రీక్ష, మెడిక‌ల్ ప‌రీక్ష ద్వారా.
ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్టు: ఎత్తు క‌నీసం 170 సెం.మీ. ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చిన‌ప్పుడు, వ‌దిలిన‌ప్పుడు క‌నీసం 5 సెం.మీ. వ్యత్యాసం త‌ప్పనిస‌రి. ఎత్తుకు త‌గ్గ బ‌రువు ఉండాలి.
ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు: 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి.
పీఎస్‌టీ, పీఈటీ ప‌రీక్షల్లో అర్హత సాధిస్తేనే రాత ప‌రీక్షకు అనుమ‌తిస్తారు. అలాగే పీఈటీ, పీఎస్‌టీకి మార్కులు ఉండ‌వు.
రాత ప‌రీక్ష: ఇందులో వంద ప్రశ్నలు వ‌స్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు. జ‌వాబుల‌ను ఓఎంఆర్ ప‌త్రంపై గుర్తించాలి. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. ప‌రీక్షలో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌/ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, ఎలిమెంట‌రీ మ్యాథ‌మెటిక్స్‌, ఎన‌లిటిక్ ఆప్టిట్యూడ్‌/ ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ విభాగాల్లో ప్రాథ‌మికాంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి.

ఇందులో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు క‌నీసం 33 మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. అనంత‌రం రాత ప‌రీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న అభ్యర్థుల‌ను ఎంపిక‌చేసి మెడిక‌ల్ ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ విజ‌య‌వంత‌మైతే ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైన‌వారికి తాజా పే మ్యాట్రిక్స్ లెవెల్‌-3 ప్రకారం రూ.21,700 మూల‌వేత‌నం ల‌భిస్తుంది. దీంతోపాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇత‌ర ప్రోత్సాహ‌కాలు అందుతాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 11.12.2017
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.01.2018 (సాయంత్రం 5 గంట‌లు)

వెబ్‌సైట్‌

Posted on 24-11-2017

Back..