Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మౌఖిక పరీక్షలో ఎలా మెరిశారు?

ఒకరు... ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తల్లిభాషను నమ్మి, గెలుపు శిఖరం అధిరోహించారు. మరొకరు ఉద్యోగాన్ని వదిలేసి తొలి యత్నంలోనే విజయహారం ధరించారు. సివిల్స్‌ ఫలితాల్లో మూడో, ఆరో ర్యాంకులు సాధించి తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన గోపాలకృష్ణ, దినేష్‌కుమార్‌లు రేపటి అభ్యర్థులకు అద్భుత ప్రేరణ. సుదీర్ఘమైన సివిల్స్‌ ప్రస్థానంలో ఏ అభ్యర్థికైనా ఆ స్ఫూర్తే మున్ముందుకు నడిపించే చోదకశక్తి!
ఈ ఇద్దరు ప్రతిభావంతులూ కీలకమైన మౌఖికపరీక్షలో ఏ ప్రశ్నలను ఎలా ఎదుర్కొన్నారో, తమ ప్రతిభా సామర్థ్యాలను ఎలా ఆవిష్కరించుకున్నారో పరిశీలిద్దాం.

ఆత్మవిశ్వాసం... అచంచలం
గ్రామీణ నేపథ్యమున్న గోపాలకృష్ణ ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించకపోయినా ఆత్మన్యూనతకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. సివిల్స్‌ లక్ష్య సాధనలో ధీమాతో ముందుకు సాగారు. మూడు ప్రయత్నాలు అనుకూలించకపోయినా నిరాశపడలేదు. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని ఛేదించారు.
అత్యుత్తమమైన సివిల్స్‌ ప్రథమ ర్యాంకు తనకు రావొచ్చనే ఆశాభావం, నమ్మకం గోపాలకృష్ణలో ఏర్పడిందంటే తనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో గ్రహించవచ్చు. అంతే కాదు; కచ్చితమైన అంచనాతోనే ఆయన ఈ రకమైన అభిప్రాయానికి వచ్చారు. ఆయన తెచ్చుకున్న మార్కులే ఇందుకు సాక్ష్యం. మెయిన్స్‌లో 1750 మార్కులకు 936 మార్కులు సాధించారాయన. అఖిలభారత టాపర్‌కు వచ్చిన మార్కులు 927 మాత్రమే!
కానీ ర్యాంకును నిర్ణయించటంలో మౌఖిక పరీక్ష కీలక పాత్ర వహించింది. ఈ దశలో గోపాలకృష్ణకు 165 మార్కులు రాగా, టాపర్‌కు 193 వచ్చాయి. మెయిన్స్‌లో 9 మార్కులు ఎక్కువ సాధించినప్పటికీ మౌఖికపరీక్షలో తగ్గిపోవటంతో అతడికి ప్రథమ ర్యాంకు చేజారిపోయిందన్నమాట! మెయిన్స్‌+ ఇంటర్వ్యూల్లో కలిపి మొత్తం 2025 మార్కులకు వీరిద్దరి మార్కులు వరుసగా 1101; 1120.
విద్యాసామగ్రి (మెటీరియల్‌) సమగ్రంగా అందుబాటులో ఉండని తెలుగు మాధ్యమంలో మెయిన్స్‌ రాసి కూడా ఒక్కో పేపర్లో గణనీయమైన మార్కులు సంపాదించారు గోపాలకృష్ణ. ఇది ఆయన ప్రతిభను చాటుతోంది (ఆంగ్ల అంశాలను తెలుగులోకి అనువదించుకుని సొంత నోట్సు తయారుచేసుకోవటం విశేషం.)
మెయిన్స్‌లో వచ్చిన మార్కులు...
జనరల్‌ ఎస్సే: 154/250, జీఎస్‌ పేపర్‌-1: 123/250
జీఎస్‌ పేపర్‌-2: 100/250, జీఎస్‌ పేపర్‌-3: 113/250
జీఎస్‌ పేపర్‌-4: 124/250, ఆప్షనల్‌ తెలుగు పేపర్‌-1: 162/250, ఆప్షనల్‌ తెలుగు పేపర్‌-2: 160/250
మొత్తం: 936/1750
కళింగ యుద్ధం... కార్గిల్‌ యుద్ధం
విజయాన్నీ, ర్యాంకునూ తారుమారు చేయగలిగే మౌఖికపరీక్ష సివిల్స్‌లో ఎంత కీలకమో చూశారు కదా? అనువాదకుని సాయం తీసుకుని రోణంకి గోపాలకృష్ణ తన ఇంటర్‌వ్యూను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం.
(తన హాబీ బోధన అని తెలపటంతో 37 నిమిషాల మౌఖిక పరీక్ష ప్రశ్నల్లో ఎక్కువభాగం ఉపాధ్యాయ వృత్తి చుట్టూ తిరిగాయి. సమాధానాలను గోపాలకృష్ణ స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పటం; జవాబుల్లో భాగంగా తన ఆశయాలనూ, ఆచరణాత్మకమైన సహాయపడే స్వభావాన్నీ వివరంగా ఆవిష్కరించుకోవటం ప్రత్యేకంగా గమనించండి.)
తేదీ: ఏప్రిల్‌ 19, 2017
సమయం: 12.30 గంటలు
సుజాతా మెహతా ఇంటర్వ్యూ బోర్డు
నలుగురు సభ్యులు (వీరిలో ఒకరు మహిళ).
* What is Ronanki?
It is my surname sir.
* What it means? How was it involved?
‘రోణంకి’ అనేది ‘రణం’ అనే పదం నుంచి ఉద్భవించింది. మా తాత ముత్తాతలు అశోకుడి కళింగ యుద్ధంలో పోరాడారు. అలా మా ఇంటిపేరు ఏర్పడింది.
పరిచయపూర్వక ప్రశ్నల తర్వాత
Gopala krishna: Excuse me...
* Tell me.
Mam, wherever possible I speak in English. otherwise, will speak in Telugu.
* Today you are my boss. Whatever you can do, do it. Choice is yours.
Thank you mam.
* Why pupils do not join in Govt. schools?
మేడమ్‌, దీనికి చాలా కారణాలున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేవు. తరగతి గదులు లేక చెట్ల కింద బోధించాల్సివస్తోంది.పూర్తిగా తెలుగు మాధ్యమం ఉండటం వల్ల ఇంగ్లిష్‌మీడియంపై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు మొగ్గుచూపటం లేదు. పట్టణాలకు వలసలు మరో కారణం. కొందరు ఉపాధ్యాయులు అంత బాధ్యతాయుతంగా పనిచేయటం లేదు. ప్రైవేటు స్కూళ్ళు ఉదయం 7.30 గంటలకే తెరుస్తారు. పిల్లలను పంపించి 8 గంటలకే కూలిపనులకు వెళ్లటానికి కుదురుతుంది. ప్రభుత్వ పాఠశాలల సమయాలు ఆ వెసులుబాటునివ్వవు. ఇన్ని కారణాల వల్ల డబ్బుకు వెనకాడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో చేర్పిస్తున్నారు.
* Who give inspiration in your life?
(రెండు సెకన్లు ఆలోచించి) నా తల్లిదండ్రులు. ఇద్దరూ నిరక్షరాస్యులు, వ్యవసాయ రైతు కూలీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పొలాల్లో కష్టపడేవారు. మా నాన్న ఏ పని చేసినా పూర్తి దీక్షతో చేసేవారు. నేనూ సెలవుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాణ్ణి. ‘నా వృత్తిలో ఇంత బాగా చేశాను. ఫలసాయం కూడా వచ్చింది. రేపు నువ్వు చదువులో ఇంతే పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు’ అనేవారు. మా అమ్మ ప్రభావం కూడా నామీద చాలా ఉంది. ఆమె తన సాయం కోరి వచ్చేవారికి ‘లేదు’ అనకుండా తోడ్పడేది. ఎదుటివారికి ఇవ్వటంలో ఉండే ఆనందం ఆమె కళ్ళలో గమనించాను. నా తల్లిదండ్రుల కష్టాలు దగ్గరుండి చూశాను. వారే నాకు స్ఫూర్తి.
* Do you know Visakhapatnam?
Yes, a big town nearby.
* I think it is a developed area...
నగరం వరకూ చాలా అభివృద్ధి చెందింది కానీ జిల్లా పరిధి తీసుకుంటే గిరిజన జనాభా ఎక్కువ. మారుమూల ప్రాంతంలో ప్రగతికి దూరమై ఉంటున్నారు. వారిపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలి.
* Which classes do you deal?
సెకండరీ గ్రేడ్‌ టీచరుగా పనిచేస్తున్నాను. 1 నుంచి 5 తరగతుల అన్ని సబ్జెక్టులూ బోధిస్తాను.
* Advantages of mid day meal?
కేంద్రప్రభుత్వ అత్యుత్తమ పథకం ఇది. దీనివల్ల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగింది; డ్రాపవుట్లు తగ్గాయి. కుల, మత, ఆర్థిక భేదాలేమీ లేకుండా పిల్లలందరూ కలిసి భోజనం చేయటం వల్ల సమానత్వ భావన పెరుగుతుంది. పైగా ఈ పథకం మూలంగా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పైచిలుకు శ్రామికులకు ఉపాధి కూడా దొరుకుతోంది.
* How do you teach children?
నాకు దేశభక్తి గేయాలు పాడటం వచ్చు. సృజనాత్మకతతో కూడిన నూతన బోధన పద్ధతులు అనుసరిస్తాను. లో కాస్ట్‌, నో కాస్ట్‌ మెటీరియల్‌- గులకరాళ్ళు, ఆకులు, పువ్వులు, ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగించటం ద్వారా, క్షేత్రపర్యటనల ద్వారా ఆహ్లాదకరంగా బోధన సాగిస్తాను.
* Do you teach in Telugu medium or in English at primary level?
నా వరకూ నేను మాతృభాషలో బోధిస్తూ విద్యార్థులను సమర్థంగా ఆకట్టుకోగలను. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలంటూ ఎన్నో విద్యాకమిటీలు చెప్పాయి. మాజీ క్యాబినెట్‌ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం నూతన విద్యావిధాన కమిటీ దీన్నే సిఫార్సు చేసింది.
* Do you conduct teacher- parents meetings?
ఎస్‌ సర్‌. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తాను.
* Which issues are discussed?
ప్రధానంగా నాలుగు అంశాలు చర్చిస్తాము. 1) హాజరు 2)మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు 3) పాఠశాల నిధుల వినియోగంపై చర్చ 4) విద్యార్థి ప్రతిభాప్రదర్శన. ఒక టీచరుగా నాలో ఏ మార్పు కోరుకుంటారు? నేను ఏం అందించాలి? అని అడుగుతాను. వీటన్నిటివల్ల పాఠశాల అంటే గ్రామంలో అంతర్భాగం, మనది అనే భావన ఏర్పడింది. ఏ ప్రభుత్వ సంస్థ అయినా పథకం అయినా విజయవంతం కావాలంటే స్థానిక ప్రజల మద్దతు, సహాయ సహకారాలు చాలా అవసరం.
* Do you have any single teacher schools in your area?
ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. రెండు సంవత్సరాల కిందటివరకూ నేనొక్కడినే. బడి తెరవటం, బెల్‌ కొట్టటం, రికార్డులు ఇవన్నీ చూసుకునేవాణ్ణి.
* How did you deal 1 to 5th classes in all subjects?
బహుళ తరగతి విద్యాబోధన అనుసరించేవాడిని. ప్రార్థన, హాజరు తర్వాత వరసగా ఒక్కో తరగతికి బోధన, కొంత వర్క్‌ ఇవ్వటం చేసేవాణ్ణి.
* Can these students compete with the urban corporate English medium students?
Yes sir. They do wonders, they do miracles if we provide basic education and guidance. నేనే దానికి ఉదాహరణ. ప్రాథమిక విద్యనుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మాధ్యమంలో గ్రామీణ వాతావరణంలో, డిగ్రీ దూరవిద్యలో చదివినప్పటికీ ఈరోజు మీముందు నేనున్నా కదా!
* Oh, you are the best example. You proved it. Any thing can be done in rural areas under corporate social responsibility?
తప్పకుండా చెయ్యవచ్చు. ఇటీవల ఎస్‌బీఐ వారు మా పాఠశాలకు దుస్తులు, ప్లేట్లు, యూనిఫామ్‌లు, నీరు అందించారు. ఎన్‌జీవోలు కూడా తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టడం, బెంచీలు ఇవ్వటం, కెరియర్‌ గైడెన్స్‌... ఇలా చాలా అభివృద్ధి చేయటానికి వీలుంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం వార్షిక లాభాల్లో రెండు శాతం సామాజిక బాధ్యత కింద వినియోగించాలి కూడా.
* What skills must be developed in primary school? Role of teacher in student's life...
సర్‌, ఎంతటి వ్యక్తి జీవితంలోనైనా ప్రాథమిక ఉపాధ్యాయుడు చెరగని ముద్ర వేస్తాడు. భవనానికి పునాదిలాగా వ్యక్తికి ప్రాథమిక విద్యఅంత ప్రాధాన్యం. ముఖ్యంగా చిన్నవయసులో ఉపాధ్యాయులు నేర్పే విలువలు జీవితాంతం కొనసాగుతాయి. ఐదో తరగతి పూర్తయేలోపు ఈ సామర్థ్యాలపై దృష్టిపెడతాను: చదవటం, రాయటం, గణితంలోని చతుర్విధ ప్రక్రియలు, పరిసరాలపై కనీస పరిజ్ఞానం, ప్రాథమిక ఆంగ్లం, అక్షరమాట, చిన్నచిన్న పదాలు... ఇవన్నీ. దీంతో పాటు వ్యక్తిగతంగా పిల్లల్లో ఉండే ప్రత్యేక సామర్థ్యాలనూ, ఆసక్తులనూ గుర్తించి ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తాను. దీనివల్ల విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు.
* You mentioned earlier that you sing patriotic songs. Do you sing any song? (చైర్‌పర్సన్‌ అనుమతి తీసుకుని)
‘బోర్డర్లో సైనికుడా భారత్‌కీ రక్షకుడా
కార్గిల్లో కన్నుమూస్తివా ఓ సైనికుడా
మా కోసం ప్రాణాలిస్తివా...’
(పూర్తిపాట పాడాక అనువాదకుడు కార్గిల్‌ యుద్ధ వీరుల గురించిన పాట ఇదంటూ వివరించారు).
* Yes, yes. we know the essence of the song while he was singing
ఇలాంటి పాటల ద్వారా పిల్లలకు విలువలు పెంపొందిస్తాను. విలువలతో కూడిన విద్యను అందిస్తాను.
* You have done very great job. Which is your favourite subject?
నా మాతృభాష తెలుగు. 1 నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివాను. మెయిన్స్‌ కూడా ఇదే మీడియంలో రాశాను. ఆప్షనల్‌గా కూడా తెలుగునే ఎంచుకున్నాను.
* Ok. Final question. Have you observed any thing recently that can be rectified from government side?
Yes mam. ఇటీవల నేను మా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌బోగీలో ప్రయాణిస్తున్నాను. అక్కడే అంగవైకల్యమున్న 17, 19 సంవత్సరాల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. తల్లిదండ్రులు వారిని చికిత్స కోసం శ్రీకాకుళం నుంచి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితిని అడిగాను. వికలాంగ పింఛను కూడా రావటం లేదని ఆవేదనగా చెప్పారు. పీహెచ్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌, రేషన్‌ కార్డులున్నాయా అని అడిగాను. అన్నీ చూపించారు. వారు పింఛనుకు నూరుశాతం అర్హులనిపించింది. బాధపడ్డాను. మండల స్థాయిలో పాలకపార్టీవారు కాదనే నెపంతో ఇవ్వటం లేదని చెప్పారు. వాళ్ళ ఫోను నంబరు తీసుకున్నాను. మూడు రోజుల తర్వాత శ్రీకాకుళం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో వివరాలు ఇచ్చాను. 15 రోజుల్లో పింఛను మంజూరయింది. వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషంగా అనిపించింది. వికలాంగులపై ప్రభుత్వం తీరు మారాలి. పథకాలు అర్హులకు అందేలా అధికారులు చొరవ చూపాలి.
ముగింపులో చైర్‌పర్సన్‌ లేచి నుంచొని నమస్కారం చేశారు. గోపాలకృష్ణ ప్రతి నమస్కారంతో ఇంటర్వ్యూ ఘట్టం ముగిసింది.

భయం వీడితే జయం
మొదటి ప్రయత్నంలో నే సివిల్‌ సర్వీస్‌ సాధించటం... అదీ తొలి పది మంది విజేతల్లో ఒకరిగా నిలవటం మామూలు విషయం కాదు. గొప్ప పాఠశాలల్లో చదివిన నేపథ్యమేదీ లేకుండానే చిన్న వయసులోనే ఆ ఘనత సాధించాడు కొత్తమాసు దినేష్‌ కుమార్‌. విజయవాడకు చెందిన ఇతడి విజయప్రస్థానం ఆసక్తికరం!
సామాజిక సేవంటే నాకు చాలా ఇష్టం. అయినా సివిల్‌ సర్వీసెస్‌ ఆలోచన చిన్నప్పటి నుంచీ నాకేమీ లేదు. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకోవటం, తర్వాత ఇంటర్లో కష్టపడి ఐఐటీ సీటు తెచ్చుకోవటం.. మంచి ఉద్యోగం సంపాదించుకోవటం.. ఇలాంటివే లక్ష్యాలుగా ఉండేవి.
ఐఏఎస్‌ పరీక్ష గురించి ఆలోచించినపుడు ఇది మన వల్ల కాదనిపించేది. అయితే ఎన్‌ఐటీ వరంగల్‌లో చదువుతున్నపుడు ఇంజినీరింగ్‌ చివర్లో సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకుని చదవటం ఆరంభించాను. 2014లో భారత్‌ పెట్రోలియంలో ఉద్యోగంలో చేరా. మానవులతో సంబంధం లేని ఉద్యోగం... ప్రేరణ ఏమి ఇస్తుంది? అప్పుడే పూర్తిగా నిర్ణయించుకున్నా, సివిల్స్‌ రాయాలని. చేరిన ఏడాదికే కొలువు మానివేశాను.
కోచింగ్‌కు ముందే కొంత కృషి
దినపత్రికలు చదివే అలవాటు నాకు లేదు. జీకే తక్కువే. దీంతో వార్తాపత్రికలు చదవటం మొదలుపెట్టాను. వివిధ వర్తమాన అంశాల నేపథ్యం గమనిస్తూ- తెలియనివి నెట్‌లో వెతికి పరిజ్ఞానం పెంచుకుంటూ వచ్చాను. వివిధ విషయాల్లో ప్రాథమికాంశాలపై ఇలా పునాది ఏర్పరచుకున్నాను. ఎం.లక్ష్మీకాంత్‌ ‘ఇండియన్‌ పాలిటీ’ చదివాను. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను.mrunal వెబ్‌సైట్‌ లో ఉచితంగా ఎకానమీ, జాగ్రఫీ లెక్చర్లు అనుసరించాను. ఇవి సమగ్రంగా దాదాపు వేరే మెటీరియల్‌ అవసరం లేదనిపించేలా ఉంటాయి. వాటిలో వర్తమాన అంశాలు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. దిల్లీలో కోచింగ్‌ తీసుకోవటానికి ముందే ఇలా చదివివుండటం వల్ల సబ్జెక్టులు బాగా అర్థం అయ్యాయి. టెస్టుల్లో మంచి మార్కులూ రావటం మొదలైంది. నా అనుభవం ఏమిటంటే.. కోచింగ్‌కు ముందే ఎంతోకొంత నేర్చుకుంటే అదెంతో సహాయకారి అవుతుంది.
ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు తెచ్చుకుని సాధన చేసేవాణ్ణి. ఎన్ని పేపర్లు అభ్యాసం చేస్తే అంత మంచిది. ప్రిలిమ్స్‌ మార్కులు అర్హత కోసం అయినప్పటికీ దానిలో ఎక్కువ మార్కులు వస్తే మెయిన్స్‌కు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. 2016 ఆగస్టులో రాసిన ఈ పరీక్ష మొదటిపేపర్లో కీ ప్రకారం చూస్తే నాకు దాదాపు 150/200 వచ్చాయి.కటాఫ్‌ 116 మాత్రమే అయినప్పటికీ దానికంటే మించి బాగా రావటం వల్ల స్థైర్యం పెరిగింది.
మెయిన్స్‌లో టెస్ట్‌ సిరీస్‌ రాయాలి. జవాబుల సాధన చాలా ముఖ్యం. 3 గంటల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు జవాబుగా సగటున 8 నిమిషాల్లో 200 పదాలు రాయాలంటే ఎంతో సాధన అవసరం. మొదట్లో నాకు 20 ప్రశ్నలకు 4 గంటలు పట్టేది. వేగం పెంచి దాన్ని 3 గంటల్లో రాసేలా అభ్యాసం చేశాను.
ప్రణాళిక... పక్కా అమలు
ప్రతి నాలుగు నెలలకూ నిర్దిష్టంగా పఠన ప్రణాళిక వేసుకున్నాను. ఏ రోజు ఏం చదవాలనేది నిశ్చయించుకున్నాక దాన్ని కచ్చితంగా అమలు చేశాను. ఒకరోజు పాటించకపోయినా భయం వేసేది, చదవాల్సింది మిగిలిపోతుందని. అందుకే అర్థరాత్రి 3- 4 గంటలు అయినా ఆ రోజు చదవాల్సిన లక్ష్యం పూర్తిచేశాకే పడుకునేవాణ్ణి. సివిల్స్‌ లాంటి పరీక్షలో ప్రణాళిక లేకపోతే కష్టం. ఏది ముఖ్యమైనదో గ్రహించాలి. గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే అవగాహన వస్తుంది.
ఆప్షనల్‌ ఎంచుకునేటపుడు నాలుగు అవకాశాలను పరిశీలించాను. మ్యాథ్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌. సిలబస్‌ తక్కువ ఉండటం, జీఎస్‌ సన్నద్ధతకు ఉపయోగపడటం లాంటి కారణాలతో చివరిదాన్ని ఎంచుకున్నాను.
మెయిన్స్‌ ఫలితాలు వచ్చాక మౌఖిక పరీక్షకు రెండు నెలల వ్యవధి దొరికింది. గొప్ప స్కూళ్ళలో చదవకపోవటం వల్ల ఇంటర్వ్యూ విషయంలో కొంచెం భయం ఉండేది. పది రోజులు నమూనా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఎక్కడ వెనకబడ్డానో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో అక్కడ సూచనలు ఇస్తే లోపాలు సవరించుకుంటూవచ్చాను. ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై సొంత అభిప్రాయం ఏర్పరచుకోవడం ముఖ్యం..
గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తమకు తగిన శిక్షణ అవకాశాలు లేవని బాధపడనక్కర్లేదు. ఇంటర్నెట్‌లో ఎన్నో వెబ్‌ సైట్లు ఉచితంగా మెటీరియల్‌ను అందిస్తున్నాయి. యూపీఎస్‌సీ సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించకపోయినా అభ్యర్థులు నిరాశపడనవసరం లేదు. అంతటి పరీక్ష రాశాక ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, ఇంకా ఎన్నో పరీక్షలు సులువుగానే రాయొచ్చు. ఆ భరోసా ఉంటుంది కాబట్టి సివిల్స్‌ ప్రయాణంలో ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకూడదు. సన్నద్దమయ్యే క్రమాన్ని ఆస్వాదించాలి. నాకైతే మొదటిసారే సర్వీస్‌ వచ్చింది కానీ అభ్యర్థులు సాధారణంగా 3-4 సంవత్సరాలు ఆ ప్రేరణనూ, ఉత్సాహాన్నీ నిలుపుకోగలగాలి.
25- 30 నిమిషాల సేపు జరిగిన ఇంటర్‌ వ్యూ తర్వాత నాకంత సంతృప్తి కలగలేదు. సర్వీస్‌ వస్తుంది కానీ, ఐఏఎస్‌ వచ్చేంత ర్యాంకు వస్తుందనుకోలేదు. అయితే నా పరిజ్ఞానం కంటే నిజాయతీని ఎక్కువ పరీక్షించారనిపించింది. మొత్తం 1091/2025 మార్కులతో ఆరోర్యాంకు సాధించాను.
సివిల్స్‌ అభ్యరుల్లో ఎక్కువమంది మొదటిసారే విజయం సాధించలేకపోవటానికి కారణం- పరీక్ష క్లిష్టతపై పెంచుకునే భయమే. మనల్ని మనమే నమ్మకపోతే ఎలా? చెప్పాలంటే... పరీక్ష కన్నా దాని భయం నుంచి బయటపడటమే కష్టమైన విషయం. ఎక్కువ చదివితేనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఫలితం కూడా వస్తుంది. రోజుకు ఇన్ని గంటలు చదవాలనేది ముఖ్యం కాదు, సమయం వృథా చేయకూడదు. నిమిషం దొరికినా పఠనంతో సద్వినియోగం చేసుకోవాలనే దృష్టి ఉండాలి.
క్రికెట్‌ ప్లేయర్స్‌... పెల్లెట్‌ గన్స్‌
తన మౌఖికపరీక్ష ఎలా జరిగిందో దినేష్‌ ఇలా చెప్తున్నారు...
Date : May 11th, 2017
Time: 2.10 P.M.
Vinay Mittal Board.
I entered the room after taking permission and greeted the chairman and members of the Board (There were 4 Male Members and One Lady). Sir asked to have a seat and the following questions were asked.
* Why left BPCL and want to come to civil services?
First of all I take immense pride for working with Bharat Petroleum. However I choosed Civil Services as my career because Sir, civil services as a career offers bright career opportunities, diversity to work and fact that it provides opportunity to work at ground level. Also sir, when I am pursuing my hobby I realized there is much greater job satisfaction in giving back to society. Also I want show to my community that even from our community people can clear civil services.
* So for the reason of bring proud you are joining civil services?
It was due to combination of many factors and definetly it is just one of the factors.
* You are fond of cricket?
Yes Sir.
* What is going on bitween BCCI and Lodha committee?
Since BCCI does the selection of National Cricket Team, and matters related to Cricket, it is a public body. However Since it is registered as a society under Society Registration Act, there has no transparency and accountability. To solve this issue Supreme Court appointed Lodha Committee to reform BCCI. It made some recommendations in this regard.
* What are some of the recommendations?
Some of its recommendations are One State One Cricket Body, Bringing BCCI under RTI, Keeping Politicians and Bureaucrats out of the governing council.
* Why should we have One State One Body?
We need to have this because, as of now some states like Maharashtra are over represented and some states like Bihar and North Eastern States are under represented. Since I believe in the equal capability of humans in the world, I think the problem lies in lack of equal opportunities through out India, hence the creation would provide Equal opportunities.
* We have players from jharkhand also not just Mumbai?
Relatively we have many players from Maharashtra.
* How many players from Maharashtra?
As of now we have Rohit Sharma, Ajinkya Rahane and Bumrah. (I made a mistake here, Bumrah does not belong to Maharashtra).
* But only 3 players?
3 in proportion to 11 is a big number.
* Should state intervene in such matters?
Since the aim of government is to promote welfare, it should ensure level playing field in all areas be it Sports, Education, Health or Jobs, hence the intervention is justified as it is done in larger public interest.
* Don't you think one state one body is wrong? Why should we force North Eastern States to play Cricket?
I think just establishing a body we are forcing the citizens of this country, who have every right to not to play.
* Earlier you said, Lodha committee would increase transparency. How come one state one body increases transparency?
Establishing one body in every state would not increase transparency but definetly the other recommendations made by the committee would increase the transparency.
* OK, What is your opinion on election of French President Emmanuel macron?
Election of Emmanuel Macron as French President was a good sign to the liberal world, because it shows the mood of the people to vote against Protectionist Government and Rightist Government as witnessed in US president Trump and Brexit. However sir, this is just a trailer yet to be confirmed in Germany.
* Parties opposing in Germany?
Sorry Sir, I donÕt know the Rightist parties involved.
* Then why are you saying about those without knowing?
I do know that we have an Rightist Party, but I am sorry sir, I am not able to recall the name now.
* Are there any Human Right violations that are going in your state?
I do not know if there has been any popular movement, but Naxals allege that security forces commit Human Right violations.
* How will you control Corruption?
Corruption involves two sides : Supply side and Demand Side. Supply Side can be controlled by giving more voice to the people, using citizen report cards etc, whereas Demand Side can be controlled by proactive vigilance, and stringent punishments for those involved in corruption.
* What steps taken by government?
Govt taken many steps like introduction of e - governance to reduce bureaucratic and citizen interference.
* Since, you were born in Khammam, tell me few Famous things of Khammam?
Khammam is famous for the huge natural resources like Coal, its huge tribal population and forests.
* Cricket getting in favour of batsmen, what suggestions you make to bring balance?
It is indeed true that in the era of T20 the game is shifting in favour of batsman. To bring balance sir, we require some changes in bat manufacturing where Graphite Coating is used that makes batsman to clear the ropes with ease. Hence it should be done away with. Also sir, we can have stringent measures on dimensions of bat, that enables bowlers to take edge of the batsman. And lastly sir, we can make changes in powerplay restrictions to give more options to bowlers.
* Why public sector units are performing poor compared to private?
One reason I can think off is with respect to Technology. Since Public Sector refineries are established long back their technology are not relatively modern where Private refineries like Reliance are established very recently and hence sophisticated technology. Even according to the study, using various Key Performance Parameters, PSU refineries have score 74% and it now increased to 80%, hence now they are having relatively better. Also sir, PSU objective is not just profit but also Social Justice which is putting stress on Gross Refinery Margin.
* What do you think situation in Jammu and Kashmir ?
I believe that there has been no excesses as stated by the Government of India.
* What is you opinion about using Pellet guns to control the mob?
Gun represents violence, hence use of gun in any form should be avoided, however sir, maintaining law and order was of utmost priority for the government, hence Pellet Gun being LEAST lethal weapon, is advised over others. Government constituted a committee, whose recommendations can be followed.


Back..

Posted on 07-06-2017