ఇంజినీరింగ్ పట్టభద్రులకు శుభవార్త! మనదేశంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ ‘కోల్ ఇండియా లిమిటెడ్’ 1319 మేనేజ్మెంట్ ట్రెయినీ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దరఖాస్తు వ్యవధి కొద్దిరోజులే ఉంది; పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే కార్యాచరణలోకి దిగటం తక్షణ కర్తవ్యం!
‘మహారత్న’ సంస్థగా పేరుపొందిన కోల్ ఇండియా దేశంలోని 8 రాష్ట్రాలలో (పశ్చిమ బంగ, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, అసోం) తన కార్యకలాపాలను విస్తరించింది. ఈ సంస్థలో సుమారు 3.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలో విద్యుదుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న, ఈ సంస్థలో ఉద్యోగం చేయడం గౌరవప్రద విషయం. ఉత్సాహవంతులైన ఇంజినీరింగ్ పట్టభద్రులకు చక్కటి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది ఈ సంస్థ. కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు ఉత్పాదకతలో ప్రపంచంలోనే పెద్ద కంపెనీ. మనదేశ బొగ్గు ఉత్పత్తి మొత్తంలో 84% ఈ సంస్థ నుంచే ఉత్పత్తి అవుతోంది. దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 72% విద్యుత్ ఉత్పత్తి చేయటానికి ఈ సంస్థ సహకరిస్తోంది. ఈ సంస్థ 1319 ఖాళీలతో వివిధ రకాలైన ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్లో పట్టభద్రులైన నిరుద్యోగ, చిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం.
కోల్ ఇండియా లిమిటెడ్లో 1319 ఉద్యోగాలు
- ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, లా ...గ్రాడ్యుయేట్లకు అవకాశం
- ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు
- రుణాత్మక మార్కులు లేవు
భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్) 1319 మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటిలో ఎక్కువ ఖాళీలు ఇంజినీరింగ్ విభాగాల నుంచే ఉన్నాయి. సీఏ, ఐసీడబ్ల్యుఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, సోషల్ వర్క్ తదితర కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలూ ఉన్నాయి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రుణాత్మక మార్కులు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 1319
విభాగాలవారీ ఇలా...