Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కామర్స్‌ రంగంలో... ఎస్‌ఏపీ హానా హవా!

వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి సాంకేతికత వేగంగా చొరబడుతోంది. అందుకు అనుగుణంగా చదువులూ, నైపుణ్యాల తీరుతెన్నులు మారుతున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే పోటీ ప్రపంచంలో మనుగడ. ఇటీవల వ్యాపారరంగ సాఫ్ట్‌వేర్లలో SAP తీసుకొచ్చిన పెనుమార్పు SAP S/4 HANA. ఆ కోర్సు సర్టిఫికేషన్‌ పరీక్ష వివరాలు...

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు సంప్రదాయ SAP ECC నుంచి SAP S/4 HANA వైపు అడుగులు వేస్తున్నాయి. హానాలోని సరికొత్త టెక్నాలజీ అయిన ఇన్‌హౌజ్‌ మెమరీ వల్ల డేటా ప్రాసెసింగ్‌ వేగంగా జరుగుతుంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. కామర్స్‌ రంగ నేపథ్యం ఉన్నవారికి సహజంగా ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సులువుగా అవగాహన అవుతాయి. అందుకని ప్రధానంగా కామర్స్‌ వృత్తివిద్యా కోర్సులయిన సీఏ, సీఎంఏ లేదా అకడమిక్‌ కోర్సులైన ఎంబీఏ, ఎంకామ్‌, బీకామ్‌ పూర్తిచేసినవారూ, విద్యార్థులూ హానా సర్టిఫికేషన్‌ చేయవచ్చు. ఎస్‌ఏపీ పాత వర్షన్‌ అయిన ఈసీసీలో ఎస్‌ఏపీ ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌/ యూజర్‌గా పనిచేస్తున్నవారు కూడా ఈ సర్టిఫికేషన్‌ చేయవచ్చు. ఎస్‌ఏపీ గత వెర్షన్‌ ఎస్‌ఏపీ ఈసీసీతో హానాను పోల్చిచూస్తే ప్రధాన మార్పులు ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ మాడ్యూల్‌లో ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ఎస్‌ఏపీ ఎస్‌/4 హానా ఫైనాన్షియల్‌ ఎకౌంటింగ్‌ సర్టిఫికేషన్‌ పరీక్ష పూర్తిచేసినవారు వారి కెరియర్లో మరో మెట్టు ఎక్కటానికి అవకాశం ఏర్పడుతోంది.

సర్టిఫికేషన్‌ స్థాయులు ఎలా?
1) C-TS4FI-1610:అసోసియేట్‌ లెవల్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ (కొత్తగా నేర్చుకునేవారికి).
2) C-TS4CO-16:అసోసియేట్‌ లెవల్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (CT-S4-F-I1610 పూర్తిచేసినవారికి).
3) P-S4FIN-1610: ప్రొఫెషనల్‌ లెవల్‌ (పై రెండు కోర్సులూ పూర్తిచేసినవారికి మాత్రమే).

ఎస్‌ఏపీ ఎస్‌/4 హానా ప్రత్యేకతలు
హానా ఫైనాన్షియల్‌ ఎకౌంటింగ్‌లో ఎస్‌ఏపీ చాలా కొత్త కాన్సెప్టులు, ఫంక్షనాలిటీలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యమైనవి-
* యూనివర్సల్‌ లెడ్జర్‌
* న్యూ ఎసెట్‌ అకౌంటింగ్‌
* క్యాష్‌ మేనేజ్‌మెంట్‌
* ఎఫిషియెంట్‌ రిపోర్టింగ్‌
* ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ యాక్సిలరేటెడ్‌ ఫైనాన్షియల్‌ క్లోజింగ్‌
* ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ ప్లానింగ్‌

ప్రశ్నలు ఏ తీరులో ఉంటాయి?
C-TS4FI-1610 సర్టిఫికేషన్‌ పరీక్షలో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో మూడు రకాలుగా ఉంటాయి.
ఎ) ఒక సమాధాన ప్రశ్నలు
బి) రెండు సరైన సమాధానాల ప్రశ్నలు.
సి) బహుళ అంటే మూడు సరైన సమాధానాల ప్రశ్నలు.

ఇలా తయారవ్వాలి
SAP S/4 హానా సర్టిఫికేషన్‌ పరీక్ష మెటీరియల్‌పై పట్టు సాధించాలి. ప్రతి అంశం చివర్లో ఇచ్చిన అంచనా ప్రశ్నలను జాగ్రత్తగా నేర్చుకోవాలి.
* పరీక్ష తేదీకి 3 నెలల ముందు నుంచి రోజుకు కనీసం 2 గంటలు అధ్యయనానికి కేటాయించాలి.
* చిన్న ప్రశ్నలకు ముందుగా సమాధానం రాసిన తర్వాత పెద్దవాటి జోలికి వెళ్లాలి.
* పరీక్షలో రుణాత్మక మార్కులు లేవు కాబట్టి, అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఉత్తమం.
* జవాబులు గుర్తించలేని ప్రశ్నలను బుక్‌మార్క్‌ చేసుకుని చివర్లో పూర్తిచేయాలి.
* తికమక పెట్టే ప్రశ్నలను రెండు లేదా మూడుసార్లు చదివి సమాధానాన్ని ఎన్నుకోవాలి.
* చివరి 15- 20 నిమిషాలు పూర్తిగా సమీక్షకు కేటాయించాలి. ఆ సమయంలో కొత్త ప్రశ్నలవైపునకు వెళ్లకపోవడమే మంచిది.

చివరగా...
SAP S/4 హానా ఇప్పుడు మార్కెట్‌లో తాజా టెక్నాలజీ. ముందుగా నేర్చుకున్నవారికి కెరియర్‌ అవకాశాలు ఇతరులకంటే మెరుగ్గా ఉంటాయి. హానా ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ సర్టిఫికేషన్‌ను పూర్తిచేయడం వల్ల ఈ కొత్త టెక్నాలజీపై పట్టు సాధించవచ్చు. ఫార్చ్యూన్‌ 500 సంస్థల్లో ఇప్పుడు ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నారు కాబట్టి, సర్టిఫికేషన్‌ పూర్తిచేసినవారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుంది.

ఏ ఉద్యోగాలు?
ఎస్‌ఏపీ హానాను లక్ష కంపెనీల్లో వచ్చే కొద్ది సంవత్సరాల్లో అమలుచేసే అవకాశం ఉంది. మనదేశంలో పూర్తిగా అమలుచేస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతోంది. వాటిలో ముఖ్యమైనవి: అశోక్‌ లేలాండ్‌ (వాణిజ్యపరమైన వాహనాల ఉత్పత్తి), డీసీఎం శ్రీరామ్‌ (గ్రామీణ వ్యవసాయాధారిత వ్యాపారం), ఉషా ఇంటర్నేషనల్‌ (వంటింటి ఉపకరణాలు), ఏషియన్‌ పెయింట్స్‌ (గృహోపకరణాలు, పెయింట్స్‌), ఎవాన్‌ సైకిల్స్‌ (సైకిళ్లు, వ్యాయామ సంబంధ పరికరాలు), కర్లాన్‌ (పరుపులు).అనుభవాన్ని బట్టి సర్టిఫికేషన్‌ పూర్తిచేసినవారు ఫైనాన్షియల్‌ కన్సల్టెంటుగా, ప్రాజెక్ట్‌ లీడర్‌గా చేరవచ్చు. ఫైనాన్స్‌ విభాగం పెద్దది అయినపుడు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా కూడా అవకాశం ఉంటుంది. ఫైనాన్స్‌ విభాగంలో సర్టిఫికేషన్‌ పూర్తిచేసినవారికి వివిధ స్థాయుల్లో ప్రాధాన్యం ఉంటుంది ఉదా: చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌, అకౌంటెంట్‌ మొదలైనవి. ఇదివరకే ఉద్యోగం చేస్తున్నవారికి ఈ సర్టిఫికేషన్‌ ఉపయోగమే.


Posted on 04-12-2017

Back..