Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఏడు విశ్వవిద్యాలయాలకు ఏకైక పరీక్ష

తెలంగాణలోని ఏడు ప్రధాన విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో వివిధ రకాలైన పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌లో మొత్తం 60 సబ్జెక్టులకు ఒకే ఉమ్మడి పరీక్ష - కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ - 2019) ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించబోతోంది.

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌: ఇందులో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్‌, ఎంబీఏ కోర్సులను అందిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా రెండో సంవత్సరం పరీక్షలు రాసినవారు అర్హులు. కాలపరిమితి అయిదు సంవత్సరాలు. కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. బయోటెక్నాలజీ కోర్సు కాకతీయ యూనివర్సిటీలో, ఎంఏ ఎకనామిక్స్‌ తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఎంబీఏ కోర్సు తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది.

పీజీ డిప్లొమా కోర్సులు: రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌, అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, ఆర్కైవల్‌ సైన్స్‌ అండ్‌ మాన్యుస్క్రిప్టాలజీ, చైల్డ్‌ సైకాలజీ, డిజిటల్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఫంక్షనల్‌ హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, జియోగ్రఫికల్‌ కార్టోగ్రఫీ, మ్యూజియాలజీ, సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌, సెరికల్చర్‌ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. డిగ్రీ/ మాస్టర్స్‌ ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు అర్హులు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, సైన్స్‌ రంగాల్లో 44 రకాల కోర్సులను అందిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు అర్హులు.

పరీక్ష విధానం ఎలా?
అన్ని కోర్సులకూ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ కోసం రాసే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఉన్న సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. మాస్టర్స్‌ కోర్సులకు డిగ్రీలో చదివిన సిలబస్‌ ఆధారంగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ కోర్సుకు పరీక్ష రాసేవారికి కెమిస్ట్రీలో 40, బయోటెక్నాలజీలో 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, జెనిటిక్స్‌, మైక్రోబయాలజీలకు కెమిస్ట్రీ 40, మిగతా 60 మార్కులకు బీఎస్సీలో చదివిన ఏదైనా సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఆబెక్టివ్‌ తరహాలో ఉండే ప్రశ్నలు అనాలజీస్‌, క్లాసిఫికేషన్‌, మ్యాచింగ్‌, రిసెర్చ్‌/ ప్రయోగాలు తదితరాలపై పారాగ్రాఫ్‌ ప్రశ్నలు ఉంటాయి.

సీపీజీఈటీతో విద్యార్థికి మేలు
కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష వల్ల విద్యార్థికి సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. గతంలో ఒక్కో యూనివర్సిటీలో ప్రవేశాలకు వాటి సొంత ప్రవేశ పరీక్షలు ఉండేవి. దీనివల్ల విద్యార్థి అన్ని పరీక్షలు రాసి సీటు వస్తుందో రాదో అని గందరగోళంలో ఉండేవాడు. ఈ ఉమ్మడి పరీక్ష విధానం వల్ల దాన్ని దూరం చేయవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటతో సంబంధం లేకుండా డిగ్రీ కళాశాలలన్నీ ఒకే రకమైన ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీసీఎస్‌ఈ)ను అందిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు సీపీజీఈటీ రాయడానికి ఏ సమస్యా ఉండదు. ఇంటర్‌ విద్యార్థులకు అందించే ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల వల్ల ఒకేసారి డిగ్రీతో పాటు పీజీ కూడా పూర్తి చేయవచ్చు. ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు, డిగ్రీలో చదువుకున్న సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు దాని ప్రకారం సాధన చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు.
- నాయ్‌కోటి కిషన్‌, ప్రవేశపరీక్ష కన్వీనర్‌

సీపీజీఈటీ - 2019 (చివ‌రి తేది: 30.05.19)

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివ‌ర్సిటీల్లో 2019 - 20 ఏడాదికిగానూ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్షకు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
ఈ పరీక్ష ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది.
వివ‌రాలు....
కోర్సులు: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములు
విభాగాలు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ
ప్ర‌వేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, మ‌హాత్మా గాంధీ, పాలమూరు, శాత‌వాహన‌, జ‌వ‌హర్‌లాల్ నెహ్రు టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ.
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. చివ‌రి ఏడాది ప‌రీక్షలు రాసిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ప‌రీక్ష తేదీ: 14.06.2019
ఫీజు: ఓసీ/ బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు రూ.600.
ఎంపిక విధానం: ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 30.05.2019 (అప‌రాద రుసుం రూ. 2000తో 11.06.2019 వ‌ర‌కు)

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌


Back..

Posted on 30-04-2019