Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ - 2019

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌కు ప్రకటన వెలువడింది. ఈ పరీక్షను మొదటిసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలో ఉన్న ప్రయోగశాలల్లో గానీ, సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లోగానీ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌ అర్హత పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో యూజీసీ గుర్తింపు పొందిన అధ్యాపకులుగా బోధించవచ్చు.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌లో సైన్స్‌ విభాగానికి సంబంధించి ఐదు సబ్జెక్టుల్లో పరీక్షలుంటాయి. అవి
1) కెమికల్‌ సైన్సెస్‌
2) ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌
3) లైఫ్‌ సైన్సెస్‌
4) మ్యాథమేటికల్‌ సైన్సెస్‌
5) ఫిజికల్‌ సైన్సెస్‌.
ఎమ్మెస్సీ / ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌లో 55% మార్కులతో ఉత్తీర్ణులైతే నెట్‌ రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ., పీహెచ్‌ విద్యార్థులు 50% మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఈ కోర్సుల్లో ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులూ అర్హులే. సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌కి ఎంపికై పరిశోధన చేసే అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలూ ప్రతి నెలా రూ. 31,000/- చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. ప్రతి సంవత్సరం రూ. 20,000/- చొప్పున అభ్యర్థి పరిశోధన చేసే సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ ఇస్తారు.

ఏ సబ్జెక్టులు ఎలా?
లైఫ్‌ సైన్సెస్‌: ఎమ్మెస్సీ బోటనీ/ జువాలజీ చేసి లైఫ్‌ సైన్స్‌ పరీక్ష రాసే విద్యార్థులు ఆధునిక బయాలజీ (మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్, బయోఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపి)ల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీ మొదలైనవి ముఖ్యం.

కెమికల్‌ సైన్సెస్‌: కెమికల్‌ సైన్స్‌ పరీక్ష రాసేవారు ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎస్‌మెట్రిక్‌ సింథసిస్, కన్ఫర్మేషన్‌ అనాలిసిస్‌, ఆర్గానిక్‌ స్పెక్ట్రోస్కోపి, రియేజెంట్స్, పేరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయన శాస్త్రం తదితర అంశాలను, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్‌ క్లస్టర్స్, ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌స్టేట్, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపి, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. కెమికల్‌ సైన్స్‌ పరీక్ష రాసే విద్యార్థులకు సిలబస్‌ అధికం కాబట్టి ఎమ్మెస్సీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ ఫిజికల్‌ కెమిస్ట్రీ/ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ చదివినవారు మిగతా రెండు కెమిస్ట్రీ విభాగాల్లోని ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.

ఫిజికల్‌ సైన్సెస్‌: ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష రాసే విద్యార్థులు మోడ్రన్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ అండ్‌ పార్టికల్‌ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, (క్లాసికల్‌- స్టాటిస్టికల్‌), ఎలక్ట్రోమాగ్నిటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్‌ సబ్జెక్టులను సమగ్రంగా అధ్యయనం చేయాలి.

మ్యాథమేటికల్‌ సైన్సెస్‌: మ్యాథమేటిక్స్‌లో స్టాటిస్టిక్స్, ఎక్స్‌ప్లొరేటరీ డేటా ఎనాలిసిస్, కాంప్లెక్స్‌ - డిఫరెన్షియల్‌ ఎనాలసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి. పీజీ సిలబస్‌ మొత్తం ఈ పరీక్ష కోసం చదవాల్సిన అవసరం లేదు. కారణం పార్ట్‌-సి లోని ప్రశ్నలకు చాయిస్‌ ఉంది.

సింగిల్‌ ఎంసీక్యూ పరీక్ష తాత్కాలిక తేదీ: 15.12.2019
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ముగింపు: 9.10.2019
website: www.csirhrdg.res.in

పరీక్షా విధానం
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌) పరీక్ష వ్యవధి 3 గంటలు. అన్ని ప్రశ్నలూ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. మార్కులు 200. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. పార్ట్‌- ఎ, పార్ట్‌- బి, పార్ట్‌- సిలకు విడివిడిగా కటాఫ్‌ ఉండదు. మొత్తం మార్కులకు మాత్రమే కటాఫ్‌ ఉంటుంది.
పార్ట్‌-ఎ: అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ ఎనాలిసిస్, ఎనలిటికల్‌- న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్‌ ఫార్మేషన్, పజిల్స్‌పై 20 ప్రశ్నలు ఇస్తారు. 15 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు 2 మార్కులు. పార్ట్‌-ఎకు కేటాయించిన మొత్తం మార్కులు 30.
పార్ట్‌-బి: ఈ విభాగంలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. 20 నుంచి 35 ప్రశ్నలు అడగవచ్చు. ఈ పార్ట్‌-బికి కేటాయించిన మార్కులు 70. ఈ విభాగంలో బేసిక్‌ కాన్సెప్టులు, డిగ్రీ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. సంబంధిత సబ్జెక్టుల డిగ్రీ సిలబస్‌నూ క్షుణ్ణంగా చదవాలి. .
పార్ట్‌-సి: ఈ విభాగంలో సైంటిఫిక్‌ కాన్సెప్టులపై అవగాహన, అన్వయంపై ఉన్నతస్థాయి ప్రశ్నలు అడుగుతారు. అవి అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. 200 మార్కుల్లో పార్ట్‌-సికి 100 మార్కులను కేటాయించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ సిలబస్‌ను ప్రాక్టికల్‌ ధోరణిలో అధ్యయనం చేయాలి. అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయాల్సిన అవసరం లేదు. అందుకని పీజీ సిలబస్‌లో కొన్ని ముఖ్యమైన 10- 15 అంశాలపై దృష్టిపెట్టాలి. ప్రశ్నలకు అధిక వెయిటేజి ఉన్నందున ప్రామాణిక రిఫరెన్స్‌ పుస్తకాలు, రిసర్చ్‌ జర్నల్స్‌ను అన్వయ ధోరణిలో అధ్యయనం చేయాలి. నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. కచ్చితంగా తెలిస్తేనే సమాధానాలు గుర్తించాలి.

6 గంటల సన్నద్ధత, 2 గంటలు రివిజన్‌
* సీఎస్‌ఐఆర్‌ నెట్‌ సిలబస్‌ను పూర్తిగా పరిశీలించి, అన్ని టాపిక్స్‌ను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి.
* సిలబస్‌కు అనుగుణమైన ప్రామాణిక గ్రంథాలూ, మెటీరియల్‌ను సేకరించుకోవాలి.
* నెట్‌ విధానాన్ని అర్థం చేసుకొని, పరీక్షలో అర్హత పొందడానికి అవసరమైన స్కోరును గుర్తించాలి.
* నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకొని, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
* సగటు విద్యార్థులు చాలామంది గతంలో ఈ పరీక్షలో జె.ఆర్‌.ఎఫ్‌., లెక్చరర్‌షిప్‌ అర్హత సాధించారు. సగటు విద్యార్థి ఇప్పటి నుంచి ప్రతి రోజూ 8 గంటల నుంచి 10 గంటలు కష్టపడితే సులభంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు.
* రోజుకి కనీసం 6 గంటలు ప్రిపరేషన్‌కు, 2 గంటలు రివిజన్‌కీ కేటాయించాలి.
* ముఖ్యమైన, అధిక వెయిటేజి ఉన్న అంశాలను మొదట ప్రారంభించి సిలబస్‌ను పూర్తిచేయాలి.
* పూర్వపు ప్రశ్నపత్రాలను సమగ్రంగా అధ్యయనం చేసి, సాల్వ్‌ చేయాలి.
* సిలబస్‌ పరిధి విస్తృతంగా ఉంది. అందుకని ప్రతి టాపిక్‌నూ సమగ్రంగా అధ్యయనం చేయటం కష్టం. గత ప్రశ్నపత్రాల సాధన ద్వారా ముఖ్యమైన టాపిక్‌లను గుర్తించి ప్రిపరేషన్‌ సాగించాలి.
* మాదిరి ప్రశ్నపత్రాలను ఒక నెల ముందు నుంచి ఆన్‌లైన్‌ద్వారా సాధన చేయాలి. లోపాలను సరిదిద్దుకుంటూ సామర్థ్యాలను పెంచుకోవాలి.

ఉపయోగపడే పుస్తకాలు
కెమిస్ట్రీ
Organic Chemistry : Clayden, Carey Sundberg, William Kemp, Nasi Puri, Carruthers,Smith.
Physical Chemistry : P.W.Atkins, K.L.Kapoor, Mc.Quarie, Banwell
Inorganic Chemistry : Huheey, Shriver & Atkins, Cotton & Wilkinson.

బయాలజీ
Biochemistry : Voet & Voet, Albert Lehninger
Microbiology : Prescott
Cellbiology : Alberts, Lodish
Molecular Biology : Weaver
Immunology : Kuby
Genetics : Griffith, Suzuki
Animal Physiology : Nielsen
Plant Physiology : Teiz and Zeiger

మ్యాథ్స్‌
Algebra : Bhattacharya, Devid C Lay
Calculus : M.J.Strauss, H.Anton
Real Analysis : Shanti Narayan, Richard R Goldberg
Differential Equations : Sastri SS, Collins P.J.
Complex Numbers : Murry R Spiegel
Probability of Statistics : C.E.Weatherban, Das Gupta, Ray & Sharma

ఫిజిక్స్‌
Mechanics : D S Mathur, Daniel
Waves and Optics : D R Brown, N K Bajaj
Electricity & Magnetism : D C Tayal, Edward M Purcell
Kinetic Theory & Thermodynamics : D John, Charles E Hecht
Modern Physics : D.C. Pandey, B L Theraja
Solid State Physics : S.P. Singh, D.K. Bhattacharya

- ఎస్‌. కిరణ్‌కుమార్‌


Back..

Posted on 09-10-2019