Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రవేశాలకు 'కేంద్రీయ' ప్రణాళిక

     ఉత్తమ విద్యాప్రమాణాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పేరుపొందాయి. వీటిలో ఏ కోర్సు చదివినా ఉజ్వలమైన అవకాశాలకు దారిచూపుతాయి. మన దేశంలోని 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా ఒక ప్రవేశ పరీక్ష (సీయూ సెట్‌)ను నిర్వహిస్తున్నాయి. ప్రకటన వెలువడిన నేపథ్యంలో దీనికి తయారయ్యే విధానం గురించి తెలుసుకుందాం!
సంప్రదాయబద్ధమైన కోర్సులూ, విభిన్న తరహా ఆధునిక కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ పీజీలో చదవటానికి సీయూ సెట్‌ మంచి అవకాశం. ఈ సంయుక్త ప్రవేశపరీక్షలో భాగస్వామ్యం ఉన్న విశ్వవిద్యాలయాలు:
1. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హర్యానా www.cuh.ac.in
2. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ www.cujammu.ac.in
3. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఝార్ఖండ్‌ www.cuj.ac.in
4. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కశ్మీర్‌ www.cukashmir.ac.in
5. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ www.cukerala.ac.in
6. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ www.cup.ac.in
7. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ www.curaj.ac.in
8. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తమిళనాడు www.cutn.ac.in.
ఈ పరీక్షలో అభ్యర్థి సాధించిన ర్యాంకు ఆధారంగా అర్హతలను బట్టి 3 రకాల ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లభిస్తుంది. 1. అండర్‌ గ్రాడ్యుయేట్‌ & ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ 2. పీజీ , ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ బీఈడీ & పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ 3. ఎంఫిల్‌ & పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌
ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మాత్రమే పరీక్ష కేంద్రం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేముందు ఈ కిందివి సిద్ధంగా ఉంచుకోవాలి- ఈ మెయిల్‌ ఐడీ, స్కాన్‌ చేసిన ఫొటో, స్కాన్‌ చేసిన సంతకం. ఆన్‌లైన్‌ చెల్లింపు కోసం క్రెడిట్‌ కార్డు/ ఏటిఎం కార్డు/ నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించాలి.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ & ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌
ఈ ప్రోగ్రామ్‌లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులైన ఎంటెక్‌, ఎంఎస్‌సీ, ఎంబీఏ, ఎంఏ, బీఎస్‌సీ, బీఈడీ మొదలైన కోర్సులకు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో విభిన్న తరహా కోర్సులైన నానో టెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, ఎనర్జీ ఇంజినీరింగ్‌, వాటర్‌ ఇంజినీరింగ్‌ & మేనేజ్‌మెంట్‌లను అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ ప్రోగ్రామ్‌లో సంప్రదాయబద్ధ కోర్సులైన మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ కెమిస్ట్రీలున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ, బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ ఎకనామిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ మొదలైన విభిన్న కోర్సులను అందిస్తున్నారు.
అర్హత: ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఈడీ ప్రవేశ పరీక్షకు 10+ 2లో ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు అర్హులు.
ప్రవేశ పరీక్షవిధానం
ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ అన్ని కోర్సులకూ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఈడీ కోర్సుకూ ఒకే ప్రవేశ పరీక్షను (UGC001) నిర్వహిస్తున్నారు. పార్ట్‌-ఎ: ఈ విభాగంలో లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మేథమేటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌ మొదలైనవాటి నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సరైన సమాధానాలు రాయాలి. పార్ట్‌-బి: దీనిలో 4 రకాల సంబంధిత సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఏవైనా 3 సెక్షన్లలో మొత్తం 75 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గుర్తించాలి.
సెక్షన్‌-1లో ఫిజిక్స్‌, సెక్షన్‌-2లో కెమిస్ట్రీ, సెక్షన్‌-3లో మేథమేటిక్స్‌, సెక్షన్‌-4లో బయాలజీ (బోటనీ, జువాలజీ) 10+2 సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి పరీక్షకూ కాలవ్యవధి 2 గంటలు.
మన తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్‌ విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈ పరీక్షలకు సంసిద్ధులై ఉంటారు కాబట్టి పార్ట్‌-బి విభాగంలోని సిలబస్‌ వారికి సుపరిచితమే. అందుకని పార్ట్‌-ఎలో అడిగే ప్రశ్నలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పార్ట్‌-బిలోని ప్రశ్నలు జేఈఈ మెయిన్స్‌ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎకనామిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ మొదలైన కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- UGC02. దీనిలో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి ఉంటాయి. రెండు పార్ట్‌లకు కలిపి 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌, రీజనింగ్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌లో ఇస్తారు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. సీయూ సెట్‌కు నమూనా పరీక్షలు రాసి లోపాలు సరిదిద్దుకోవడం ముఖ్యం. ప్రతిరోజూ సాధన చేస్తే వేగం, కచ్చితత్వం అలవడతాయి. సమయ నిర్వహణ కూడా సాధ్యమవుతుంది.
సీయూ సెట్‌కు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ స్థాయి సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అనువర్తిత కోణం చాలా ముఖ్యం. తమ డిగ్రీ సిలబస్‌తో సీయూసెట్‌ సిలబస్‌ను పోల్చి చూసుకుని అదనపు అంశాలను రిఫరెన్స్‌ బుక్స్‌, ఆన్‌లైన్‌ సమాచారం ఆధారంగా అధ్యయనం చేయాలి. ప్రవేశపరీక్ష సిలబస్‌ను యూజీసీ- సీఎస్‌ఐఆర్‌/ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌నే తీసుకున్నారు. పూర్తి వివరాలకు www.cucet2015.co.in ను సంప్రదించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 6 ఏప్రిల్‌, 2015
ఆన్‌లైన్‌ దరఖాస్తు ముగింపు: 5 మే, 2015
అడ్మిట్‌ కార్డు అప్‌లోడ్‌ చేసే తేదీ: 21 మే, 2015
పరీక్ష తేదీలు: 6, 7 జూన్‌, 2015
వెబ్‌సైట్‌లో స్కోర్‌ రిపోర్ట్‌ను అప్‌లోడ్‌ చేసే తేదీ: 18 జూన్‌, 2015.

posted on 13.4.2015