Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం?

* పోటీ పరీక్షల కోసం వర్తమాన అంశాలు

పోటీ పరీక్షల్లో కీలకమైన వర్తమాన అంశాలను తెలుసుకుంటూనే వాటిని ఏ రకమైన ప్రశ్నలుగా అడుగుతారో గమనిస్తుండాలి. ఇచ్చే నాలుగు జవాబులూ సరైనవే అనిపిస్తాయి. అందుకే కచ్చితమైన జవాబులు గుర్తించటంలో పొరపాటు పడకూడదు. ఇటీవల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో జరిగిన విభిన్న రంగాల ముఖ్య సంఘటనలు ప్రశ్నలుగా ఎలా వచ్చే అవకాశముందో పరిశీలిద్దాం!

జాతీయం
1. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?(మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన, నేషనల్‌ లిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ- ఎంవీయే’ ప్రభుత్వం కొలువు దీరింది. ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు ఆరుగురు కేబినెట్‌ మంత్రులతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర శాసనసభలోగానీ, శాసనమండలిలోగానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్‌ఠాక్రే 8వ నేత.)
1) 2019 నవంబరు 26 2) 2019 నవంబరు 27 3) 2019 నవంబరు 28 4) 2019 నవంబరు 29
2. భారత సైనిక సామర్థ్యాన్ని పరిపుష్టం చేస్తూ ఎంత మొత్తంతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు 2019 నవంబరు 28న రక్షణ శాఖ ఆమోదం తెలిపింది?
1) రూ. 20,800 కోట్లు 2) రూ. 22,800 కోట్లు 3) రూ. 24,800 కోట్లు 4) రూ. 26,800 కోట్లు.
3. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు ఏ నగరానికి చెందిన స్కూబా డైవర్లు విశేష కృషి చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 నవంబరు 24న తన మన్‌కీబాత్‌ ప్రసంగంలో ప్రశంసించారు? (సుభాష్‌ చంద్రన్‌ ఆధ్వర్యంలోని స్కూబా డైవర్ల బృందం సముద్రంలో రోజూ 400 కిలోల వ్యర్థాలు ఏరుతూ వార్తల్లో నిలిచింది.)
1) విశాఖపట్నం 2) చెన్నై 3) ముంబయి 4) కోల్‌కతా
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) రాజ్యసభ 250వ సమావేశాలు 2019 నవంబరు 18న ప్రారంభమయ్యాయి.
బి) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చలు సభ్యులు చేయాలంటూ వెంకయ్యనాయుడు పది సూచనలు చేశారు.
సి) 1952లో ఏర్పాటైన రాజ్యసభ 67 ఏళ్ల సభా కార్యక్రమాల్లో 3,817 బిల్లులు ఆమోదం పొందాయి. 249 సెషన్లలో సభ 5,466 రోజులు జరిగింది. ఇప్పటివరకూ మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య 2,282.
డి) 1952లో 15 మంది మహిళా సభ్యులు ఉండగా (6.94 శాతం) 2014 నాటికి వారి సంఖ్య 31 (12.76 శాతం)కి చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకుగాను 26 మంది మహిళలు (10.83 శాతం) ఉన్నారు.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, డి మాత్రమే 4) పైవన్నీ
సమాధానాలు: 1-3, 2-2, 3-1, 4-4.

అంతర్జాతీయం
1. భూగర్భ జలవనరుల పెంపునకు భారతీయ సంప్రదాయ పద్ధతులను పాటించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? (జల సంరక్షణకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చూపించిన మార్గాన్ని అనుసరించాలని ఈ దేశం నిర్ణయించింది.)
1) స్వీడన్‌ 2) ఫ్రాన్స్‌ 3) జర్మనీ 4) ఇటలీ
2. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం’గా ప్రకటించింది? (అంతరించే దశలో ఉన్న భాషలను కాపాడటమే దీని ఉద్దేశంగా ఐరాస ప్రకటించింది.)
1) 2018 2) 2019 3) 2020 4) 2021
3. ఏ దేశంలోని సుమత్రన్‌ ఖడ్గ మృగం జాతి అంతరించిపోయినట్లు ఇటీవల అక్కడి అధికారులు వెల్లడించారు? (ఈ దేశంలోని బోర్నియో ద్వీపంలోని సబాహ్‌ రాష్ట్రంలో ఉన్న చిట్టచివరి ఖడ్గమృగం ‘ఇమాన్‌ క్యాన్సర్‌’తో బాధపడుతూ చనిపోయింది.)
1) ఇండోనేషియా 2) ఫిలిప్పీన్స్‌ 3) థాయ్‌లాండ్‌ 4) మలేసియా
సమాధానాలు: 1-1, 2-2, 3-4.

ఇతరాలు
1. డేవిస్‌కప్‌ - 2019 విజేతగా ఏ జట్టు నిలిచింది? (ఈ జట్టు డేవిస్‌కప్‌ను నెగ్గడం ఇది ఆరోసారి. 19 సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌గా నిలిచిన రఫెల్‌ నాదల్‌ తాజాగా డేవిస్‌ కప్‌ను నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాదల్‌కు ఇది నాలుగో డేవిస్‌ కప్‌ టైటిల్‌. ఇంతకుముందు 2004, 2009, 2011లో డేవిస్‌ కప్‌ గెలిచిన ఈ దేశ జట్టులో నాదల్‌ సభ్యుడిగా ఉన్నాడు.)
1) అమెరికా 2) స్విట్జర్లాండ్‌ 3) ఇంగ్లాండ్‌ 4) స్పెయిన్‌
2. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్‌ ‘కుష్‌మ్యాన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ ‘మెయిన్‌ స్ట్రీట్స్‌ అక్రాస్‌ ది వరల్డ్‌ 2019’ పేరుతో విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో ఏ నగరంలోని ఖాన్‌ మార్కెట్‌ 20వ స్థానంలో నిలిచింది (ఈ జాబితాలోని తొలి మూడు స్థానాల్లో వరుసగా కాజ్‌వే బే - హాంకాంగ్, అప్పర్‌ అవెన్యూ - న్యూయార్క్, న్యూబాండ్‌ స్ట్రీట్‌ - లండన్‌ నిలిచాయి.)
1) దిల్లీ 2) ముంబయి 3) కోల్‌కతా 4) బెంగళూరు
3.ఈ అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2019 నవంబరు 22, 23, 24 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డేనైట్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బి) భారత్, బంగ్లాదేశ్‌ డేనైట్‌లో గులాబీ బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడటం ఇదే తొలిసారి.
సి) ఈ విజయంతో క్రికెట్‌ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యంకాని విధంగా స్వదేశంలో వరుసగా 12వ సిరీస్‌ విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.
డి) మొట్టమొదటిసారిగా గులాబీ బంతితో డేనైట్‌ టెస్టు మ్యాచ్‌ను 2015 నవంబరు 27 నుంచి డిసెంబరు 1 వరకు అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిల్యాండ్‌ల మధ్య నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన డేనైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో 12వది. ఈ 12 డేనైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ల్లోనూ ఫలితం రావడం విశేషం.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
సమాధానాలు: 1-4, 2-1, 3-4.


Back..

Posted on 02-12-2019