Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మృత్తికా దినోత్సవం ఎప్పుడు?

* పోటీ పరీక్షల కోసం వర్తమాన అంశాలు

ఏ పోటీ పరీక్షలోనైనా వర్తమాన అంశాలు తప్పనిసరిగా అడుగుతారు. అందుకే దైనందిన వార్తా విశేషాలను క్రమం తప్పకుండా గమనిస్తుండాలి. ఇటీవల అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో విభిన్న రంగాల్లో ఏ ముఖ్య సంఘటనలు జరిగాయో తెలుసుకునేవుంటారు. వాటిపై పోటీపరీక్షల్లో ఏ రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశముందో తెలుసుకుందాం!

జాతీయం
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై సిఫారసులు చేయడానికి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం కాల పరిమితిని కేంద్ర కేబినెట్‌ ఏడాదిపాటు పెంచింది. బి) దీని ప్రకారం ఈ సంఘం 2020 అక్టోబరు 30న నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సి) 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు నిధుల పంపిణీ, తదితర విషయాలను సంఘం పరిశీలించి సూచనలు చేయాల్సి ఉంటుంది. డి) ముందుగా నిర్దేశించిన ప్రకారం అయితే ఈ సంఘం 2020-21 నుంచి 2024-25 వరకు ఆర్థిక అంశాలను పరిశీలించి 2019 అక్టోబరు 30న నివేదిక సమర్పించాల్సి ఉంది. తర్వాత గడువును 2019 నవంబరు 30 వరకు పెంచారు. తాజాగా తిరిగి పెంపు నిర్ణయం తీసుకున్నారు.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. ఏ రెండు కేంద్రపాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును 2019 నవంబరు 27న లోక్‌సభ ఆమోదించింది?
1) అండమాన్‌ నికోబార్‌ దీవులు - దాద్రానగర్‌ హవేలీ 2) అండమాన్‌ నికోబార్‌ దీవులు - దామన్‌ డయ్యూ 3) దాద్రానగర్‌ హవేలీ - దామన్‌ డయ్యూ 4) అండమాన్‌ నికోబార్‌ దీవులు - లక్షద్వీప్‌
3. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు 2020 జనవరి 25తో ముగియనుండగా వాటిని ఎప్పటి వరకూ పొడిగించాలని 2019 డిసెంబరు 4న కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది? (ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పార్లమెంటులో ఎస్సీలకు 84, ఎస్టీలకు 47, రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీలకు 614, ఎస్టీలకు 554 స్థానాలు రిజర్వ్‌ చేశారు.)
1) 2023 జనవరి 25 (మూడేళ్లు) 2) 2025 జనవరి 25 (ఐదేళ్లు) 3) 2017 జనవరి 27 (ఏడేళ్లు) 4) 2030 జనవరి 25 (పదేళ్లు)
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2019 డిసెంబరు 5న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది.
బి) ప్రస్తుతమున్న రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్‌ రెపోరేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు.
సి) తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గించేసింది. అక్టోబరు సమీక్షలో వృద్ధి అంచనాను 6.1 శాతంగా పేర్కొనడం గమనార్హం.
డి) రూ.10,000 లోపు వస్తు, సేవల లావాదేవీల నిమిత్తం కొత్త ప్రీపెయిడ్‌ కార్డును అందుబాటులోకి తేవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
సమాధానాలు: 1-4; 2-3; 3-4; 4-4

అంతర్జాతీయం
1. ఏ దేశంలోని ఉగ్రవాద నిర్మూలన వ్యవస్థల బలోపేతానికి రూ.360 కోట్లు, సులభతర రుణం రూపేణా మరో రూ.2,870 కోట్లు ఇవ్వాలని భారత ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది?
1) నేపాల్‌ 2) శ్రీలంక 3) బంగ్లాదేశ్‌ 4) మాల్దీవులు
2. ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (నేలలను సంరక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేలల - మృత్తికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘నేల కోతను అరికట్టి భూమి మీద జీవరాశిని కాపాడదాం’ అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.)
1) డిసెంబరు 1 2) డిసెంబరు 3 3) డిసెంబరు 5 4) డిసెంబరు 7
3. అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం - 2019ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
1) గ్రెటాథన్‌బర్గ్, స్వీడన్‌ 2) దివినా మాలౌమ్, కామెరూన్‌ 3) ఫ్రాంక్‌ ఇల్లినాయిస్, ఫ్రాన్స్‌ 4) 1, 2
4. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, బర్దీష్‌ ఛగ్గర్, నవదీప్‌ భైన్స్, హర్జిత్‌ సజ్జన్‌ ఇటీవల ఏ దేశ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు? (ఈ దేశ ప్రధానమంత్రిగా రెండోసారి ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ట్రూడో వీరికి అవకాశం కల్పించారు.)
1) కెనడా 2) ఫ్రాన్స్‌ 3) జర్మనీ 4) రష్యా
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడికి ఏటా అందించే ‘బ్యాలన్‌ డి ఓర్‌’ (గోల్డెన్‌ బాల్‌) అవార్డును ఈసారి అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ గెలుచుకున్నాడు.
బి) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఆరోసారి గెలుచుకుని మెస్సీ రికార్డు సృష్టించాడు. క్రిస్టియన్‌ రొనాల్డో (పోర్చుగల్‌) ఐదుసార్లు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2019 సీజన్‌లో మెస్సీ 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్‌ సాధించాడు.
సి) మహిళల విభాగంలో అమెరికాకు చెందిన మెగాన్‌ రాపినోయ్‌ ‘బ్యాలన్‌ డి ఓర్‌’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌ను అమెరికా గెలవడంలో ఈమె కీలక పాత్ర పోషించింది.
డి) ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ సాధించేవారికి ఇచ్చే ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డును, ఫిషా బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును మెగాన్‌ గెలుచుకుంది.
సమాధానాలు: 1-2; 2-3; 3-4; 4-1 5-4

ఇతరాలు
1. ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన్‌ (పీఎంజీఎస్‌వై)లో మూడో విడత కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని కిలోమీటర్ల రహదారులను కేటాయించింది? (వీటి కోసం రూ.2,300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం.)
1) 1,285 కి.మీ 2) 2,285 కి.మీ 3) 3,285 కి.మీ 4) 4,285 కి.మీ
2. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ - 2019ని ఏ జట్టు చేజిక్కించుకుంది? (విజేతగా నిలిచిన ఈ జట్టుకు మనీష్‌ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు.)
1) కర్ణాటక 2) తమిళనాడు 3) ఉత్తర్‌ప్రదేశ్‌ 4) గుజరాత్‌
3. 2023లో పురుషుల ప్రపంచకప్‌ హాకీ పోటీలకు ఏ భారతీయ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? (2018లో కూడా ఈ మెగా ఈవెంట్‌కు ఇదే రాష్ట్రం ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య-ఎఫ్‌ఐహెచ్‌ వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో తిరిగి తామే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.)
1) పశ్చిమబెంగాల్‌ 2) ఉత్తర్‌ప్రదేశ్‌ 3) మహారాష్ట్ర 4) ఒడిశా
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని 2019 నవంబరు 27న భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
బి) పీఎస్‌ఎల్‌వీ-సీ47 వాహకనౌక కార్టోశాట్‌-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది.
సి) కార్టోశాట్‌-3 ఉపగ్రహం బరువు 1,625 కిలోలు. జీవితకాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహంలోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్‌ చిత్రాన్ని తీసే సామర్థ్యముంది.
డి) శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఇది 74వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌ఈ రాకెట్‌ను 49 సార్లు ప్రయోగించగా 47 సార్లు విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో ఇది 21వ ప్రయోగం. ఈ ఏడాది 5వ ప్రయోగం. కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌లో ఈ ప్రయోగం తొమ్మిదోది.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
5. గత ఏడాదిన్నర కాలంలో తెలంగాణలోని ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వాస్‌) గుర్తింపు లభించింది? (దేశం మొత్తం మీద అత్యధిక ఆసుపత్రుల్లో ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ విషయంలో 78 ఆసుపత్రులతో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.)
1) 85 2) 87 3) 95 4) 97
సమాధానాలు: 1-3; 2-1; 3-4; 4-4; 5-4


Back..

Posted on 09-12-2019