Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దిల్లీ పోలీస్‌లో 4669 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు

-ముందుగా ఫిజిక‌ల్ ప‌రీక్షలు
-అనంత‌రం ఆన్‌లైన్ రాత ప‌రీక్ష

తాత్కాలిక ప్రాతిప‌దిక‌న దిల్లీ పోలీస్ విభాగంలో 4669 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. వీటికి ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ముందుగా ఫిజిక‌ల్ ప‌రీక్షలు జ‌రుగుతాయి. అందులో అర్హత సాధించిన‌వారికి మార్చి 4 నుంచి కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈ ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

విభాగాల వారీ ఖాళీలు:
పురుషులు: జ‌న‌ర‌ల్ 1557, ఓబీసీ 847, ఎస్సీ 473, ఎస్టీ 238 మొత్తం 3115
మ‌హిళ‌లు: జ‌న‌ర‌ల్ 815, ఓబీసీ 443, ఎస్సీ 250, ఎస్టీ 46 మొత్తం 1554

అర్హత‌లు
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి మ‌హిళ‌లు 18-25, పురుషులు 18-21 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
విద్యార్హత‌: ఇంట‌ర్ లేదా స‌మాన అర్హత ఉన్న కోర్సు పాసై ఉండాలి. అలాగే పురుష అభ్యర్థులకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఎత్తు: పురుషులు 170 సెం.మీ. మ‌హిళ‌లు 157 సెం.మీ. ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 10, 2016
ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీ: మార్చి 4, 2017
తెలుగు రాష్ట్రాల్లో కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు వెబ్‌సైట్‌:: http://ssconline.nic.in

ఫిజిక‌ల్ ప‌రీక్ష ఇలా...
1600మీ (1.6 కి.మీ.) దూరాన్ని పురుషులు 6 నిమిషాల్లోనూ, మ‌హిళ‌లైతే 8 నిమిషాల్లోనూ పూర్తిచేయాలి. అలాగే పురుషులు 14 అడుగుల లాంగ్ జంప్‌, 3 అడుగుల 9 అంగుళాల హై జంప్ చేయాలి. మ‌హిళ‌లైతే 10 అడుగుల లాంగ్ జంప్‌, 3 అడుగుల హై జంప్ చేయ‌గ‌ల‌గాలి.

ఆన్‌లైన్ ప‌రీక్షలో...
రీజ‌నింగ్ నుంచి 35, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌/ క‌రెంట్ అఫైర్స్ 50, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు.

Back..

Posted on 14-09-.2016