Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కళాకారులకు ఓ కోర్సు!

థియేటర్‌ ఆర్ట్స్‌లో అనుభవం ఉన్న కళాకారులు వారి అభిరుచి మేరకు మూడేళ్ల డిప్లొమా కోర్సు చేయడానికి అవకాశం ఉంది. ఆయా విభాగాల శాస్త్రీయ అధ్యయనానికి ఈ కోర్సు వీలు కల్పిస్తుంది. తదనంతరం పరిశోధనలు చేసుకోవచ్చు. కళాశాలలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

యాక్టింగ్‌, డిజైన్‌, డైరెక్షన్‌...వీటిపై మీకు ఆసక్తి ఉందా? బుల్లితెర, వెండితెరపై రాణించాలని కోరుకుంటున్నారా? పేరున్న సంస్థలో డ్రమాటిక్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? అయితే మీ లాంటి వారికోసమే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ఎదురుచూస్తోంది. ఈ సంస్థ మూడేళ్ల డిప్లొమా ఇన్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి రెసిడెన్షియల్‌ విధానంలో ఈ కోర్సులను అందిస్తున్నారు. జులై 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో బోధన ఉంటుంది. ఆయా రంగాల్లో పేరున్న నిష్ణాతులు బోధిస్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.
ఇవీ అర్హతలు
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం 6 థియేటర్‌ ప్రొడక్షన్లలో పాల్గొని ఉండాలి. ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషలో ప్రావీణ్యం ఉండాలి. ముగ్గురు థియేటర్‌ నిపుణుల నుంచి రికమెండేషన్‌ ఉత్తరాలు, థియేటర్‌ అనుభవం ఉన్నట్లు తెలిపే డాక్యుమెంటేషన్‌ ఇవన్నీ జతచేయాలి.
జులై 1, 2018 నాటికి 30 ఏళ్లలోపు వయసు ఉండాలి (ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల మినహాయింపు).
సీట్ల వివరాలు: మొత్తం 26 సీట్లు ఉన్నాయి. వీటిలో 4 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 7 ఓబీసీలకు కేటాయించారు.
ఎంపిక విధానం
సీట్లకు అభ్యర్థుల ఎంపిక రెండంచెల్లో చేపడతారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి ఫైనల్‌ పరీక్షలు (వర్క్‌షాప్స్‌) ఉంటాయి. దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో వివిధ తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా కేంద్రాల వారీ మే 1 నుంచి జూన్‌ 8 వరకు ఇవి ఉంటాయి. ప్రిలిమినరీలో అర్హత సాధించినవారికి నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) కేంద్రం- న్యూదిల్లీలో జూన్‌ 26 నుంచి 30 వరకు అయిదు రోజుల పాటు వర్క్‌ షాప్స్‌ నిర్వహిస్తారు. ఫైనల్‌ పరీక్షలు (వర్క్‌షాప్స్‌)కు హాజరైనవారికి రెండువైపులా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. అలాగే వసతి సౌకర్యం కల్పిస్తారు. కోర్సుకు ఎంపికైన ప్రతి విద్యార్థికీ నెలకు రూ.8000 చొప్పున స్టయిపెండ్‌ అందిస్తారు. అభ్యర్థులు మెడికల్‌ టెస్టు (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌)లో అర్హత సాధిస్తేనే ప్రవేశం లభిస్తుంది. జులై 16 నుంచి తరగతులు మొదలవుతాయి. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఎంపికైన ప్రతి ఒక్కరూ రెసిడెన్షియల్‌ విధానంలో చదువుకోవడం తప్పనిసరి. తక్కువ ధరకు వసతి, భోజనం మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. ఎన్‌ఎస్‌డీ అందించే ఈ డిప్లొమా కోర్సు మాస్టర్‌ డిగ్రీతో సమానమైంది. ఈ అర్హతతో డ్రామా, యాక్టింగ్‌ కోర్సుల్లో పరిశోధనలు చేసుకోవచ్చు. లేదా కళాశాలలు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌ లైన్‌ దరఖాస్తులకు రూ.50 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు రూ.150 ఫీజు చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 16
వెబ్‌సైట్‌: https://nsd.gov.in/delhi

Back..

Posted on 20-03-2018