Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దివ్యాంగుల‌కోసం 63 వేల స్కాల‌ర్‌షిప్పులు

తొమ్మిదో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్‌, డిగ్రీ, డిప్లొమా, పీజీ, విదేశీవిద్య, పీహెచ్‌డీ... చ‌దువుతున్న దివ్యాంగుల కోసం 63 వేల‌కు పైగా స్కాల‌ర్‌షిప్పులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు విద్యార్హత‌ల‌కు అనుగుణంగా 5 ర‌కాల స్కీమ్‌ల్లో ఏదో ఒక‌దాన్ని ఎంచుకోవాలి. ఆ కోర్సు పూర్తయినంత‌వ‌ర‌కు ఎలాంటి ఆర్థిక అవ‌రోధం క‌ల‌గ‌కుండా ప్రతి నెలా విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్పు అందుతుంది. భారత ప్రభుత్వ సోష‌ల్ జస్టిస్ & ఎంప‌వ‌ర్‌మెంట్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఈ స్కాల‌ర్‌షిప్పులను అందిస్తోంది.

వివ‌రాలు...
1) ప్రీమెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్‌
ఎవ‌రి కోసం: 9, 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు
స్కాల‌ర్‌షిప్స్ సంఖ్య: 46,000.
ఎంత మొత్తం: నెల‌కు రూ.350 (డేస్కాల‌ర్స్‌), రూ.600 (హాస్టల్ విద్యార్థులకు).
త‌ల్లిదండ్రుల వార్షికాదాయ ప‌రిమితి: రూ. 2 ల‌క్షలు

2) పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్
ఎవ‌రి కోసం: ఇంట‌ర్ నుంచి పీజీ/డిప్లొమా విద్యార్థుల‌కు
స్కాల‌ర్‌షిప్స్ సంఖ్య: 16,650
ఎంత మొత్తం: నెల‌కు రూ.400 -550 (డేస్కాల‌ర్స్‌), రూ.650 - 1,200 (హాస్టల్ విద్యార్థులకు)
త‌ల్లిదండ్రుల వార్షికాదాయ ప‌రిమితి: రూ. 2 .5ల‌క్షలు

3) స్కాల‌ర్‌షిప్స్ - టాప్ క్లాస్ ఎడ్యుకేష‌న్
ఎవ‌రి కోసం: పీజీ డిగ్రీ/డిప్లొమా
స్కాల‌ర్‌షిప్స్ సంఖ్య: 160.
ఎంత మొత్తం: నెల‌కు రూ.1500 (డేస్కాల‌ర్స్‌), రూ.3,000 (హాస్టల్ విద్యార్థులకు)
త‌ల్లిదండ్రుల వార్షికాదాయ ప‌రిమితి: రూ. 6 ల‌క్షలు

4) నేష‌న‌ల్ ఓవ‌ర్‌సీస్ స్కాల‌ర్‌షిప్స్
ఎవ‌రి కోసం: మాస్టర్ డిగ్రీ & డాక్టరేట్ డిగ్రీ (ఫారిన్ యూనివ‌ర్సిటీలు)
స్కాల‌ర్‌షిప్స్ సంఖ్య: 20.
ఎంత మొత్తం: యూకే - 9,900 పౌండ్లు, యూఎస్‌- 15,400 డాల‌ర్లు.
త‌ల్లిదండ్రుల వార్షికాదాయ ప‌రిమితి: రూ. 6 ల‌క్షలు

5) నేష‌న‌ల్ ఫెలోషిప్
ఎవ‌రి కోసం: ఎంఫిల్‌/పీహెచ్‌డీ
స్కాల‌ర్‌షిప్స్ సంఖ్య: 200.
ఎంత మొత్తం: నెల‌కు రూ.25,000 (మొద‌టి 2 సంవ‌త్సరాలు), రూ.28,000 (మూడో సంవ‌త్సరం).
త‌ల్లిదండ్రుల వార్షికాదాయ ప‌రిమితి లేదు.

క‌నీసం 40 శాతం వైక‌ల్యం ఉన్నవారే ఈ స్కాల‌ర్‌షిప్పులకు అర్హులు. వైక‌ల్య ధృవీక‌ర‌ణ‌ స‌ర్టిఫికెట్లు త‌ప్పనిస‌రి. కేవ‌లం స్కాల‌ర్‌షిప్పు ఒక్కటే కాకుండా ప‌లు అల‌వెన్సులు ( ప్రయాణాల‌కు, స‌హాయ‌కునికి, స్పెష‌ల్‌, కోచింగ్‌...మొద‌లైన‌వి) కూడా ప్రతి నెలా అందిస్తారు.

మార్కులు, ఆయా రాష్ట్రాల‌కు కేటాయించిన స్కాల‌ర్‌షిప్పుల ప్రకారం అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రప్రదేశ్‌కు ప్రి మెట్రిక్ స్కాల‌ర్‌షిప్పులు 2093, పోస్టు మెట్రిక్ స్కాల‌ర్‌షిప్పులు 758 కేటాయించారు. తెలంగాణ‌కు ప్రి మెట్రిక్‌ 1796, పోస్టు మెట్రిక్ 650 ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది (ఫ్రెష్ అప్లికేష‌న్): ప్రీమెట్రిక్‌-30.09.2017, పోస్ట్ మెట్రిక్‌-31.10.2017, టాప్ క్లాస్ ఎడ్యుకేష‌న్ - 31.10.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది (రెన్యూవ‌ల్‌): 31.10.2017.

వెబ్‌సైట్లు:http://www.scholarships.gov.in/


Back..

Posted on 15-06-2017