Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డీఆర్‌డీఓ - సెప్టంలో 1817 ఎంటీఎస్ ఖాళీలు

* టెన్త్‌తో ఉద్యోగం!

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) 1817 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.

రెండు దశల్లో నిర్వహించే ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు డీఆర్‌డీవో ల్యాబుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మల్టీ టాస్కింగ్‌ పోస్టులకు ఎంపికైనవారికి రూ.18000 మూల వేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. ఈ ఉద్యోగాల కోసం నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35, జనరల్‌ అవేర్‌నెస్‌ 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలైతే 35 శాతం సరిపోతాయి. కనీస అర్హత మార్కులు సాధించిన జాబితా నుంచి ఆయా విభాగాల వారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన ఫైనల్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

ఫైనల్‌ సెలక్షన్‌: పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్‌ సైన్స్‌ 40, జనరల్‌ మ్యాథ్స్‌ 40, జనరల్‌ ఇంగ్లిష్‌ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. ఫైనల్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం ఆయా కేటగిరీలవారీ తుది నియామకాలు చేపడతారు.

వివ‌రాలు....
మొత్తం ఖాళీలు: 1817. (ఎస్సీ 163, ఎస్టీ 114, ఓబీసీ 503, ఈడబ్ల్యుఎస్‌ 188, అన్‌ రిజర్వ్‌డ్‌ 849 పోస్టులు).
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ.
వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ) టైర్‌-1, టైర్‌-2 ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 23.12.2019.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 23.01.2020.
పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.



నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Back..

Posted on 13-12-2019