Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేర్చుకుంటున్నారు వేగంగా.. ఒడుపుగా!

కాలంతో పాటు వచ్చే మార్పులను సాదరంగా ఆహ్వానించాలి. పాత, మూస పంథాను వదిలేసి సరికొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకోవాలి. విద్యార్థులకైనా, ఉద్యోగార్థులకైనా ఇదిప్పుడు ప్రాణావసరం. నేర్చుకునే పద్ధతుల్లో కూడా గణనీయమైన మార్పులు వస్తున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ ధోరణులు మరింత పుంజుకోబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన ఐదింటిని ఓసారి చూద్దామా?

సరికొత్త తరం భవితను నిర్ణయించే నూతన దశాబ్దంలోకి కొద్దిరోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. ఆధునిక సాంకేతికత, ఆటోమేషన్‌, ప్రపంచీకరణలు విద్యపై, నేర్చుకునే తీరుతెన్నులపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని గమనించటంతో పాటు ఆచరణలోకి తెచ్చుకుంటే నవ శకానికి తగ్గ వేగాన్నీ, పరిజ్ఞానాన్నీ సంతరించుకోవటం సాధ్యమవుతుంది! విద్యారంగాన్ని బలీయంగా ప్రభావితం చేస్తూ, భవిష్యత్తులో మరింత విస్తరించనున్న ఐదు నూతన ధోరణుల గురించి క్లుప్తంగా....

విద్యారంగం: 5 నయా ధోరణులు
1) స్వతంత్రంగా నేర్చుకోవటం: సాంప్రదాయిక తరగతి పద్ధతిలో కాకుండా తమకిష్టమైన సబ్జెక్టులనూ, నైపుణ్యాలనూ ఆన్‌లైన్‌ వనరుల సాయంతో స్వతంత్రంగా నేర్చుకోవటం- డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ (డీఐయూ). ఈ విధానం తేలిగ్గానూ, ఆసక్తికరంగానూ ఉండటం వల్ల దీన్ని విద్యార్థులు ఇష్టపడుతున్నారు.
2) ఎప్పుడైనా, ఎక్కడైనా: పల్లె-పట్నం తేడా లేకుండా ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌, ఆప్స్‌ వినియోగంలో మనదేశం దూసుకుపోతోంది. దీంతో వీలునుబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా అభ్యసించే సౌలభ్యం పెరిగింది. గూగుల్‌, మొబైల్‌ ఆప్స్‌లో సమాచార సేకరించీ, యూట్యూబ్‌ ద్వారా వీడియోలను చూసీ అవసరమైన విషయాలు నేర్చుకోవటానికి (బ్లెండెడ్‌ లర్నింగ్‌) విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. స్వల్పకాలిక ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కోర్సుల్లో చేరి నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటున్నారు.
3) మూక్స్‌తో మెరుగ్గా: తక్కువ ఖర్చులో, అనుకూలమైన సమయంలో నాణ్యమైన విద్యనూ, కొత్త నైపుణ్యాలనూ నేర్చుకునే వీలును మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు (మూక్స్‌) కల్పిస్తున్నాయి. వీడియోల ద్వారా, లైవ్‌చాట్ల ద్వారా ఈ శిక్షణ లభిస్తుంది. వ్యక్తిగతీకరించిన ఈ అభ్యాసం విద్యార్థులు సబ్జెక్టు పరిజ్ఞానాన్ని మెరుగ్గా గ్రహించటానికి వీలు కల్పిస్తోంది.
4) భావనల ఆధారంగా: ఏ సబ్జెక్టును అధ్యయనం చేయాలన్నా భావనలను (కాన్సెప్టులను) గ్రహించటం ముఖ్యమని తెలిసిందే. కీలక నైపుణ్యాలను సమర్థంగా నేర్చుకుని ఉద్యోగ విధులకు సర్వసంసిద్ధంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతోంది. అందుకే దీనికి ప్రాధాన్యం పెరిగింది. పరిజ్ఞానం బదిలీలో ఉపాధ్యాయుణ్ని కాకుండా విద్యార్థినే కేంద్రంగా మార్చటం దీని ప్రత్యేకత.
5) ఏఐ, గేమిఫికేషన్‌: వీడియో గేమ్స్‌ తరహాలో వినోదకరంగా, సరదాగా నేర్చుకునే ఈ పద్ధతిని విద్యార్థులు ఇష్టపడుతున్నారు. వారి ఆసక్తి ఎక్కువ సమయం నిలిచేలా చేసే ఈ పద్ధతి విద్యారంగంలో విస్తరిస్తోంది. పైగా డేటా అనలిటిక్స్‌ సాయంతో తమ ప్రతిభను అంచనా వేసుకోవటానికీ ఇది తోడ్పడుతోంది.

Back..

Posted on 23-12-2019