Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విదేశీ భాషలకు చిరునామా... ఇఫ్లూ

ఒకప్పటి సీఫెల్‌... ఇప్పుడు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)! విదేశీ భాషలు నేర్చుకోవడానికి హైదరాబాద్‌లోని ఇఫ్లూ తరహా యూనివర్సిటీ దక్షిణాసియాలో మరెక్కడా లేదు. దీనికి లఖ్‌నవూ, షిల్లాంగ్‌లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఇక్కడ శాస్త్రీయంగా నేర్చుకోవచ్చు.
ఆధునిక ప్రపంచంలో వస్తోన్న మార్పులు, విస్తరిస్తోన్న పర్యాటక రంగం, విదేశీ కంపెనీలు పలు దేశాలు, ప్రాంతాల్లో శాఖలు ఏర్పరచడం..తదితర కారణాలతో విదేశీ భాషలు వచ్చినవారికి ప్రాముఖ్యం పెరిగింది. సాఫ్ట్‌వేర్‌, బీపీవో, కేపీవో, ఎల్పీవో, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌...ఇలా అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవారి సేవలు అనివార్యమయ్యాయి. అందుకే ఆసక్తి ఉంటే ఇంగ్లిష్‌, ఇంకా జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుని సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు.
కోర్సులు... అర్హతల వివరాలు
బీఏ (ఆనర్స్‌) : ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 40, లఖ్‌నవూలో 40, షిల్లాంగ్‌లో 20 సీట్లు ఉన్నాయి.
బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ ఒక్కో కోర్సులో హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.
బీఏ: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు షిల్లాంగ్‌ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.
అర్హత: పై కోర్సుల్లో ప్రవేశానికి జనరల్‌, ఓబీసీ అభ్యర్థులైతే ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు: బీఎడ్‌ ఇంగ్లిష్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 50 సీట్లు ఉన్నాయి.
అర్హత: బీఏ ఇంగ్లిష్‌ లేదా ఎంఏ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ (ఎంఏ) కోర్సులు
ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 90, లఖ్‌నవూలో 40, షిల్లాంగ్‌లో 30 సీట్లు ఉన్నాయి.
ఇంగ్లిష్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 30 సీట్లు.
లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు ఉన్నాయి.
కంపారిటివ్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు ఉన్నాయి.
లింగ్విస్టిక్స్‌: హైదరాబాద్‌, లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు ఉన్నాయి.
జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 20 సీట్లు ఉన్నాయి. హిందీ, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, హిస్పానిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, రష్యన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పీజీడీటీఈ: హైదరాబాద్‌లో 40, లఖ్‌నవూలో 20 సీట్లు ఉన్నాయి.
పీజీడీటీఏ: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు ఉన్నాయి.
అర్హత: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌ డిగ్రీలో జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత అంశాన్ని డిగ్రీ లేదా ప్రత్యేక డిప్లొమా స్థాయిలో చదివుండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
పరీక్ష ఇలా...
కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. యూజీతోపాటు పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆబ్జెక్టివ్‌ పరీక్షను నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. అయితే కొన్ని పీజీ (అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, హిస్పానిక్‌, రష్యన్‌), అన్ని పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికీ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌లతో పాటు డిస్క్రిప్టివ్‌ విధానం (పేపర్‌)లోనూ పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 40 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ పరీక్ష 30, ఓరల్‌ 30 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ఒక్కో విభాగానికీ గంట చొప్పున కేటాయించారు. ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, పీహెచ్‌డీ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌ విభాగాల్లో ప్రవేశానికి ఆబ్జెక్టివ్‌ పరీక్షకు 70, ఓరల్‌ 30 మార్కులు కేటాయించారు.
రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి కోర్సులకు ఎంపిక చేస్తారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 7
ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 24, 25.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ. www.efluniversity.ac.in


Back..

Posted on 05-02-2018