Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్త ఏడాది ఈ కొలువులదే హవా!

* ఎమర్జింగ్‌ జాబ్స్‌ - 2020

ఆలోచనల అవసరం లేకుండా లక్షల రిక్వెస్టులను అలవోకగా పరిష్కరించే ఆర్‌పీఏకి ఆదరణ పెరుగుతోంది. కొత్త దశాబ్దంలో దీనికి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తోడవుతోంది. దీంతో నిర్ణయాలూ యంత్రాలే తీసేసుకుంటాయి. పనుల వేగం పదుల రెట్లు పెరుగుతుంది. సెక్యూరిటీ, సేల్స్, సర్వీసెస్, లర్నింగ్, మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ తదితర ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. అందుకే ఇరవై ఇరవై నుంచి కొన్ని రకాల కొలువులకు డిమాండ్‌ ఎక్కువకాబోతోందని నిపుణుల అంచనా. అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే కొన్నేళ్లపాటు నిలకడగా ఉండే ఆ అవకాశాలను అందుకోవచ్చు.


మనదేశం నుంచి ఏటా 12 మిలియన్ల మంది కొత్తగా జాబ్‌ మార్కెట్‌లోకి వస్తున్నారని అంచనా. ఆటోమేషన్‌కు ఆదరణ పెరుగుతున్నకొద్దీ యంత్రాలతో వ్యక్తుల పోటీ పెరుగుతోంది. దీంతో సాంకేతిక రంగంలో ఎన్నో కెరియర్లు దూసుకువస్తున్నాయి. ఈ విషయాన్నే లింక్‌డిన్‌ ధ్రువీకరిస్తోంది. 2015-19 మధ్య కాలంలో జరిగిన నియామకాల ఆధారంగా నివేదికను రూపొందించింది. ఏటా వివిధ హోదాల్లో పెరిగిన అభివృద్ధి ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. నూతన సంవత్సరంలో ఆదరణ పొందనున్న ఉద్యోగాల్లో ఎక్కువ శాతం టెక్నాలజీకి సంబంధించినవి... నాన్‌ టెక్నికల్‌వీ కొన్ని ఉన్నాయి.

ఈ ఉద్యోగాలు ఏ రంగాల్లో?
* ఐటీ అండ్‌ సర్వీసెస్‌
* కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌
* ఇంటర్నెట్‌
* ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
* హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌
* రిసెర్చ్‌
* ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌
* అకౌంటింగ్‌
* మేనేజ్‌మెంట్‌ కౌన్సెలింగ్‌
* ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌
* ఈ లర్నింగ్‌
* ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌
* మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టైజింగ్‌
* డిజిటల్‌ మార్కెటింగ్‌
* టెలికమ్యూనికేషన్స్‌
* ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌
* ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌
* కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ
* అవుట్‌ సోర్సింగ్‌/ అవుట్‌ షోరింగ్‌.

కొత్త సంవత్సరంలో ఆదరణ పెరిగే 15 ఉద్యోగాల విశేషాలు-
బ్లాక్‌చెయిన్‌ డెవలపర్‌
ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని దొంగిలించడం, నాశనం చేయడం మామూలే. ఇది కొన్నిసార్లు భారీ నష్టాలకు కారణమవుతుంది. భద్రతకూ ముప్పును తీసుకొస్తుంది. వీటన్నింటికీ కళ్లెం వేసేదే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ. ఇది సమాచారాన్ని వివిధ బ్లాకుల్లో నిక్షిప్తమయ్యేలా చేసి, సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఈ ప్రక్రియకు సాయపడేవారే బ్లాక్‌చెయిన్‌ డెవలపర్లు. వీరిలో కోర్‌ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు ఉంటారు. కోర్‌ డెవలపర్లు బ్లాక్‌చెయిన్‌ సిస్టమ్‌ ఆర్కిటెక్చర్‌ను, ప్రొటోకాల్స్, సెక్యూరిటీ పాటర్న్‌లను నిర్మిస్తారు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు దానిని ఉపయోగించి అప్లికేషన్లు, ఆప్‌లు మొదలైనవి తయారు చేస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: హైపర్‌లెడ్జర్, సాలిడిటీ, నోడ్‌.జేఎస్, స్మార్ట్‌ కాంట్రాక్ట్‌
కోర్సులు: లర్నింగ్‌ ఫుల్‌ స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌; మాంగోడీబీ, నోడ్‌ అండ్‌ రియాక్ట్‌; లర్నింగ్‌ గో; పైథాన్‌ ఫర్‌ డేటాసైన్స్‌ ఎసెన్షియల్‌ ట్రైనింగ్‌; కోడ్‌ క్లినిక్‌: గో

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ స్పెషలిస్ట్‌
కొన్ని మినహా దాదాపుగా అన్ని రంగాల్లోకి ఏఐ/ రోబోట్లు రానున్నాయి. ఇవి సమాచారాన్ని ఉత్పత్తి చేయడమే కాదు, దాన్ని విశ్లేషించి, లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటాయి. ఈ నిపుణులు మెషిన్లకు నేర్చుకునేలా, నిర్ణయాలు తీసుకునేలా శిక్షణనిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: మెషిన్‌ లర్నింగ్, డీప్‌ లర్నింగ్, టెన్సర్‌ఫ్లో, పైథాన్‌ (ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌), నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ)
కోర్సులు: పైథాన్‌ ఫర్‌ డేటాసైన్స్‌ ఎసెన్షియల్‌ లర్నింగ్‌; ఫైథాన్‌: డిజైనింగ్‌ పాటర్న్స్‌; మెషిన్‌ లర్నింగ్‌ అండ్‌ ఏఐ ఫౌండేషన్స్‌: రెకమెండేషన్స్‌; పైథాన్‌: ప్రోగ్రామింగ్‌ ఎఫిషియెంట్లీ; పైథాన్‌: డేటా అనలిస్ట్‌; లర్నింగ్‌ హడూప్‌

జావా స్క్రిప్ట్‌ డెవలపర్‌
ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు ఆకట్టుకునేలా, ఒక్కోసారి కొంతసేపు దానిలో ఉండాలనిపించేలా రూపకల్పన ఉంటుంది. దాన్ని అలా తీర్చిదిద్దేవారిని ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌లు అంటారు. చూడటానికి ఎలా ఉండాలన్న దానిపైనే వీరు పనిచేస్తే.. జావాస్క్రిప్ట్‌ డెవలపర్లు ఫ్రంట్‌ ఎండ్‌ లాజిక్‌ అమలయ్యేలా చూస్తారు. వెబ్‌సైట్‌ ప్రోగ్రామింగ్, డెవలప్‌మెంట్, దాని కోర్‌ అంశాలను అమలుపరచడం వీరి విధులు.
కావాల్సిన నైపుణ్యాలు: ఆంగ్యులర్‌జేఎస్, నోడ్‌.జేఎస్, రియాక్ట్‌.జేఎస్, రియాక్ట్‌ నేటివ్, మాంగోడీబీ
కోర్సులు: లర్నింగ్‌ ఫుల్‌ స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్‌; లర్నింగ్‌ ఈసీఎంఏ స్క్రిప్ట్‌6; లర్నింగ్‌ రీడక్స్‌; వెబ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్స్‌: ఫుల్‌ స్టాక్‌ వర్సెస్‌ ఫ్రంట్‌ ఎండ్‌; లర్నింగ్‌ గ్రాఫ్‌క్యూఎల్‌

రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ కన్సల్టెంట్‌
రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ) అంతకుముందు వ్యక్తులు నిర్వహించిన పనులను రోబోలు నిర్వహించేలా రూపొందించే సాఫ్ట్‌వేర్‌. ఆర్‌పీఏ కన్సల్టెంట్‌లు ఆర్‌పీఏను సంస్థల్లో ఉపయోగించే విధానం, వాటి వల్ల కలిగే ఉపయోగాలపై పనిచేస్తారు. అన్నింటికీ ఒకే విధానాన్ని ఉపయోగించడం కాకుండా వివిధ సంస్థల అవసరాలను గమనించి, వాటికి అనుగుణంగా మార్గాలను సూచిస్తుంటారు.
కావాల్సిన నైపుణ్యాలు: యూఐపాత్, ఆటోమేషన్‌ ఎనీవేర్, బ్లూ ప్రిజమ్, ప్రాసెస్‌ ఆటోమేషన్, ఎస్‌క్యూఎల్‌
కోర్సులు: పైథాన్‌ ఫర్‌ డేటా సైన్స్‌ ఎసెన్షియల్‌ ట్రెయినింగ్‌; ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్స్‌; స్క్రమ్‌: ద బేసిక్స్‌

బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌
ఏదైనా వెబ్‌ అప్లికేషన్‌లో ఎవరికీ కనిపించకుండా తెర వెనక జరిగే పనిని నిర్వహించేది బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌. ఫలానా అప్లికేషన్‌ ఉద్దేశం ఆధారంగా దాని రూపకల్పన, అభివృద్ధి ఉండేలా చూస్తారు. ఆకట్టుకునేలా కనిపించే ఫ్రంట్‌ ఎండ్‌లోకి వినియోగదారుడు ప్రవేశించడానికి పరోక్షంగా తోడ్పడేవాటిని రూపొందిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: నోడ్‌.జేఎస్, మాంగోడీబీ, జావాస్క్రిప్ట్, డీజేఆంగో, మైఎస్‌క్యూఎల్‌
కోర్సులు: పీహెచ్‌పీ: డిజైన్‌ పాటర్న్స్‌; అడ్వాన్స్‌డ్‌ పీహెచ్‌పీ; పైథాన్‌: డిజైన్‌ పాటర్న్స్‌; లర్నింగ్‌ ఫుల్‌ స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్‌; లర్నింగ్‌ స్ప్రింగ్‌ విత్‌ స్ప్రింగ్‌ బూట్‌

గ్రోత్‌ మేనేజర్‌
ప్రొడక్ట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, మార్కెట్‌ రోల్స్‌ వీటిల్లో ఏదో ఒకటి; ఒక్కోసారి అన్నింటికీ సంబంధించి కావచ్చు. వివిధ టెక్నిక్‌లను ఉపయోగించి తమ ప్రొడక్ట్‌కు వినియోగదారులు/ యూజర్లు పెరిగేలా చూడటం వీరి ముఖ్య విధి
కావాల్సిన నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, టీమ్‌ మేనేజ్‌మెంట్, గ్రోత్‌ స్ట్రాటజీలు, మార్కెట్‌ రిసెర్చ్, మార్కెటింగ్‌ స్ట్రాటజీ, డిజిటల్‌ మార్కెటింగ్‌
కోర్సులు: గివింగ్‌ యువర్‌ ఎలివేటర్‌ పిచ్‌; ద డేటా సైన్స్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌; సేల్స్‌ ప్రాస్‌పెక్టింగ్‌; అడ్వాన్స్‌డ్‌ లీడ్‌ జనరేషన్‌

సైట్‌ రిలయబిలిటీ ఇంజినీర్‌
సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంశాలకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విధానాన్ని జోడించడాన్ని సిస్టమ్‌ రిలయబిలిటీ ఇంజినీరింగ్‌ (ఎస్‌ఆర్‌ఈ)గా చెప్పొచ్చు. ఆప్‌ల డెవలప్‌మెంట్, ఆపరేషనల్‌ ప్రాసెస్‌లు సులువుగా అమలయ్యేలా చూడటం వీరి విధి. టెక్నాలజీ అవసరం రోజువారీ జీవితాల్లో పెరుగుతున్నకొద్దీ వీరికి గిరాకీ ఉంటుంది.
కావాల్సిన నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), యాన్సిబుల్, డాకర్‌ ప్రొడక్ట్స్, క్యూబర్‌నెట్స్, జెంకిస్‌
కోర్సులు: దీ’వ్ప్రీ( ఫౌండేషన్స్‌; లర్నింగ్‌ యాన్సిబుల్‌; అడ్వాన్స్‌డ్‌ లైనక్స్‌: ద లైనక్స్‌ కర్నల్‌; లర్నింగ్‌ గో, ఫైథాన్‌: డిజైన్‌ పాటర్న్, లైనక్స్‌: బాష్‌ షెల్‌ అండ్‌ స్క్రిప్ట్స్, పైథాన్‌: ప్రోగ్రామింగ్‌ ఎఫిషియంట్లీ

కస్టమర్‌ సక్సెస్‌ స్పెషలిస్ట్‌
ఏదైనా వస్తువు/ ప్రొడక్ట్‌కు సంబంధించి సమస్య ఎదురైనప్పుడు సాధారణంగా వినియోగదారులు సంస్థ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ను సంప్రదిస్తుంటారు. ఆ విభాగం తరహాలోనే కస్టమర్‌ సక్సెస్‌ స్పెషలిస్ట్‌ పని చేస్తుంటారు. సమస్య వీరి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని కోర్‌ క్లయింట్, సంస్థల అవసరాలుగా గుర్తించి తగిన సేవలు అందిస్తారు. వీరికి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ నైపుణ్యాలు రెండూ అవసరమవుతాయి.
కావాల్సిన నైపుణ్యాలు: కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), టీం మేనేజ్‌మెంట్, కస్టమర్‌ రిటెన్షన్, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (ఎస్‌ఏఏఎస్‌), అకౌంట్‌ మేనేజ్‌మెంట్‌
కోర్సులు: ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్స్‌; గివింగ్‌ యువర్‌ ఎలివేటర్‌ పిచ్‌; డెవలపింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెజెన్స్‌; చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్స్‌

ఫుల్‌ స్టాక్‌ ఇంజినీర్‌
ఒక అప్లికేషన్‌కు సంబంధించి అన్ని అంశాలు- ఫ్రంట్‌ ఎండ్‌ టెక్నాలజీ, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ లాంగ్వేజెస్, డేటాబేస్, సర్వర్, ఏపీఐ, వర్షన్‌ కంట్రోలింగ్‌ సిస్టమ్స్‌పై పనిచేస్తారు. వీరు క్లయింట్లు, సంస్థ రెండింటి కోసం పనిచేయగలుగుతారు. మొత్తంగా సిస్టమ్‌ సమర్థంగా పనిచేసేలా చూస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: ఆంగ్యులర్‌ జేఎస్, నోడ్‌.జేఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్‌.జేఎస్, మాంగోడీబీ
కోర్సులు: లర్నింగ్‌ ఫుల్‌ స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్‌; లర్నింగ్‌ స్ప్రింగ్‌ విత్‌ స్ప్రింగ్‌ బూట్‌; పీహెచ్‌పీ: డిజైన్‌ పాటర్న్స్‌; సి++ డిజైన్‌ పాటర్న్స్‌: పార్ట్‌ 1; లర్నింగ్‌ రిడక్స్‌

రోబోటిక్స్‌ ఇంజినీర్‌ (సాఫ్ట్‌వేర్‌)
వీరు రోబోట్‌ కంట్రోల్, ఆటోమేషన్‌ నిమిత్తం సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తారు. బిజినెస్‌ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా రోబోలు పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను నిర్మించి, అభివృద్ధి చేస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ), యూఐపాత్, బ్లూ ప్రిజమ్, ఆటోమేషన్‌ ఎనీవేర్, రోబోటిక్స్, ఎస్‌క్యూఎల్‌
కోర్సులు: పైథాన్‌ ఫర్‌ డేటా సైన్స్‌ ఎసెన్షియల్‌ ట్రెయినింగ్‌; మెషిన్‌ లర్నింగ్‌ అండ్‌ ఏఐ ఫౌండేషన్స్‌: రెకమెండేషన్స్‌; మెషిన్‌ లర్నింగ్‌ అండ్‌ ఏఐ ఫౌండేషన్స్‌: వాల్యూ ఎస్టిమేషన్స్‌; విజువల్‌ బేసిక్‌ ఎసన్షియల్‌ ట్రెయినింగ్‌; సీ++ అండ్‌ .నెట్‌: ప్రోగ్రామింగ్‌

సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌
కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ను సైబర్‌ క్రైమ్‌ నుంచి సురక్షితంగా ఉంచడమే వీరి విధి. ఇందులో భాగంగా ఫిషింగ్, డినయిల్‌ ఆఫ్‌ సర్వీస్‌ అటాక్స్, మాల్‌వేర్, వైరస్‌లు, హ్యాకింగ్‌ల నుంచి సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతారు. అందుకు సాయపడే సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందించడం, అమలుచేయడం వంటివి చేస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: వల్నరబిలిటీ అసెస్‌మెంట్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఐఈఎం), పెనెట్రేషన్‌ టెస్టింగ్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ
కోర్సులు: సైబర్‌ సెక్యూరిటీ ఫౌండేషన్స్‌; లర్నింగ్‌ కలి లైనక్స్‌; ఐటీ సెక్యూరిటీ కెరియర్స్‌ అండ్‌ సర్టిఫికేషన్స్‌: ఫస్ట్‌ స్టెప్స్‌; ట్రబుల్‌ షూటింగ్‌ యువర్‌ నెట్‌వర్క్‌ విత్‌ వైర్‌షార్క్‌; ఎథికల్‌ హ్యాకింగ్‌: ఎక్స్‌ప్లాయిట్స్‌

పైథాన్‌ డెవలపర్‌
సాధారణంగా బ్యాక్‌ ఎండ్‌ కాంపోనెంట్స్‌పై పనిచేస్తారు. వెబ్‌ అప్లికేషన్లను ఇతర వెబ్‌ సర్వీసులతో అనుసంధానించడం, ఫ్రంట్‌ ఎండ్‌ సరైన రీతిలో పనిచేసేలా చేయడం వంటివి వీరి విధులు. చాలావరకూ పైథాన్‌ డెవలపర్లు డేటా సేకరణ, అనలిటిక్స్‌పై పనిచేస్తుంటారు.
కావాల్సిన నైపుణ్యాలు: డీజేఆంగో, ఫ్లాస్క్, మైఎస్‌క్యూఎల్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌
కోర్సులు: పైథాన్‌: డిజైన్‌ పాటర్న్స్‌; పైథాన్‌ ఫర్‌ డేటా సైన్స్‌ ఎసన్షియల్‌ ట్రెయినింగ్‌; పైథాన్‌: ప్రోగ్రామింగ్‌ ఎఫిషియంట్లీ; లర్నింగ్‌ పైథాన్‌ జనరేటర్స్‌; లర్నింగ్‌ ద పైథాన్‌ 3 స్టాండర్డ్‌ లైబ్రరీ

డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌
నవీన మార్కెటింగ్‌ బృందంలో వీరి అవసరం తప్పక ఉంటోంది. వీరు సేకరించిన డేటా ఆధారంగా టార్గెట్‌ మార్కెట్‌లను గుర్తించి డిజిటల్, ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌లను తయారు చేస్తారు. వీరు దాదాపుగా అన్ని అంశాలపై పనిచేస్తుండగా కొందరు సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ)/ సోషల్‌ మీడియా స్పెషలైజేషన్లపైనే పనిచేస్తున్నారు.
కావాల్సిన నైపుణ్యాలు: మైఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), గూగుల్‌ యాడ్స్, సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఎంఓ), సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (ఎస్‌ఈఎం), గూగుల్‌ అనలిటిక్స్‌
కోర్సులు: ఎస్‌ఈఓ: కీవర్డ్‌ స్ట్రాటజీ; కంటెంట్‌ మార్కెటింగ్‌ ఫౌండేషన్స్‌; సోషల్‌ మీడియా మార్కెటింగ్‌: ఆర్‌ఓఐ; సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఫర్‌ స్మాల్‌ బిజినెస్‌; అడ్వర్టైజింగ్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌

ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీర్‌
వీరు వెబ్‌ డిజైనర్లతో కలిసి వెబ్‌ అప్లికేషన్‌కు అవసరమైన విజువల్‌ ఎలిమెంట్స్‌ను రూపొందిస్తారు. వెబ్‌సైట్‌కు సంబంధించిన వివిధ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఎలిమెంట్ల ఎంపిక, ఇన్‌స్టలేషన్, వాటి టెస్టింగ్‌ వంటివి వీరి పనిలో భాగం. వినియోగదారులు, వ్యాపారులు రోజూ ఉపయోగించే అప్లికేషన్లు, వెబ్‌ ప్రాపర్టీల్లో కొత్త ఫీచర్లను చేర్చడం, అభివృద్ధి చేయడం వంటివి చేస్తుంటారు.
కావాల్సిన నైపుణ్యాలు: కాస్కాడింగ్‌ స్టైల్‌ షీట్స్‌ (సీఎస్‌ఎస్‌), బూట్‌ స్ట్రాప్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌5, ఆంగ్యులార్‌ జేఎస్‌
కోర్సులు: లర్నింగ్‌ ఫుల్‌ స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్‌; వెబ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్స్‌: ఫుల్‌ స్టాక్‌ వర్సెస్‌ ఫ్రంట్‌ ఎండ్‌; లర్నింగ్‌ ఈసీఎంఏస్క్రిప్ట్‌ 6; లర్నింగ్‌ రిడక్స్‌; సీఎస్‌ఎస్‌ ఎసన్షియల్‌ ట్రెయినింగ్‌-1

లీడ్‌ జనరేషన్‌ స్పెషలిస్ట్‌
ఇది మార్కెటింగ్, సేల్స్‌ల కలయిక. క్లయింట్లు, కస్టమర్లను గుర్తించడం వీరి ప్రధాన విధి. ఆన్‌లైన్‌ విభాగంలో చేసేవారైతే సెర్చ్‌ ఇంజిన్‌ ప్రామినెన్స్‌ నుంచి సోషల్‌ మీడియా, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌ వరకు అన్ని అంశాలపైనే పనిచేయాల్సి ఉంటుంది. సంబంధిత బృందాన్నీ ముందుండి నడిపిస్తారు. వ్యాపారానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అవి అమలయ్యేలా చూడటంలోనూ వీరిది ప్రధాన పాత్ర.
కావాల్సిన నైపుణ్యాలు: మార్కెట్‌ రిసెర్చ్, ఈ-మెయిల్‌ మార్కెటింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), బిజినెస్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌
కోర్సులు: అడ్వాన్స్‌డ్‌ లీడ్‌ జనరేషన్‌; సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఫర్‌ స్మాల్‌ బిజినెస్‌; కంటెంట్‌ మార్కెటింగ్‌ ఫౌండేషన్స్‌; సేల్స్‌ ప్రాస్‌పెక్టింగ్‌; ఇన్‌సైడ్‌ సేల్స్‌

Back..

Posted on 01-01-2020