Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అడుగేద్దాం.. ఆహార సంస్థలోకి

* ఎఫ్‌సీఐలో 4వేల ఉద్యోగాలు

భారతీయ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) 4103 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటిలో జూనియర్‌ ఇంజినీర్లు, గ్రేడ్‌-2, 3 అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి సౌత్‌ జోన్‌లో 540 పోస్టులున్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన జోన్‌ను ఎంచుకోవచ్చు. ఆ జోన్‌లో ఏదో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు ఉంటాయి.
రెండు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా ఎఫ్‌సీఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఫేజ్‌-1 ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఫేజ్‌-2 నిర్వహిస్తారు. ఫేజ్‌-1 లో అర్హత సాధించినవారిని ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలకు 15 రెట్ల సంఖ్యలో ఫేజ్‌-2 పరీక్షలకు అనుమతిస్తారు. వీటి మార్కుల ప్రకారం తుది నియామకాలుంటాయి.

పోస్టుల‌వారీ అర్హ‌త‌లు:
జేఈ (సివిల్‌): సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి.
జేఈ (ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక‌ల్‌): ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్‌ విభాగాల్లో ఎందులోనైనా డిగ్రీ లేదా ఈ విభాగాల్లో ఎందులోనైనా డిప్లొమాతోపాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి.
స్టెనో: డిగ్రీతోపాటు డీఓఈఏసీసీ నుంచి ఓ లెవెల్ అర్హ‌త‌, టైపింగ్‌లో 40, షార్ట్‌హ్యాండ్‌లో 80 ప‌దాలు నిమిషానికి రావాలి. లేదా కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో డిగ్రీతోపాటు టైపింగ్‌లో 40, షార్ట్‌హ్యాండ్‌లో 80 ప‌దాలు నిమిషానికి ఉండాలి.
గ్రేడ్‌-2 హిందీ: హిందీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఆంగ్లంలో నైపుణ్యం, ఇంగ్లిష్ నుంచి హిందీ అలాగే హిందీ నుంచి ఇంగ్లిష్ అనువాదంలో ఏడాది అనుభ‌వం ఉండాలి.
టైపిస్ట్ (హిందీ): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు నిమిషానికి 30 హిందీ ప‌దాలు టైప్ చేయ‌గ‌ల‌గాలి. హిందీ, ఇంగ్లిష్ రెండు భాష‌ల్లోనూ టైప్ చేయ‌గ‌ల‌గ‌డం, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది.
గ్రేడ్‌-3 జ‌న‌ర‌ల్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
గ్రేడ్‌-3 అకౌంట్స్‌: బీకాం ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
గ్రేడ్‌-3 టెక్నిక‌ల్‌: బోట‌నీ/ జువాల‌జీ/ బ‌యోకెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ మైక్రో బ‌యాల‌జీ/ ఫుడ్ సైన్స్ వీటిలో ఏదైనా స‌బ్జెక్టుతో బీఎస్సీ లేదా ఏజీబీఎస్సీ లేదా ఫుడ్ సైన్స్‌/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ/ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌/ బ‌యోటెక్నాల‌జీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ చ‌దివుండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం అవ‌స‌రం.
గ్రేడ్‌-3 డిపోట్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.

వ‌య‌సు: జ‌న‌వ‌రి 1, 2019 నాటికి జూనియ‌ర్ ఇంజినీర్‌, గ్రేడ్‌-2 హిందీ పోస్టుల‌కు 28 ఏళ్ల‌లోపు ఉండాలి. గ్రేడ్‌-2 స్టెనో, టైపిస్ట్ హిందీ పోస్టుల‌కు 25 ఏళ్ల‌లోపువారు అర్హులు. గ్రేడ్‌-3 జ‌న‌ర‌ల్‌/ అకౌంట్స్‌/ టెక్నిక‌ల్‌/ డిపోట్ పోస్టుల‌కు 27 ఏళ్ల‌లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం:
రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల ద్వారా. ఇందులో ఫేజ్‌-1 అభ్య‌ర్థులంద‌రికీ ఉమ్మ‌డిగా ఉంటుంది. ఫేజ్‌-2 ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టు ప్ర‌కారం నిర్వ‌హిస్తారు. ఫేజ్‌-1 లో అర్హ‌త సాధించిన‌వాళ్లే ఫేజ్‌-2 ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తారు. ఫేజ్‌-2లో సాధించిన మార్కుల ప్ర‌కారం తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. ఫేజ్‌-1 అర్హ‌త ప‌రీక్ష మాత్ర‌మే. ఇందులో సాధించిన మార్కుల‌కు తుది నియామ‌కాల్లో ప్రాధాన్యం ఉండ‌దు. ఫేజ్‌-1 ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ ద్వారా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీల‌కు 15 రెట్ల సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.

ఫేజ్‌-1 ఇలా...
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. గంట వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రశ్నపత్రంలో 3 విభాగాలు. ఒక్కో విభాగంలోని ప్రశ్నలను 20 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ నుంచి 30, రీజనింగ్‌ ఎబిలిటీ 35, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

ఫేజ్‌-2 ఇలా:
ఇందులో అయిదు పేపర్లు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం వీటిలో కొన్నింటిని రాయాల్సి ఉంటుంది.
పేపర్‌-1: ఇందులో 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. రీజనింగ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ, జనరల్‌ అవేర్‌నెస్, కరెంట్‌ ఈవెంట్స్, డేటా అనాలిసిస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నపత్రం జూనియర్‌ ఇంజినీర్లు, గ్రేడ్‌-3 జనరల్, డిపో, అకౌంట్స్, టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది.
పేపర్‌-2: దరఖాస్తు చేసుకున్న విభాగాల ప్రకారం ఈ ప్రశ్నపత్రం మారుతుంది. పరీక్ష వ్యవధి గంట. సంబంధిత విభాగం నుంచి 60 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి.వ్యవధి ఒక గంట. జూనియర్‌ ఇంజినీర్లు, అకౌంట్స్, టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఈ ప్రశ్నలు ఆయా విభాగాలు/ సబ్జెక్టుల నుంచి వస్తాయి.
పేపర్‌-3: వ్యవధి 90 నిమిషాలు. 120 ప్రశ్నలు వస్తాయి. టైపిస్ట్‌ (హిందీ), గ్రేడ్‌-2 అసిస్టెంట్‌ హిందీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఈ ప్రశ్నపత్రం ఉమ్మడిగా ఉంటుంది. జనరల్‌ హిందీ, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంటెలిజెన్స్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పేపర్‌-4: అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 హిందీ పోస్టుల అభ్యర్థులు ఈ పేపర్‌ రాయాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. రెండు ప్యాసేజీలు ఇస్తారు. ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అలాగే హిందీ నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమానికి వీటిని అనువాదం చేయాలి. ఒక్కో దానికి 60 చొప్పున 120 మార్కులు ఈ పేపర్‌కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
పేపర్‌-5: గ్రేడ్‌-2 స్టెనో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పేపర్‌ రాయాలి. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంటెలిజెన్స్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (ఎంఎస్‌ వర్డ్, ఇంటర్నెట్‌) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

తుది ఎంపిక: ఫేజ్‌-2 సంబంధిత పేపర్లలో చూపిన ప్రతిభ ద్వారా తుది నియామకాలు చేపడతారు. టైపిస్టు, స్టెనో పోస్టులకు స్కిల్‌ టెస్టు అదనంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 28
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30 దరఖాస్తు ఫీజు: రూ.500. పరీక్షలు: ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహించవచ్చు.
వెబ్‌సైట్‌: www.fci.gov.in
ఫేజ్‌-1 ప‌రీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం.తెలంగాణ‌లో..హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, నిజామాబాద్‌. ఫేజ్‌-2 ప‌రీక్ష‌ను ఏపీలో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు.
సౌత్‌ జోన్‌లో ఖాళీలెన్ని?
జూనియర్‌ ఇంజినీర్‌: సివిల్‌-26, ఎలక్ట్రికల్, మెకానికల్‌-15, స్టెనో -7, గ్రేడ్‌-2 హిందీ అసిస్టెంట్‌- 15, టైపిస్ట్‌ (హిందీ)-3, గ్రేడ్‌-3 అసిస్టెంట్‌: జనరల్‌- 159, అకౌంట్స్‌-48, టెక్నికల్‌-54, డిపో- 213


Back..

Posted on 25-02-2019