Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి హామీ ఫుట్‌వేర్ కోర్సులు

పిల్లల నుంచి పెద్దల వ‌ర‌కు ప్రతి ఒక్కరికీ పాదర‌క్షలు త‌ప్పనిస‌రిగా మారాయి. ఇప్పుడు ప‌లు ర‌కాల్లో పాద‌ర‌క్షలు ల‌భ్యమ‌వుతున్నాయి. మ‌రి వీటి డిజైన్‌, త‌యారీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా... పాద‌రక్షల డిజైన్‌, త‌యారీ కోసం ప్రత్యేకంగా ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు దేశంలో వెలిశాయి. కొత్త డిజైన్‌లు, స‌రికొత్త మార్పుల‌తో ఆక‌ర్షణీయంగా, మ‌రింత సౌక‌ర్యంగా పాద‌ర‌క్షలు ఎలా త‌యారుచేయాలో ఈ సంస్థలు నేర్పుతాయి. ఇక్కడ కోర్సులు పూర్తిచేసినవారికి పాద‌ర‌క్షలు త‌యారుచేసే కంపెనీలు, రిటైల్ విక్రయ‌శాల‌లు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలిస్తున్నాయి.

పాద ర‌క్షల శిక్షణ‌కు సంబంధించి దేశంలో రెండు ప్రముఖ సంస్థలు వెలిశాయి. కేంద్ర వాణిజ్య, ప‌రిశ్రమ‌ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న‌డుస్తోన్న ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఒక‌టి కాగా మ‌రొక‌టి సూక్ష్మ, చిన్న, మ‌ధ్యత‌ర‌హా ఎంటర్‌ప్రైజ్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌. ఈ సంస్థల్లో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ అర్హత‌ల‌తో ఫుట్‌వేర్‌కు సంబంధించి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సంస్థల వారీ అయా కోర్సుల వివ‌రాలు తెలుసుకుందాం.

సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై

ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌తో...
కోర్సు: సర్టిఫికెట్ ఇన్ ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాల‌జీ
వ్యవ‌ధి: ఏడాది
పీజు: రూ. 80,000
కోర్సు ప్రారంభం: జులైలో

కోర్సు: క్రాష్ కోర్స్ ఇన్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌క్షన్‌
వ్యవ‌ధి: 6 నెల‌లు
పీజు: రూ. 43,000
కోర్సు ప్రారంభం: జులై / డిసెంబ‌రు

కోర్సు: సర్టిఫికెట్ ఇన్ షూ కంప్యూట‌ర్ ఎయిడెడ్ డిజైన్‌
వ్యవ‌ధి: 3 నెల‌లు
పీజు: రూ. 25,000
కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి, ఏప్రిల్‌, జులై, అక్టోబ‌రు

ఇంట‌ర్ అర్హత‌తో...
కోర్సు: డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డిజైన్‌
వ్యవ‌ధి: రెండేళ్లు
పీజు: రూ. 1,67,000
కోర్సు ప్రారంభం: ఆగ‌స్టు

కోర్సు: స‌ర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌
వ్యవ‌ధి: ఏడాది
పీజు: రూ. 1,30,000
కోర్సు ప్రారంభం: జులై

డిగ్రీ అర్హత‌తో...
కోర్సు: పీజీ హ‌య్యర్ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
వ్యవ‌ధి: 18 నెల‌లు
పీజు: రూ. 4,65,000
కోర్సు ప్రారంభం: మే, సెప్టెంబ‌రు
(ఈ కోర్సులో చేరిన‌వాళ్లు 6 వారాల‌పాటు లండ‌న్‌లో చ‌దువుకుంటారు. లండ‌న్ ప్రయాణ, వ‌స‌తి ఖ‌ర్చులు ఫీజులో భాగంగా ఉన్నాయి)

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాల‌జీ
వ్యవ‌ధి: 18 నెల‌లు
పీజు: రూ. 1,53,000
కోర్సు ప్రారంభం: సెప్టెంబ‌రు

పై కోర్సుల‌కు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రముఖ పాద‌ర‌క్షల త‌యారీ కంపెనీలు బాటా, టాటా ఇండియా, వీకేసీ ప్రైడ్ లాంటివ‌న్నీ ఇక్కడ చ‌దివిన‌వాళ్లను క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక‌చేసుకుంటున్నాయి. కోర్సు బ‌ట్టి రూ.ప‌దివేల నుంచి రూ.పాతిక‌వేల వ‌ర‌కు వేత‌నంగా చెల్లిస్తున్నాయి. ప‌లు పార్ట్ ట‌ర్మ్ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పై కోర్సుల్లో ప్రవేశానికి ప్రక‌ట‌న వెలువ‌డింది. వ‌స‌తి సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తున్నారు.
వెబ్‌సైట్‌:http://www.cftichennai.in/

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
ఈ సంస్థకు హైద‌రాబాద్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నాయి. ఎఫ్‌డీడీఐ ఇంట‌ర్ విద్యార్థుల‌కు బీఎస్సీ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌క్షన్ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు ఇదే సంస్థలో ఎమ్మెస్సీ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌క్షన్ కోర్సు చ‌దువుకోవ‌చ్చు. ప్రవేశ‌ ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు.
వెబ్‌సైట్‌:http://www.fddiindia.com/


Back..

Posted on 19-06-2017