Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
హాబీలు.. భాషలు నేర్చుకోండి ఉచితంగా!

లాక్‌డౌన్‌ దశలవారీగా కొనసాగుతోంది. ఈ సమయాన్ని కాలక్షేపంతో నెట్టుకొస్తూ ‘బోర్‌’ అని బాధపడకుండా కొత్త హాబీని, సరికొత్త భాషను నేర్చుకోమని సూచిస్తోంది ఫ్యూచర్‌ లర్న్‌ సంస్థ. అవి కెరియర్‌ అభివృద్ధికీ దోహదపడతాయని చెబుతోంది. ఇందు కోసం రకరకాల కోర్సులను రూపొందించి ఆన్‌లైన్‌లో ఉచితంగా అందిస్తోంది. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు వాటిని ప్రయత్నించవచ్ఛు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండిపోయినవారి కోసం లండన్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ విద్యాసంస్థ- ‘ఫ్యూచర్‌ లర్న్‌’ కొన్ని ఆసక్తికరమైన కోర్సులను ‘బోర్‌డమ్‌ బస్టింగ్‌ కోర్సెస్‌’ పేరుతో నిర్వహిస్తోంది. ఇవన్నీ 29 రకాల స్వల్పకాలిక ఆన్‌లైన్‌ కోర్సులు. కొత్త నైపుణ్యాలు, ఆసక్తులను ప్రయత్నించాలనుకునేవారు, కెరియర్‌లో అభివృద్ధిని కోరుకునేవారు వీటిని ప్రయత్నించవచ్ఛు

* హాబీలను ప్రయత్నించాలనుకునే వారికి స్టార్ట్‌ ఫిక్షన్‌, రైటింగ్‌ ఫస్ట్‌ సాంగ్‌, అండర్‌స్టాండింగ్‌ మ్యూజికల్‌ స్కోర్స్‌, ఇంట్రడక్షన్‌ టూ స్క్రీన్‌ రైటింగ్‌, వర్చువల్‌ టూర్‌ ఆఫ్‌ రోమ్‌, పోడ్‌కాస్టింగ్‌ స్టోరీ టెల్లింగ్‌, ఫాల్‌ ఇన్‌ లవ్‌ విత్‌ మాండరిన్‌ వంటి కోర్సులున్నాయి.

* ఆసక్తి మేరకు తెలుసుకోవాలనుకునే వారికి. మూన్స్‌, ప్రాపగాండా అండ్‌ ఐడియాలజీ ఇన్‌ ఎవ్రీడే లైఫ్‌, మైండ్‌ఫుల్‌నెస్‌ ఫర్‌ వెల్‌బీయింగ్‌, మేకింగ్‌ బేబీస్‌ ఇన్‌ ద 21 సెంచరీ, ఇంట్రడక్షన్‌ టూ నార్వేయిన్‌, ఇంట్రడక్షన్‌ టూ రిక్రియేషనల్‌ మేథ్స్‌, స్టేయింగ్‌ సేఫ్‌: హౌ టూ బీ ప్రిపేర్డ్‌ ఇన్‌ ద మోడర్న్‌ వరల్డ్‌, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌, అండర్‌స్టాండింగ్‌ జెండర్‌ ఇన్‌-ఈక్వాలిటీ, గ్లోబల్‌ ఎథిక్స్‌, డీమిస్టిఫయింగ్‌ మైండ్‌ఫుల్‌నెస్‌ వంటి కోర్సులున్నాయి.

* కెరియర్‌ వృద్ధి చేసుకోవాలనుకున్నా, కెరియర్‌ మార్చుకోవాలనుకున్నా.. బిగిన్‌ ప్రోగ్రామింగ్‌: బిల్డ్‌ యువర్‌ ఫస్ట్‌ మొబైల్‌ గేమ్‌, ఫోరెన్సిక్‌ సైకాలజీ, ఆంటీక్స్‌ ట్రాఫికింగ్‌ అండ్‌ ఆర్ట్‌ క్రైమ్‌, ఇంట్రడక్షన్‌ టూ ఫోరెన్సిక్‌ అండ్‌ బయో ఆర్కియాలజీ, మేక్‌ చేంజ్‌ హాపెన్‌, వెల్‌ బీఈంగ్‌ ఎట్‌ వర్క్‌, అండర్‌స్టాండింగ్‌ ఫ్యాషన్‌: ఫ్రమ్‌ బిజినెస్‌ టూ కల్చర్‌, ఎసెన్షియల్‌ స్కిల్స్‌ ఫర్‌ యువర్‌ కెరియర్‌ డెవలప్‌మెంట్‌, వెల్‌ బీయింగ్‌ అండ్‌ రెజిలెన్స్‌ ఎట్‌ వర్క్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ ఎట్‌ వర్క్‌, వరల్డ్‌ ఆఫ్‌ స్పైస్‌ వంటి కోర్సులున్నాయి.

ఇవన్నీ ఆన్‌లైన్‌ కోర్సులు. కాలవ్యవధి రెండు నుంచి ఎనిమిది వారాల వరకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలూ ఈ కోర్సులను అందిస్తున్నాయి. అక్కడి నిపుణులు వీటిని బోధిస్తారు. తోటి విద్యార్థులతో కోర్సు అంశాలను చర్చించుకునే అవకాశమూ ఉంటుంది. కోర్సునుబట్టి అసైన్‌మెంట్లు ఉంటాయి. కోర్సు అనంతరం అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలుంది. దానికి మాత్రం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అప్‌గ్రేడ్‌ చేసుకున్నవారికే సర్టిఫికెట్‌ ఇస్తారు. కోర్సు చేయాలనుకునేవారు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లేదా ఈ-మెయిల్‌తో రిజిస్టర్‌ కావచ్ఛు షెడ్యూల్‌ చేసుకుని, చేరవచ్ఛు

వెబ్‌సైట్‌: https://www.futurelearn.com/courses/collections/boredom-busters

Back..

Posted on 26-05-2020