Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గెయిల్‌లో 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

-గేట్‌-2017 స్కోర్‌తో నియామ‌కాలు
ప్రభుత్వ రంగ మ‌హార‌త్న కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన‌వాళ్లు వీటికోసం పోటీ ప‌డొచ్చు. గేట్‌-2107 స్కోర్ ద్వారా ఈ నియామ‌కాలు చేప‌డ‌తారు. గేట్‌-2017 ఆశావ‌హులు ఎలాంటి ఫీజు చెల్లించ‌కుండా ఆన్‌లైన్‌లో గెయిల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ఖాళీలిలా...
కెమిక‌ల్-23, మెకానిక‌ల్‌-15, ఎల‌క్ట్రిక‌ల్‌-15, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-10, సివిల్ - 5, బిజినెస్ ఇన్ఫర్మేష‌న్ సిస్టం-5

అర్హత‌: స‌ంబంధిత బ్రాంచ్ లేదా అనుబంధ బ్రాంచ్‌లో 65 శాతం మార్కుల‌తో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. బిజినెస్ ఇన్ఫర్మేష‌న్ సిస్టం పోస్టుల‌కు మాత్రం ఇంజినీరింగ్‌లో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ లేదా ఎంసీఏ 65 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించిన‌వాళ్లూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 శాతం మార్కులు సాధిస్తే స‌రిపోతుంది. ప్రస్తుతం ఆఖ‌రు సంవ‌త్సరం కోర్సులు చ‌దువుతున్నవారంతా ఈ పోస్టుల‌కు అర్హులే.

వ‌యోప‌రిమితి: జ‌న‌వ‌రి 20, 2017 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం: స‌ంబంధిత బ్రాంచీ/ విభాగంలో గేట్‌-2017లో సాధించిన స్కోర్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు బృంద చ‌ర్చలు, మౌఖిక ప‌రీక్షలు నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ఎంపికైతే:
ఏడాదిపాటు ట్రైనింగ్ క‌మ్ ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. ఈ స‌మ‌యంలో ప్రతి నెల రూ. 24,900 మూల‌వేత‌నం చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. రూ.24,900-50,500తో వేత‌న శ్రేణి ఆరంభ‌మ‌వుతుంది. (కొత్త పే స్కేల్ అమ‌ల్లోకి రాగానే ఈ వేత‌న శ్రేణి మ‌రింత పెరుగుతుంది)

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. (గేట్‌-2017కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికే ఈ సౌల‌భ్యం ఉంది. గేట్‌-2017 ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది కాబ‌ట్టి ఆ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేయ‌నివాళ్లు గెయిల్‌ పోస్టుల‌కు అన‌ర్హులు)

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: ఫిబ్రవ‌రి 17 సాయంత్రం 6 వ‌ర‌కు
వెబ్‌సైట్‌: www.gailonline.com

NOTIFICATION


Back..

Posted on 11.-01-2017