Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి హిందీ

హిందీ భాషా దినోత్సవం కొద్దిరోజుల్లో ... సెప్టెంబరు 14న జరగనున్నది. ఈ ‘హిందీ దివస్‌’ నేపథ్యంలో ఈ భాషా సాహిత్యాల విద్యావకాశాలు, దీనిద్వారా లభించే ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం!

ప్రభుత్వపాలనలో శాసనాలు, చట్టాలు రూపొందించే భాషనే రాజభాషగా చెపుతారు. 1949లో సెప్టెంబరు 14న భారత రిపబ్లిక్‌కు హిందీని రాజభాషగా ఆమోదించారు. అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తోంది. హిందీ అధ్యయనం కోసం విద్యాసంస్థల స్థాపన, పథకాలు ప్రవేశపెట్టడం, అనువాదాలనూ, భాషా సాహిత్యాలనూ ప్రోత్సహించడం వంటివి నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హిందీ అధ్యయనం కోసం భాషా ప్రచారసంస్థలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి ఇవి ఎంతోమంది విద్యార్థులను హిందీ భాషా పండితులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. దక్షిణభారత హిందీ ప్రచార సభ నిర్వహించే పండిట్‌ ట్రెయినింగ్‌ కోర్సుల శిక్షణ కేంద్రాలు విజయవాడ, తెనాలి, అవనిగడ్డ, రాజమండ్రి, గుంతకల్‌, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నాయి.

రెగ్యులర్‌ బి.ఇడి కోర్సులు
దక్షిణ భారత హిందీ ప్రచారసభ (మద్రాసు) ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల్లో నడుస్తున్న మూడు కళాశాలల్లో రెండు సంవత్సరాల వ్యవధిగల హిందీ బి.ఇడి కోర్సును నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌- ఖైరతాబాద్‌, విజయవాడ మాచవరం, విశాఖపట్నాల్లో వంద చొప్పున మొత్తం 300 సీట్లు అందుబాటులో ఉంటాయి. బీఏ/బీఎస్సీ/బీకాం డిగ్రీలో హిందీ ద్వితీయ భాషగా చదివివుండాలి. కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్‌టీ, బీసీవారు 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్‌ హిందీ బి.ఇడి కోర్సుల్లో ప్రవేశానికి ఏటా జూన్‌/జులైలలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి ప్రకటన వెలువడుతుంది.

దూరవిద్యా కోర్సులు
బిఏ (హిందీ): అర్హత- 10+2తో హిందీ ద్వితీయ భాష/విశారద, ప్రవీణ, తత్సమాన కోర్సులు చదివి ఉండాలి. (10+2+ విశారద+ ప్రవీణ).
ఎంఏ (హిందీ): అర్హత- 10+2+3తో ప్రవీణ లేదా బిఏ (హిందీ) డిగ్రీ
ఎంఫిల్‌ (హిందీ): అర్హత- ఎంఏ హిందీ సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత (10+2+3) కలిగివుండాలి.
పీహెచ్‌డీ (హిందీ): అర్హత- ఎంఫిల్‌ (హిందీ/గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 5 సం॥ బోధన అనుభవం/ఎంఏ. హిందీ-ప్రవేశపరీక్షతో పాటు మౌఖిక పరీక్ష ఉంటుంది. వివరాలకు డైరెక్టర్‌, డిస్టె్టన్స్‌ ఎడ్యుకేషన్‌, దక్షిణభారత హిందీ ప్రచారసభ, త్యాగరాయనగర్‌, మద్రాసు 600017ను సంప్రదించవచ్చు.

హిందీ ప్రచారసభ హైదరాబాద్‌
హిందీ భాషాభివృద్ధి కోసం 1935 సంవత్సరంలో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ చొరవతో హైదరాబాద్‌ ఆంధ్రమహిళాసభ ప్రాంగణంలో హిందీ ప్రచారసభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయిన సంస్థ ఇది. ఈ సంస్థలోని కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు ఉంది. విద్వాన్‌ కోర్సు పూర్తి చేసుకున్నవారు హిందీ పండిట్‌ శిక్షణ కోర్సు చేయడానికి అర్హత పొందుతారు. ఈ అర్హత పరీక్షలు మార్చి/సెప్టెంబర్‌ నెలల్లో జరుగుతాయి. హైదరాబాద్‌ హిందీ ప్రచారసభ ఏడాది కాలపరిమితి ఉన్న హిందీ పండిట్‌ ట్రెయినింగ్‌ (హిందీ శిక్షక్‌, ప్రశిక్షణ్‌) కోర్సులను కూడా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన పండిట్‌ ట్రైనింగ్‌ కళాశాల్లో నిర్వహిస్తుంది.

చిరునామా: హిందీ ప్రచారసభ, హిందీ భవన్‌¯ లక్ష్మీనారాయణ గుప్తా మార్గ్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్‌, హైదరాబాద్‌-500001. ఈ సభ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాదీ ఎల్‌పీ సెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా ప్రవేశాలుంటాయి. 100 ప్రశ్నలకు 100 మార్కులతో బహుళైచ్ఛిక జవాబులిచ్చే ప్రశ్నపత్రం ఉంటుంది. మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి కౌన్సెలింగ్‌ ద్వారా వివిధ శిక్షణ కేంద్రాల్లో ప్రవేశం కల్పిస్తారు. పండిట్‌కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షకు (టెట్‌)కు అర్హులవుతారు.

హిందీ సాహిత్య సమ్మేళన్‌ అలహాబాద్‌
హిందీ భాషేతర ప్రాంతాల్లో హిందీ భాష ప్రచారంకోసం 1910 సంవత్సరంలో పురుషోత్తమ్‌దాస్‌ టాండన్‌ సారథ్యంలో ఏర్పడింది. విద్వాన్‌/ప్రవీణ/మధ్యమ (విశారద)లో ఏదైన కోర్సు చేసిన అభ్యర్థులు లేదా బీఏ/బీకామ్‌/బీఎస్‌సీ కోర్సులలో హిందీ సబ్జెక్టులో చదివినవారు బీఎడ్‌ చేయడానికి అర్హులు.
బి.ఎ., బి.కాం., బీఎస్‌సీ కోర్సుల్లో హిందీ సబ్జెక్టుతో చదివినవారు బీఎడ్‌ చేయడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియమితులై అనంతరం తమ విద్యార్హతలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్న అభ్యర్థుల ప్రయోజన నిమిత్తం వివిధ సంస్థలు దూరవిద్యావిధానంలో సైతం హిందీ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి విద్వాన్‌/ప్రవీణ/మధ్యమ (విశారద) కోర్సు చేసి వుండాలి. అయితే 3 సంవత్సరాలు గుర్తింపు ఉన్న పాఠశాలలో బోధ¿న అనుభవం వుండాలి. ఆసక్తి ఉన్నవారు ఈ హిందీ విద్యా కేంద్రాలలో సంప్రదించవచ్చు.
1) కేంద్రీయ హిందీ సంస్థాన్‌, హిందీ సంస్థాన్‌ మార్గ్‌, ఆగ్రా.
2) కేంద్రీయ హిందీ సంస్థాన్‌, 2-2-12/5, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ రోడు,్డ హైదరాబాద్‌- 500007 3) కేంద్రీయ హిందీ సంస్థాన్‌, సూర్యముఖ్‌ భవన్‌, శ్రీ అరవిందమార్గ్‌ న్యూదిల్లీ.
జాతీయ స్థాయిలో డిగ్రీ సమాన అర్హత ఉన్న విద్వాన్‌/ప్రవీణ/మధ్యమ (విశారద) పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించినవారు ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షలకు అర్హులు ఈ కోర్సులను ప్రాథమికోన్నత దశ విద్యార్థుల నుంచి వ్యాపారులు, గృహిణులు, పదవీవిరమణ చేసినవారు సైతం చేయడానికి అవకాశం కల్పించారు. హిందీ ప్రచార సభలు, స్వయంప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాలు, ఇతర హిందీ విద్యాసంస్థలు ఈ కోర్సులను అందిస్తుంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు హిందీ ప్రచారకులను గానీ, హిందీ అధ్యాపకుల వద్ద గానీ పూర్తి వివరాలు పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో....
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో.. జనరల్‌ స్టడీస్‌లో వచ్చే ప్రశ్నలు ఆంగ్లంతోపాటు హిందీ భాషలో వుంటాయి. ఆంగ్లంలో అవగాహనలోపం ఏర్పడితే హిందీని బట్టి అర్థం చేసుకునే వీలు ఈ భాష తెలిసినవారికే ఉంటుంది. పైన తెలిపిన హిందీ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా బోధన రంగంలోనే కాకుండా, ఇŹర వృత్తిపరమైన రంగాలలో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. తపాలా, భారత్‌ సంచార్‌ నిగమ్‌, జాతీయ బ్యాంకులు, న్యాయస్థానాలు, జీవిత బీమా, మీడియా, చట్టసభల్లో ట్రాన్స్‌లేటర్లు, జర్నలిస్ట్‌ ఉద్యోగాలకు హిందీ భాషా పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
హిందీ భాషలో ప్రావీణ్యం వుంటే ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
www.rajbhasha.nic.in
www.ildc.gov.in
www.bhashaindia.com
మౌలానా ఆజాద్‌ విశ్వవిద్యాలయం ద్వారా హిందీలో ప్రావీణ్యం సాధించినవారికి ఉపకారవేతనాలు అందిస్తూ భాషాభ్యుదయానికి కృషి చేస్తోంది.

ఇదీ ప్రత్యేకత
భారతప్రభుత్వ పాలనలో హిందీ భాష నాలుగు రూపాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన ప్రత్యేకత నిలబెట్టుకుంటోంది.
విధానసభలు: రాజ్యసభ, లోక్‌సభల్లో ఉపయోగించే భాష హిందీ. ఈ సభల ద్వారా ఏ చట్టం చేయాలన్నా ముందుగా హిందీ భాషలోనే రూపొందించి ఆమోదించాలి.
కేంద్ర కార్యాలయాలు: కేంద్రప్రభుత్వ అధీనంలో నడిచే ఏ కార్యాలయంలోనైనా కార్యకలాపాలన్నీ హిందీ భాషలోనే కొనసాగుతాయి.
న్యాయపాలన: ఉన్నత న్యాయస్థానంలో ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులన్నీ రాజభాషలోనే రూపొందిస్తారు.
శిక్షణ మాధ్యమభాష: దేశవ్యాప్తంగా పదో తరగతి వరకు ఉండే విద్యలో హిందీ సబ్జెక్టు తప్పనిసరి. ఇంటరు, డిగ్రీలలో ద్వితీయ భాషగా హిందీని అభ్యసించవచ్చు.

Posted on 12-9-2017

Back..