Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వ్యవసాయ కోర్సులకు ఐకార్‌ ఆహ్వానం

* వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కోసం ప్రభుత్వం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐకార్‌)ను ఏర్పాటు చేసింది. దీనికి అనుబంధంగా యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, కళాశాలలు ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరానికి ఈ సంస్థ యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ (ఎన్‌టీఏ ఐకార్‌- 2019) విడుదల చేసింది. రాతపరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

సాఫ్ట్‌వేర్‌, సేవా రంగాల్లో దూసుకుపోతున్నా మనదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యం తగ్గలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వివిధ కోర్సుల నిర్వహణ వ్యవసాయ రంగ అభ్యున్నతిలో భాగమే. ఐకార్‌కు అనుబంధంగా 3 కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 4 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 64 స్టేట్‌ అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టీకల్చర్‌, ఫిషరీ యూనిర్సిటీలు ఉన్నాయి. ఏటా ఈ రంగంలో 15000 గ్రాడ్యుయేట్‌లు, 11000 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లు, 2500 పీహెచ్‌డీ విద్యార్థులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వివిధ విభాగాల్లో చేరుతున్నారు.

కోర్సులు - అర్హత
ఐకార్‌ ఏఐఈఈఏ (యూజీ) - బీఎస్సీ (ఆనర్స్‌), అగ్రికల్చర్‌, బీఎస్సీ(ఆనర్స్‌), హార్టీకల్చర్‌, బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ(ఆనర్స్‌), ఫారెస్ట్రీ, బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీసైన్స్‌, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్‌, బీఎస్సీ(ఆనర్స్‌), సెరీకల్చర్‌, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌ బయో-టెక్నాలజీ. కాలపరిమితి మూడు సంవత్సరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌లో పీసీబీ/ పీసీఎంబీ/ పీసీఎం/ ఇంటర్‌-అగ్రికల్చర్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత.
దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ఎన్‌టీఏ ఐకార్‌లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా అన్ని రాష్ట్రాలవారికి 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అయితే ఆ 15శాతంలో ఒకే రాష్ట్రానికి చెందిన 40శాతం మంది విద్యార్థులకు ఇవ్వరు. యూపీలోని రాణీ¨ లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(ఆర్‌ఎల్‌బీ సీఏయూ), హరియాణాలోని నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ), బిహార్‌లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(ఆర్‌పీ సీఏయూ)లో 100 శాతం సీట్లు ఐకార్‌ ఏఐఈఈఏ (యూజీ) ఉత్తీర్ణులైనవారు పొందవచ్చు.

ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ)- ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్స్‌, ఎంటమాలజీ అండ్‌ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్‌ సైన్సెస్‌, స్టాటిస్టికల్‌ సైన్సెస్‌, హార్టీకల్చర్‌, ఫారెస్ట్రీ/ అగ్రోఫారెస్ట్రీ అండ్‌ సిల్వీకల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వాటర్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్‌/ కమ్యునిటీసైన్స్‌, యానిమల్‌ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్‌, యానిమల్‌ సైన్స్‌, ఫిషరీస్‌ సైన్స్‌, డెయిరీ సైన్స్‌, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌సైన్స్‌ టెక్నాలజీ, అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌/ హార్టీకల్చర్‌/ ఫారెస్ట్రీ/ కమ్యునిటీసైన్స్‌/ సెరీకల్చర్‌, బీఎఫ్‌ఎస్సీ, ఫుడ్‌న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్‌, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌ బయో-టెక్నాలజీ ఉత్తీర్ణత.

ఐకార్‌ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీజీ) - క్రాప్‌ సైన్సెస్‌- I, క్రాప్‌ సైన్సెస్‌- II, క్రాప్‌ సైన్సెస్‌- III, హార్టీకల్చర్‌, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌- I, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌- II, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌- III, డెయిరీ సైన్స్‌, డెయిరీ టెక్నాలజీ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్‌/ కమ్యునిటీసైన్సెస్‌, ఫిషరీ సైన్సెస్‌, నాచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌- I నాచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌- II, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌, అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్స్‌.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత.
ఐకార్‌ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీజీఎస్‌)లో ఉత్తీర్ణులైనవారికి ఐకార్‌ ఏయూ పరిధిలో ఉన్న అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. దేశంలో ఉన్న అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐకార్‌ - డీయూ, ఐకార్‌ ఐవీఆర్‌ఐలో వందశాతం సీట్లు కేటాయిస్తారు.

మన యూనివర్సిటీలు
ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ- గుంటూరు, వైఎస్‌ఆర్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ- తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వరా వెటర్నరీ యూనివర్సిటీ- తిరుపతి, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ- హైదరాబాద్‌, శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ- హైదరాబాద్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ- హైదరాబాద్‌.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: ఏప్రిల్‌ 30
ఫీజు చెల్లించడానికి చివరితేది: మే 01
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: జూన్‌ 01.

స్కాలర్‌షిప్‌
పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం ఉంది. అందుకోసం ఐకార్‌ పీజీ స్కాలర్‌షిప్‌, నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా 600 మందిని ఎంపిక చేస్తారు. వారికి నెలకు రూ.12,640తో పాటు కంటింజెంట్‌ గ్రాంటు కింద సంవత్సరానికి రూ. 6000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ) ఉత్తీర్ణులైనవారికి అన్ని అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. దేశంలో ఉన్న మొత్తం నాలుగు ఐకార్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలైన ఇండియన్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(ఐఏఆర్‌ఐ), ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ), నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట ్(ఎన్‌డీఆర్‌ఐ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌ (సీఐఎఫ్‌ఈ)లో వందశాతం సీట్లు కేటాయిస్తారు.

ఎంపిక విధానం
దేశవ్యాప్తంగా లక్షలమంది విద్యార్థులు యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం పరీక్షలు రాస్తుంటారు. ప్రిలిమినరీ దశలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. యూజీ పరీక్షకు 200 ప్రశ్నలతో 600 మార్కులకు, పీజీకి 160 ప్రశ్నలతో 640, పీహెచ్‌డీకి 200 ప్రశ్నలతో 800 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అందులో మెరిట్‌ ఆధారంగా తగిన విభాగాన్ని ఎంచుకోవచ్చు.


Back..

Posted on 10-04-2019