Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్త కోర్సుల వైవిధ్యం

* జనవరి సెషన్‌ ప్రవేశాలకు ఇగ్నో ప్రకటన

దూరవిద్య అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయమే. వైవిధ్యమైన కోర్సులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్‌, ఆన్‌లైన్‌లో నేర్చుకునే సౌలభ్యం, కాంటాక్ట్‌ తరగతులు, అందుబాటు ధరల్లో ఫీజు, సర్టిఫికెట్‌కు విలువ... తదితర కారణాలతో ఎక్కువమంది ఈ యూనివర్సిటీ కోర్సుల్లో చేరుతున్నారు. రెగ్యులర్‌ విధానంలో లేని కోర్సులనూ అందించడం ఇగ్నో ప్రత్యేకత. తక్కువ విద్యార్హతలు ఉన్నవారికీి, వృత్తి నిపుణులకూ, ఉన్నత విద్యను కోరుకునేవారికీ... ఇలా అందరి అవసరాలూ తీరేలా విభిన్న కోర్సులు ఇక్కడున్నాయి. ఏడాదికి రెండు సార్లు జనవరి, జులైల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. జనవరి సెషన్‌లో కొత్తగా ఆరు వైవిధ్యకరమైన కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ సెషన్‌లో ప్రవేశానికి తాజాగా ప్రకటన వెలువడింది!

సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో పలు కోర్సులు ఇగ్నో అందిస్తోంది. ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌, సోషల్‌ సైన్సెస్‌లే కాకుండా మెడిసిన్‌, న్యూట్రిషన్‌, నర్సింగ్‌, అగ్రికల్చర్‌, లా ఇలా రంగాలు, వృత్తులవారీ విస్తృత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జనవరి, జులై రెండు సెషన్లలో ఉమ్మడిగా అందించే కోర్సులు ఎక్కువగా ఉంటాయి. కేవలం జనవరి లేదా జులై సెషన్‌ కు మాత్రమే ప్రత్యేకమైన కోర్సులూ ఉన్నాయి. ఏ కోర్సులో చేరినప్పటికీ అందుకు సంబంధించిన వీడియో పాఠాలు జ్ఞానదర్శన్‌ (స్వయంప్రభ) లో చూసుకోవచ్ఛు అలాగే ఇగ్నో ఈ-కంటెంట్‌ యాప్‌ ద్వారా కూడా పాఠాలు చదువుకోవచ్ఛు.

ఇగ్నో ఈ జనవరి సెషన్‌ నుంచి కొత్తగా అందిస్తున్న కోర్సులు
1) బీబీఏ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌: దీన్ని మహారాష్ట్ర నాలెడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి అందిస్తోంది. సేవారంగంలో ఉద్యోగిగా కొనసాగడానికి అనువుగా దీన్ని రూపొందించారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఫీజు ఏడాదికి రూ.20,000. కోర్సులో భాగంగా ఏదైనా సంస్థలో కొన్నాళ్లు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. కోర్సు ఆన్‌లైన్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌ (ఓడీఎల్‌) విధానంలో అందిస్తారు. సేవా రంగంలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకునేలా తర్ఫీదు అందిస్తారు. మెంటర్‌ సైతం ఉంటారు. నేర్చుకోవడం, పని అనుభవం పొందడం రెండూ కోర్సు ద్వారా దక్కుతాయి.
ప్రవేశం: రాతపరీక్ష ద్వారా లభిస్తుంది. డిసెంబరు 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 22న పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి జనవరిలో ఇంటర్వ్యూలు ఉంటాయి. అనంతరం కోర్సులోకి తీసుకుంటారు. తరగతులు ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి.
అర్హత: ఇంటర్‌ లేదా సమాన కోర్సు పూర్తిచేసినవారై ఉండాలి. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తికావాలి. సర్వీసెస్‌ పరిశ్రమలో ఫుల్‌టైమ్‌ ఇంటర్న్‌ / అప్రెంటీస్‌ / ఉద్యోగిగా కొనసాగుతున్నవారై ఉండాలి లేదా ఏదైనా సంస్థలో చేరడానికి సంసిద్ధులై ఉండాలి. ఇలా చేరినవారికి ప్రతి నెలా స్టయిపెండ్‌ అందుతుంది. దీన్ని చేరిన సంస్థ నిర్ణయిస్తుంది. మహరాష్ట్ర (ముంబయి, పుణె)లోని కొన్ని సంస్థలు ఇగ్నోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
2) ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్‌కమ్యూనికేషన్‌: థియరీ, ప్రాక్టికల్స్‌ మేళవింపుతో ఓపెన్‌, డిస్టెన్స్‌ విధానాల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. మీడియా సంస్థల్లో సేవలు అందించడానికి అవసరమైన నైపుణ్యాలు కోర్సు ద్వారా లభిస్తాయి. ప్రింట్‌ మీడియా, రేడియో, టెలివిజన్‌, న్యూమీడియా(ఆన్‌ లైన్‌), అడ్వర్ట్టైజింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, మీడియా పరిశోధన...విభాగాల్లో కెరియర్‌ ఆశిస్తోన్నవారు ఇందులో చేరవచ్ఛు కోర్సు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు ఏడాదికి రూ.12,500 చొప్పున రెండేళ్లకు రూ.25,000.
3) పోస్టుగ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.5500. వైద్యులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో సేవలు అందిస్తున్నవారు కోర్సు ద్వారా ప్రయోజనం పొందవచ్ఛు ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ విధానంలో కోర్సు అందిస్తున్నారు.
4) సీబీసీఎస్‌ విధానంలో బీఏ ఆనర్స్‌: జనవరి 2020 సెషన్‌ నుంచి బీఏ ఆనర్స్‌ డిగ్రీ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నారు.
5) పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌: ఈ కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం. థియరీ, ప్రాక్టికల్స్‌ కలిపి రెండు సెమిస్టర్లలో 12 పేపర్లుంటాయి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. కంప్యూటర్‌ రంగంలో స్థిరపడాలనుకునేవారికి కంప్యూటర్‌ గురించి అవగాహన పెంపొందించుకోవాలనుకునేవారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు సెమిస్టర్లకు ఫీజు రూ. 21,000.
6) సర్టిఫికెట్‌ ఇన్‌ అడోలిసెంట్‌ హెల్త్‌ అండ్‌ కౌన్సెలింగ్‌: ఈ కోర్సుల్లో ప్రాథమిక, ఉన్నత, మహోన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఓపెన్‌, డిస్టెన్స్‌ విధానంలో చదువుకోవచ్ఛు కోర్సు కాల వ్యవధి 6 నెలలు. కోర్సు ఫీజు: 2000. కౌమారదశ పిల్లల్లో కనిపించే ముఖ్యాంశాలు, సమస్యలు, సవాళ్లు, మెలకువల గురించి నేర్పుతారు. రెండు థియరీ, ఒక ప్రాక్టికల్‌ పేపర్లు ఉంటాయి.

ఆన్‌లైన్‌ ప్రవేశాలు - ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు - డాక్టర్‌ బి.ప్రసాద్‌బాబు అడ్మిషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ ఇగ్నో ప్రాంతీయకేంద్రం, విజయవాడ.
జనవరి 2020 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇగ్నో ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. విద్యార్థులు ఇగ్నో వెబ్‌సైటులో లాగిన్‌ అయి ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ పోర్టల్‌లో యూజర్‌ ఐడీి, పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేసుకోవాలి. విద్యార్హతలు, ఫొటో, సంతకం, కుల ధ్రువీకరణ పత్రాలను స్కాన్‌ చేసుకొని అప్‌లోడ్‌ చేయడం ద్వారా దరఖాస్తును సమర్పించి అడ్మిషన్‌ పొందవచ్ఛు సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ఆన్‌లైన్‌ విధానంలో కల్పిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాదు, విశాఖ పట్టణాల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 75 అధ్యయన కేంద్రాలు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. 187 కోర్సులను దేశ వ్యాప్తంగా 3000 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు దూర విద్యా విధానంలో ఉన్నతవిద్యను అందిస్తున్నారు.

వీరిని సంప్రదించవచ్ఛు..
విజయవాడ ప్రాంతీయ కేంద్రం
ఈ-మెయిల్‌: rcvijayawada@ignou.ac.in
ఫోన్‌: 0866-2565959

హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం
ఈ-మెయిల్‌: rchyderabad @ignou.ac.in
ఫోన్‌: 040-23117550

విశాఖపట్టణం ప్రాంతీయ కేంద్రం
ఈ-మెయిల్‌: rcvisakhapatnam@ignou.ac.in
ఫోన్‌: 0891-2511200

ఈ సెషన్‌లో మాత్రమే..
పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమా ఇన్‌ జేరియాట్రిక్‌ మెడిసిన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, పీజీ డిప్లొమా ఇన్‌ హెచ్‌ఐవీ మెడిసిన్‌, డిప్లొమా ఇన్‌ నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌, డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ జర్మన్‌ యాజ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌, మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యాథమెటిక్స్‌ విత్‌ అప్లికేషన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు జనవరి సెషన్‌లో మాత్రమే లభిస్తాయి.

ఏ కోర్సులు? ఎన్ని?
29 మాస్టర్‌ డిగ్రీ 5 డిగ్రీ
4 సీబీసీఎస్‌ డిగ్రీ
9 సీబీసీఎస్‌ డిగ్రీ ఆనర్స్‌
38 పీజీ డిప్లొమా 22 డిప్లొమా
80 సర్టిఫికెట్‌
187 మొత్తం కోర్సులు
పూర్తి వివరాలకు జనవరి 2020 ప్రాస్పెక్టస్‌ను చూడవచ్ఛు
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 31
వెబ్‌సైట్‌: http://ignou.ac.in/

ఇవీ కోర్సులు
ఎంఏ: రూరల్‌ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, సైకాలజీ, ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్, జండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌. మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (కౌన్సెలింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ బీఏ టూరిజం స్టడీస్, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఎల్‌ఐఎస్‌ అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో అందిస్తోంది.
పీజీ డిప్లొమా ఇన్‌: లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఆడియో ప్రోగ్రాం ప్రొడక్షన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్‌ జస్టిస్, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్, సస్టెయినబుల్‌ సైన్స్, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ కోర్సులు ఉన్నాయి.
డిప్లొమా ఇన్‌: ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, పంచాయత్‌ లెవెల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వాకల్చర్, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్, ఉర్దూ, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌- ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, పారా లీగల్‌ ప్రాక్టీస్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో నచ్చినవాటిలో చేరవచ్చు.
అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌ ఇన్‌: పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు కూడా అందిస్తోంది.
పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌: అడల్ట్‌ ఎడ్యుకేషన్, సైబర్‌ లా, పేటెంట్‌ ప్రాక్టీస్, బెంగాల్‌- హిందీ ట్రాన్స్‌లేషన్, మలయాళం- హిందీ ట్రాన్స్‌లేషన్, అగ్రికల్చర్‌ పాలసీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అసిస్టివ్‌ ్లటెక్నాలజీస్, జియో ఇన్ఫర్మాటిక్స్, క్లైమేట్‌ చేేంజ్, మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి.
సర్టిఫికెట్‌ ఇన్‌: పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్, థియేటర్‌ ఆర్ట్స్, హిందూస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్‌ మ్యూజిక్, భరతనాట్యం, అరబిక్‌్, ఫ్రెంచ్, రష్యన్‌ లాంగ్వేజెస్, కొరియన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్, జర్మన్‌ లాంగ్వేజ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, ఎన్జీవో మేనేజ్‌మెంట్, బిజినెస్‌ స్కిల్స్, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ సెకండ్‌ లాంగ్వేజ్, ఫంక్షనల్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సోషల్‌ వర్క్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, సోషల్‌ వర్క్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, న్యూ బోర్న్‌ అండ్‌ ఇన్ఫాంట్‌ నర్సింగ్, మాటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, హోం బేస్డ్‌ హెల్త్‌ కేర్, కమ్యూనిటీ రేడియో, టూరిజం స్టడీస్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్, రూరల్‌ డెవలప్‌మెంట్, సెరీ కల్చర్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, వాటర్‌ హార్వెస్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ ఫార్మింగ్, బీ కీపింగ్, హ్యూమన్‌ రైట్స్, కన్జూమర్‌ ప్రొటెక్షన్, కోపరేషన్, కోపరేటివ్‌ లా అండ్‌ బిజినెస్‌ లాస్, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గైడెన్స్, కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ స్కిల్స్, లేబొరేటరీ టెక్నిక్స్, వాల్యూ ఎడ్యుకేషన్, ఎనర్జీ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, కాంపిటెన్సీ ఇన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్, ఫస్ట్‌ ఎయిడ్, ట్రైబల్‌ స్టడీస్, ఫ్యాషన్‌ డిజైన్, జనరల్‌ డ్యూట్‌ అసిస్టెన్స్, జెరియాట్రిక్‌ కేర్‌ అసిస్టెన్స్, ఫ్లబోటమీ అసిస్టెన్స్, హోం హెల్త్‌ అసిస్టెన్స్, కమ్యూనిటీ హెల్త్, పర్షియన్‌ లాంగ్వేజ్, యోగ, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్‌.
అప్రిసియేషన్‌ కోర్స్‌ ఆన్‌: ఎన్విరాన్‌మెంట్, పాపులేషన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌; అవేర్‌నెస్‌ ప్రోగ్రాం ఆన్‌: వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్, డెయిరీ ఫార్మింగ్, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ కోర్సులూ ఉన్నాయి.

- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ

Back..

Posted on 23-12-2019