Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
లిబరల్‌ స్టడీస్‌లో పీజీ

* ఐఐఎంలో కొత్త కోర్సు

ఐఐఎం కోజికోడ్‌ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ - లిబరల్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ను 2020-2021 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మేనేజర్‌ హోదాల్లో ఉన్నవారికి వైవిధ్యమైన ఆలోచనలు చేసే అవకాశం కల్పించేందుకు మేనేజ్‌మెంట్‌ కోర్సులో లిబరల్‌ స్టడీస్‌ చేర్చారు. భావి మేనేజర్లలో ఎమోషనల్‌, కల్చరల్‌, క్రియేటివ్‌ ఇంటలిజెన్స్‌ ఉండే విధంగా చూడడానికి ఈ కోర్సును అందిస్తున్నారు. దీన్ని పూర్తి చేసినవారికి మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా, సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌... తదితర రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. కోర్సు ఫీజు రూ.15 లక్షలు. వ్యవధి రెండేళ్లు. ఇందులో ఏడాదికి 3 చొప్పున 6 టర్మ్‌లు ఉంటాయి. మొదటి సంవత్సరం లిబరల్‌ స్టడీస్‌, మేనేజ్‌మెంట్‌ సూత్రాలను బోధిస్తారు. రెండో ఏడాది స్పెషలైజేషన్‌ దిశగా బోధన కొనసాగుతుంది.

అర్హత: డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంది. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తుకు అర్హులే. దీంతోపాటు క్యాట్‌-2019 లేదా జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈ మూడు పరీక్షల్లో ఎందులోనైనా జనరల్‌ అభ్యర్థులైతే మొత్తంమీద 80, వెర్బల్‌ 80, ఇతర సెక్షన్లలో 50 పర్సంటైల్‌ సాధించడం తప్పనిసరి. ఓబీసీ నాన్‌-క్రిమి లేయర్‌, ఈడబ్ల్యూసీ అభ్యర్థులైతే వరుసగా 70, 70, 50 పర్సంటైల్‌ సాధించాలి. ఎస్సీలకు 60, 60, 50; ఎస్టీ, దివ్యాంగులకు 55, 55, 50 పర్సంటైల్‌ తప్పనిసరి. ఈ పరీక్షల్లో సాధించిన స్కోర్లు, పది, ఇంటర్‌ అకడమిక్‌ మార్కులు, పని అనుభవం..పరిగణనలోకి తీసుకుని వచ్చిన దరఖాస్తులను వడపోస్తారు. ఇందులో ఎంపికైనవారికి రైటింగ్‌ ఎబిలిటీ టెస్టు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జులైలో తరగతులు మొదలవుతాయి. ‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31

రాత పరీక్ష, ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌ లేదా మేలో ముంబయి, దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కోజికోడ్‌ల్లో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://iimk.ac.in/

Back..

Posted on 19-02-2020