Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఎంలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

ఐఐఎం రోహ్‌తక్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. విజయవంతంగా పూర్తిచేసిన వారికి బీబీఏ, ఎంబీఏ డిగ్రీలను ప్రదానం చేస్తారు.

గత ఏడాది నుంచి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబీఏలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇంటర్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ విద్య చదవాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ప్రయోజనకరం. ఏడాదికి మూడు చొప్పున అయిదేళ్ల కోర్సులో 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి 3 నెలలు. మొత్తం కోర్సుని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఫౌండేషన్‌ కోర్సులపై దృష్టిసారిస్తారు. రెండో భాగంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో మెలకువలు బోధిస్తారు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీనీ ప్రదానం చేస్తుంది. మూడేళ్ల తర్వాత చదువు మానేస్తే బీబీఏ డిగ్రీ ఇస్తారు. మొత్తం 150 సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు అయిదేళ్లకు రూ.30లక్షలకు పైగా ఉంటుంది.

ఆప్టిట్యూడ్‌ టెస్టు
క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్నీ 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
ఆప్టిట్యూడ్‌ టెస్టులో అర్హత సాధించినవారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ, రిటన్‌ ఎబిలిటీ టెస్టులను మే 3, 4 వారాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. ఫలితాలు జూన్‌ రెండో వారంలో వెలువడతాయి. జులైలో ప్రవేశాలను చేపట్టి, ఆగస్టులో తరగతులు ప్రారంభిస్తారు.

అర్హత: పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం తప్పనిసరి. వయసు జులై 31, 2020 నాటికి 20 ఏళ్లలోపు ఉండాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6

దరఖాస్తు ఫీజు: రూ.3,890

పరీక్ష తేదీ: మే 1

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/

Back..

Posted on 26-02-2020