Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఫైనాన్స్‌లో పీజీ ప్రోగ్రామ్‌

* ఐఐటీ - కోజికోడ్‌ కొత్త కోర్సు

ఐఐఎం కోజికోడ్‌ ఒక కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. 2020-2021 విద్యా సంవత్సరం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫైనాన్స్‌ను ప్రారంభించనుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో రాణించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ప్రవేశానికి ప్రకటన వెలువడింది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫైనాన్స్‌ కోర్సు వ్యవధి రెండేళ్లు. మొదటి ఏడాది మూడు, రెండో సంవత్సరం మూడు చొప్పున మొత్తం ఆరు టర్మ్‌లు ఉంటాయి. మొదటి ఏడాది ఫైనాన్స్‌కు సంబంధించి కోర్‌ అంశాల్లో తరగతులు ఉంటాయి. రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ కోర్సులు, ఎలక్టివ్‌లు బోధిస్తారు..

ఫైనాన్స్‌ థియరీ, అప్లికేషన్‌ ప్రాధాన్యంగా కోర్సు రూపొందించారు. ఫీజు రూ.20.50 లక్షలు. రుణ సౌకర్యం ఉంది. కార్పొరేట్‌ ఫైనాన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, ఫిన్‌టెక్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. కోర్సు పూర్తి చేసుకున్నవారికి ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌, ట్రేడింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రాడ్‌ డిటెక్షన్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌..తదితర విభాగాల్లో మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి.

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. పదో తరగతి, ఇంటర్‌లో 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం మార్కులు తప్పనిసరి. దీంతోపాటు క్యాట్‌/ జీఆర్‌ఈ/ జీమ్యాట్‌ వీటిలో ఏదో ఒక స్కోర్‌ ఉండాలి. ఈ పరీక్షలను జనవరి 2019 తర్వాత రాసి ఉండాలి. ఈ పరీక్షల్లో జనరల్‌ అభ్యర్థులు 80, ఓబీసీ (ఎన్‌సీ), ఈబీసీలు 70, ఎస్సీలు 60, ఎస్టీ, దివ్యాంగులు 55 సెక్షనల్‌ పర్సంటైల్‌ సాధించి ఉండాలి.

వచ్చిన దరఖాస్తులను అకడమిక్‌ ప్రతిభ, పని అనుభవం, స్కోర్ల ఆధారంగా వడపోస్తారు.ఈ దశలో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు 5 శాతం వెయిటేజీ లభిస్తుంది. అలా ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, రైటింగ్‌ ఎబిలిటీ టెస్టు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ముంబయి, దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కోజికోడ్‌ల్లో వీటిని నిర్వహిస్తారు. ప్రస్తుతం డిగ్రీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్ఛు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31

రిటన్‌ టెస్టు, ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://iimk.ac.in/

Back..

Posted on 12-02-2020