Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంజినీరింగ్‌లోనూ మద్రాసే మెరిసే!

* ఉన్నత విద్య, ప్లేస్‌మెంట్లలో సాటిలేని ఐఐటీ

దక్షిణ భారతంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. దీనిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో 2016 నుంచి 2020 వరకు వరుసగా ఐఐటీ మద్రాసే మేటి సంస్థగా నిలుస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఓవరాల్‌ కేటగిరీలోనూ సత్తాచాటిన ఈ సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలోనూ నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇలా రెండు కేటగిరీల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ఏకైక సంస్థ ఇదే!
ఇంజినీరింగ్‌ అనగానే గుర్తుకువచ్చేవి ఐఐటీలే. మన దేశంలో ఈ చదువులకు ఇవే ట్రేడ్‌ మార్కు సంస్థలు. వీటి తర్వాతి స్థానంలో పాత ఎన్‌ఐటీలకు ప్రాధాన్యం ఉంది. అయితే ఇంజినీరింగ్‌ విభాగంలో దేశంలో మేటి సంస్థల్లో మొదటి స్థానానికి పోటీ ఎప్పుడూ ఐఐటీల మధ్యే ఉంటోంది. ఈ పోటీల్లో మొదటి నుంచీ ఇప్పటిదాకా మద్రాసే మెరుస్తోంది. అయిదేళ్లుగా ఏ సంస్థకూ అవకాశం ఇవ్వకుండా తనను తాను మెరుగ్గా తీర్చిదిద్దుకుంటోందీ ఐఐటీ.

బోధన, అభ్యాసం, వనరులు; పరిశోధన, వృత్తి అభ్యాసం; సంస్థ నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభ, సంస్థలో చేరుతోన్న విద్యార్థుల్లో వైవిధ్యం, అకడమిక్, పరిశ్రమలకు చెందిన నిపుణుల దృక్పథం పరామితులుగా తీసుకుని వీటి విలువలను మదింపు చేసి మొత్తం స్కోరు ద్వారా మేటి సంస్థలను ఎంపిక చేశారు. ఇంజినీరింగ్‌ విషయానికొచ్చేసరికి విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో లభించిన ఉన్నత విద్య అవకాశాలు, ప్లేస్‌మెంట్లు, మధ్యగత జీతం, విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఫలితాలు, పీహెచ్‌డీలో చేరడానికి అర్హత పొందినవారు...తదితరాంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు.

టాప్‌ టెన్‌ సంస్థలు: ఐఐటీ- మద్రాస్, దిల్లీ, ముంబయి, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువాహటి, హైదరాబాద్, ఎన్‌ఐటీ-తిరుచురాపల్లి, ఐఐటీ- ఇండోర్‌.
తెలుగు రాష్ట్రాల్లో: ఐఐటీ హైదరాబాద్‌ 8, ఎన్‌ఐటీ వరంగల్‌ 19, ఐఐఐటీ హైదరాబాద్‌ 43, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ 57, కేఎల్‌యూ 58, ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ 69, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ 88, జేఎన్‌టీయూ కాకినాడ 97 స్థానాల్లో నిలిచాయి.

ఏయే కోర్సులున్నాయ్‌?
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ తాజా ర్యాంకుల నేపథ్యంలో మద్రాసులో ఉన్న వివిధ ఇంజినీరింగ్‌ కోర్సుల వివరాలు చూద్దాం...
* బీటెక్‌: ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎల్రక్టికల్, ఇంజినీరింగ్‌ ఫిజిక్స్, మెకానికల్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ బ్రాంచీల్లో నాలుగేళ్ల కోర్సులు ఉన్నాయి. ఏరోస్పేస్, బయలాజికల్, ఇంజినీరింగ్‌ డిజైన్‌ విభాగాల్లో అయిదేళ్ల బ్యాచిలర్, మాస్టర్‌ టెక్నాలజీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. బయలాజికల్‌ సైన్స్, ఫిజిక్స్‌ల్లో అయిదేళ్ల బ్యాచిలర్, మాస్టర్‌ సైన్స్‌ కోర్సులు ఇక్కడ చేయవచ్చు. ఈ సీట్లన్నీ ఐఐటీ-జేఈఈతో భర్తీ చేస్తారు.
* ఎంటెక్‌: ఈ సంస్థలో ఎంటెక్‌లో విస్తృత స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం గేట్‌లో చూపిన ప్రతిభతో లభిస్తుంది. ఏరోస్పేస్, కంప్యుటేషనల్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెకానిక్స్, బయో మెడికల్, కేటలైసిస్‌ టెక్నాలజీ, బిల్డింగ్‌ టెక్నాలజీ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్, జియో టెక్నికల్, హైడ్రాలిక్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్, స్ట్రక్చరల్, ట్రాన్స్‌పోర్టేషన్, కెమికల్, క్లినికల్, కంప్యూటర్‌ సైన్స్, కమ్యూనికేషన్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, పవర్‌ సిస్టమ్స్‌ అండ్‌ పవర్‌ ఎల్రక్టానిక్స్, మైక్రో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆర్‌ఎఫ్‌ అండ్‌ ఫొటోనిక్స్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ అండ్‌ సిస్టమ్స్, ఇండ[స్టియల్‌ మ్యాథమేటిక్స్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్, థర్మల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్, ఓషన్‌స్ట్రక్చర్, ఓషన్‌ టెక్నాలజీ, పెట్రోలియం, ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ విభాగాల్లో ఇక్కడ ఎంటెక్‌ కోర్సులు చదువుకోవచ్చు.

Back..

Posted on 23-06-2020