Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సముద్ర కోర్సుల్లోకి స్వాగతం

దేశ ఆర్థిక వ్యవస్థలో సముద్ర వాణిజ్యానికి విశిష్టస్థానం ఉంది. నౌకల ద్వారా జరిగే ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడానికి తగిన శాస్త్రీయ శిక్షణను మారిటైమ్‌ సంస్థలు అందిస్తాయి. సరుకుల రవాణాలో సాగర సంబంధంగా ఎదురయ్యే అనేక సమస్యలను సమర్థంగా పరిష్కరించడాన్ని నేర్పిస్తాయి. ఇందు కోసం ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హతలతో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సముద్రం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీటిలో చేరవచ్చు.

సముద్రమంటే... అపారమైన జీవరాశులకూ, వనరులకూ నిలయం. నౌకల ద్వారా జరిగే రవాణా వాణిజ్యపరంగా విలువైనది. ఈ నేపథ్యంలో మారిటైమ్‌ (సముద్ర సంబంధిత) కోర్సులు ఔత్సాహిక యువతకు చక్కని కెరియర్‌ను అందిస్తున్నాయి. రెండు మారిటైమ్‌ (సముద్ర సంబంధిత) సంస్థలు.. కేంద్ర విశ్వవిద్యాలయమైన ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ), ఒడిశా మారిటైమ్‌ అకాడమీ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు వెలువరించాయి. ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ
ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ అండర్‌గ్రాడ్యుయేట్‌, పీజీ, పీజీ డిప్లొమా, రిసెర్చ్‌ ప్రోగ్రాములను అందిస్తోంది.

అందుబాటులో ఉన్న కోర్సులు:
* బీటెక్‌ (మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌), బీఎస్‌సీ (నాటికల్‌ సైన్స్‌, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌) కోర్సులు.
అర్హత: ఇంటర్‌ ఎంపీసీ/ తత్సమాన విద్యను 60% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. పది, ఇంటర్‌ ఇంగ్లిష్‌లో 50% మార్కులుండాలి.
* డీఎన్‌ఎస్‌ (డిప్లొమా ఇన్‌ నాటికల్‌ సైన్స్‌)
అర్హత: ఇంటర్‌ ఎంపీసీ/ తత్సమాన విద్యను 60% మార్కులతో పూర్తిచేసినవారు/ బీఎస్‌సీ (ఎంపీసీ)/ బీఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌) 60% మార్కులతో/ బీఈ/ బీటెక్‌ 50% మార్కులతో పూర్తిచేసినవారు. 10, ఇంటర్‌/ డిగ్రీల్లో ఇంగ్లిష్‌లో 50% మార్కులు సాధించి ఉండాలి.
* ఎంబీఏ (పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌)
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీని 50% మార్కులతో పూర్త్తిచేసినవారు అర్హులు. పది, ఇంటర్‌, డిగ్రీల్లో ఇంగ్లిష్‌లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
* ఎంఎస్‌సీ (కమర్షియల్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌)
అర్హత: ఏదేని డిగ్రీలో 50% మార్కులతోపాటు పది, ఇంటర్‌, డిగ్రీల్లో ఇంగ్లిష్‌లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
* ఎంటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌)
అర్హత: మెకానికల్‌/ సివిల్‌/ మెరైన్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన విద్యను 60% మార్కులతో పూర్తిచేసినవారు.
* పీహెచ్‌డీ, ఎంఎస్‌ కోర్సులున్నాయి.
బీటెక్‌ కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్లు కాగా, బీఎస్‌సీ మూడేళ్లు, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌సీ రెండేళ్లు, డిప్లొమా కోర్సులకు ఏడాది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌ పరీక్ష. 200 ప్రశ్నలుంటాయి.
* యూజీ ప్రోగ్రామ్‌లకు ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ (ఇంటర్మీడియట్‌ సిలబస్‌) సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి.
* ఎంబీఏ, ఎంఎస్‌సీ ప్రోగ్రామ్‌లకు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఎంటెక్‌ వారికి ఇంగ్లిష్‌, మేథమేటిక్స్‌, ఎంచుకున్న కోర్సునుబట్టి మెకానిక్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ మెరైన్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పరీక్ష ఫీజు జనరల్‌/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వారికి రూ.1000, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి రూ.700.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆఖరితేదీ: 05.05.2019
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫాం సమర్పించడానికి చివరితేదీ: 08.05.2019
సీఈటీ పరీక్షతేదీ: 01.06.2019

ఒడిశా మారిటైమ్‌
ఒడిశా మారిటైమ్‌లో ఆరు నెలల శిక్షణ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది.
ప్రీ సీ జనరల్‌ పర్పస్‌ రేటింగ్‌ ట్రైనింగ్‌: కాలవ్యవధి ఆరు నెలలు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ పదో తరగతితోపాటు ఐటీఐ/ 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు.
వయసు జులై 1, 2019 నాటికి పదిహేడున్నర నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ వారికి వయఃపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తిచేయాలి. దరఖాస్తు ఫీజు రూ.500 డీడీతో సహా యూనివర్సిటీకి పంపాలి. దరఖాస్తుల నుంచి అర్హులను అకాడమీకి ఎంపిక నిమిత్తం పిలుస్తారు. మెడికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారిత ఎంపిక ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 15% రిజర్వేషన్‌ ఉంటుంది.
దరఖాస్తు చివరితేదీ: 24.04.2019


Back..

Posted on 19-04-2019