Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4110 ఉద్యోగాలు

- ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ చ‌దివిన‌వాళ్లకు అవ‌కాశం

దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో వివిధ విభాగాలు/ ట్రేడ్‌ల్లో సెమీ స్కిల్డ్ ఎంప్లాయీ, లేబ‌ర్ గ్రూప్ సి పోస్టుల భ‌ర్తీకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ చ‌దివిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ఫ్యాక్టరీల్లోనూ క‌లుపుకుని 4110 ఖాళీలు ఉన్నాయి. మెద‌క్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 133 పోస్టుల‌ను భ‌ర్తీచేస్తారు. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ఎంపిక విధానం, ముఖ్యమైన వివ‌రాలు తెలుసుకుందాం...

పోస్టు: సెమీ స్కిల్డ్ వ‌ర్క్‌మెన్ (ఇండ‌స్ట్రియ‌ల్ ఎంప్లాయీస్‌)
విద్యార్హత‌: ప‌దోత‌ర‌గ‌తి + నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేష‌న‌ల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) జారీచేసిన నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ (ఎన్‌టీసీ) / నేష‌న‌ల్ అప్రెంటీస్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎసీ)

పోస్టు: లేబ‌ర్ (గ్రూప్ సి)
విద్యార్హత‌: ప‌దోత‌ర‌గ‌తి

వ‌యోప‌రిమితి: పై రెండు పోస్టుల‌కు జూన్ 19, 2017 నాటికి 18 - 32 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

వేత‌న శ్రేణి: రూ.5200 - 20200 గ్రేడ్ పే రూ.1800 (కొత్త పే స్కేల్ అమ‌ల్లోకి వ‌చ్చిన తర్వాత ప్రారంభ వేత‌నం రూ.18,000 గా ఉంటుంది)

సెమీ స్కిల్డ్ వ‌ర్క్‌మెన్ (ఇండ‌స్ట్రియ‌ల్ ఎంప్లాయీస్‌) ఎంపిక ఇలా..
రెండు ద‌శ‌ల్లో అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ముందుగా వంద మార్కుల‌కు ఆబ్జెక్టివ్ విధానంలో రాత ప‌రీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఇందులో పార్ట్‌-ఎ కు 20 మార్కులు కేటాయించారు. జ‌న‌ర‌ల్ సైన్స్ నుంచి 10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప‌ది చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. ఈ ప్రశ్నలు ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పార్ట్ - బి కు 80 మార్కులు. ఈ విభాగం ప్రశ్నలు అభ్యర్థులు ఎంపిక‌చేసుకున్న ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సిల‌బ‌స్ నుంచి వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం ప‌రీక్ష వ్యవ‌ధి రెండు గంట‌లు.రాత ప‌రీక్షలో రుణాత్మక మార్కులు లేవు. ఇందులో ఎంపికైన‌వారికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్ టెస్టు ( ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష) నిర్వహిస్తారు. ఖాళీల‌కు ఒక‌టింబావు రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష నుంచి ట్రేడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ట్రేడ్ టెస్టు కేవ‌లం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో వ‌చ్చిన మార్కుల‌ను ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థుల స‌ర్టిఫికెట్లు ప‌రిశీలించి, వారు రాత ప‌రీక్షలో సాదించిన‌ మార్కుల మెరిట్ ప్రాతిప‌దిక‌న ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

లేబ‌ర్ (గ్రూప్ సి) నియామ‌కానికి..
వంద మార్కుల‌కు నిర్వహించే రాత ప‌రీక్ష ద్వారా లేబ‌ర్ (గ్రూప్ - సి) పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రశ్నప‌త్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 3 విభాగాల నుంచి వంద ప్రశ్నలు వ‌స్తాయి. న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ 40, జ‌న‌ర‌ల్ సైన్స్ 30, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల‌న్నీ ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఈ ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు ట్రేడ్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ప‌రిక‌రాల‌ను శుభ్రప‌ర‌చ‌డం, మెటీరియ‌ల్ ఒక చోట నుంచి ఇంకో చోట‌కు త‌ర‌లించ‌మ‌న‌డం లాంటి ప‌నులు చేయ‌మంటారు.

గ‌మ‌నిక‌:
- మెద‌క్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీల‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఉంటుంది.
- అభ్యర్థులు త‌మ‌కు న‌చ్చిన‌ ఏదో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆ ఫ్యాక్టరీలో వివిధ ట్రేడ్‌ల్లో ఉన్న ఖాళీల్లో త‌మ విద్యార్హత‌ల‌కు అనుగుణంగా ఏదో ఒక ట్రేడ్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే ఎగ్జామిన‌ర్ (ఇంజి) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారు ట్రేడ్‌ల ప్రిఫ‌రెన్స్ ఇచ్చుకోవచ్చు.
- నియామ‌కాలు ఆయా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల‌వారీగా ఉంటాయి. ఫ్యాక్టరీల‌వారీ తుది ఫ‌లితాల‌ను www.ofb.gov.inలో చూసుకోవ‌చ్చు.

వివ‌రాలు...
మొత్తం పోస్టులు: 4,110 (తెలంగాణ-133)
విభాగాలు: సెమీ స్కిల్డ్ గ్రేడ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఎంప్లాయిస్ గ్రూప్‌-సి, లేబ‌ర్ గ్రూప్‌-సి.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఖాళీల వివ‌రాలు:: బిహార్‌-62, చండీగ‌ఢ్‌-50, మ‌హారాష్ట్ర-976, మ‌ధ్యప్రదేశ్-824, ఒడిశా-465, త‌మిళ‌నాడు-306, తెలంగాణ‌-133, ఉత్తరాఖండ్‌-298, ఉత్తర‌ప్రదేశ్‌-871, వెస్ట్ బెంగాల్‌-125.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 29.05.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 19.06.2017.
ప‌రీక్ష తేదీ: త‌ర్వాత ప్రక‌టిస్తారు.
స‌మీపంలోని ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, భువ‌నేశ్వర్‌, చెన్నై

నోటిఫికేష‌న్‌

అప్లై ఆన్‌లైన్‌

Back..

Posted on 30-05-2017