Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పదోతరగతితో నావిక్‌ పోస్టులు

పదోతరగతి విద్యార్హతతో భారతీయ తీర రక్షణ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డు) నావిక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటికి రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ ఉంటుంది. అనంతరం కుక్‌, స్టివార్డ్‌ హోదాల్లో డొమెస్టిక్‌ బ్రాంచిలోకి తీసుకుంటారు. ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు.

అర్హత: పదోతరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 45%) పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: ఏప్రిల్‌ 1, 2019 నాటికి 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 1997 - మార్చి 31, 2001 మధ్య జన్మించినవాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
వేతనం: రూ. 21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. వీటన్నింటితో నెలకు రూ. 35,000 వరకు వేతనం రూపంలో లభిస్తుంది. భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి హోదా వరకు చేరుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా

పరీక్ష ఇలా..
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దేహదార్ఢ్య పరీక్షలు
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్‌ అప్స్‌ - 20, పుష్‌అప్స్‌ -10 తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతి కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి.
దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాతపరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. ఆయా జోన్లవారీ ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఫొటోను జతచేసిన మూడు అడ్మిట్‌ కార్డులు, పదో తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, మార్కుల పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌; డొమిసైల్‌ సర్టిఫికెట్‌, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌ (ఓటర్‌ ఐడీ లేదా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా కాలేజీ ఐడీ) తీసుకెళ్లాలి. వీటన్నింటికీ 3 సెట్ల ఫొటోకాపీలు తీసుకెళ్లాలి.

ఎంపికైతే
అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ ప్రారంభానికి ముందే మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌గా ఎంపికైనవారు కోస్ట్‌ గార్డు ఉద్యోగులకు మెనూ ప్రకారం శాకాహార, మాంసాహార వంటకాలు తయారుచేయాల్సి ఉంటుంది. స్టివార్డ్‌గా విధుల్లో చేరినవాళ్లు భోజన వడ్డన, హౌస్‌ కీపింగ్‌, స్టోర్స్‌ నిర్వహణ తదితర సహకార పనులు చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29
పరీక్ష: నవంబరు ఆఖరులో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్ష కేంద్రం: చెన్నై
వెబ్‌సైట్‌: http:/joinindiancoastguard.gov.in

Back..

Posted on 16-10-2018