Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నైపుణ్యాల పోటీ రోబోల నుంచి వడ్రంగం దాకా..

* కెరియర్‌ ట్రెండ్స్‌ 2020

* జిల్లా నుంచి.. ప్రపంచ స్థాయికి..

* 6 విభాగాలు.. 50కి పైగా అంశాలు

విద్యార్థులు తమ స్కిల్స్‌ను విశ్వవ్యాప్తంగా చాటే అవకాశం వచ్చింది. రెండేళ్లకొకసారి నిర్వహించే ప్రపంచ నైపుణ్య పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాతో మొదలు పెట్టి ప్రపంచస్థాయి వరకూ వీటిలో పాల్గొనవచ్ఛు మన దేశంలో ఇవి 2020లో మొదలవుతున్నాయి. ఉత్సాహవంతులు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

సృజనాత్మకతతో ముడిపడినది.. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు చూపించేది.. ఇతరులకు సహాయపడేది.. పరికరాలు ఉపయోగించి పనిని తేలిక చేసేది.. బృందానికి అవసరమైనది.. క్షేత్రస్థాయిలో చేయదగినది...ఇలా నైపుణ్యం ఏదైనా.. ప్రపంచ వేదికపై ప్రదర్శించవచ్ఛు బ్యూటీ.. బ్రిక్‌ లేయింగ్‌, వడ్రంగం.. కార్‌ పెయింటింగ్‌, కుకింగ్‌.. కాంక్రీట్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ.. ఫ్లోరిస్ట్రీ, హెయిర్‌ డ్రెస్సింగ్‌.. హెవీ వెహికల్‌ టెక్నాలజీ, జ్యూలరీ.. జాయినరీ, ల్యాండ్‌ స్కేప్‌ గార్డెనింగ్‌.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, పెయింటింగ్‌.. ప్లంబింగ్‌, రెఫ్రిజిరేషన్‌.. రెస్టారెంట్‌ సర్వీస్‌, వెల్డింగ్‌..వెబ్‌ టెక్నాలజీ...తదితర యాభైకిపైగా అంశాల్లో నైపుణ్యాన్ని పరీక్షించుకోవచ్ఛు అంశాలవారీ విధివిధానాలను, నిబంధనలను వెబ్‌లో పొందుపరిచారు.

పోటీ జిల్లాతో మొదలు
వచ్చిన దరఖాస్తులను బట్టి ముందు జిల్లా, తర్వాత జోన్‌, అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రాంతీయస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. నార్త్‌, సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌ ఈస్ట్‌ ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఇవి జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారత్‌ పరిధిలో ఉంటాయి. ప్రాంతాలవారీ విజేతలకు జాతీయస్థాయి పోటీ నిర్వహిస్తారు. ఇందులో నెగ్గినవారు ప్రపంచ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. వీరికి అవసరమైన శిక్షణను ఆ విభాగానికి చెందిన నిపుణులు, పరిశ్రమ వర్గాలవారు అందిస్తారు. దేశీయ పోటీలను ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిర్వహిస్తుంది.

1950 నుంచీ...
వరల్డ్‌ స్కిల్‌ ఇంటర్నేషనల్‌ (డబ్ల్యూఎస్‌ఐ)ను 1950లో నెలకొల్పారు. ఒకేషనల్‌ విద్య, శిక్షణను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడం దీని లక్ష్యం. నైపుణ్యాలను పంచుకొని, ఆయా అంశాల్లో మెరుగైన ప్రగతి సాధించడానికి డబ్ల్యూఎస్‌ఐ తోడ్పడుతుంది. భారత్‌ 2011 నుంచి ఇందులో పాల్గొంటోంది. యాభైకి పైగా ఉన్న అంశాలను ఆరుగా విభజించారు. అవి.. కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ బిల్డింగ్‌ టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఫ్యాషన్‌, సోషల్‌ అండ్‌ పర్సనల్‌ సర్వీసెస్‌.

ప్రతి రెండేళ్లకు ఒకసారి వీటిని నిర్వహిస్తున్నారు. 2020లో జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచినవారు 2021లో షాంఘైలో నిర్వహించే ప్రపంచ పోటీల్లో పాల్గొంటారు. విభాగాలవారీ విజేతలకు బంగారం, వెండి, కాంస్య పతకాలను అందిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవచ్ఛు ప్రపంచస్థాయి నిపుణుల వద్ద శిక్షణ పొందవచ్ఛు సంబంధిత స్కిల్‌లో నాయకులుగా ఎదగవచ్ఛు

ఎవరు అర్హులు?
ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఐఐటీ, నిట్‌, ఐహెచ్‌ఎం, నిఫ్ట్‌, నిడ్‌, సిపెట్‌, కార్పొరేట్‌ టెక్నికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు..ఇలా వేటిలో చదువుతున్న విద్యార్థులైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్ఛు మొబైల్‌ రోబోటిక్స్‌, ల్యాండ్‌ స్కేప్‌ గార్డెనింగ్‌, కాంక్రీట్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌, మెకట్రానిక్స్‌ అంశాల్లో పోటీలకు ఇద్దరు కలిసి బృందంగా ఏర్పడి పాల్గొనాల్సి ఉంటుంది. విద్యార్థులు జనవరి 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. కొన్ని ప్రత్యేక విభాగాల్లో పాల్గొనడానికి జనవరి 1, 1996 తర్వాత జన్మించినవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు

తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మొత్తం 26 ట్రేడుల్లో పోటీలో పాల్గొనవచ్ఛు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబరు 31. జిల్లా స్థాయి పోటీలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు, జోనల్‌ పోటీలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 3 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొన్నవారికి, ఈ మూడు దశల్లో విజేతలుగా నిలిచినవారికి ఆయా రాష్ట్రాల డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాయి.

వెబ్‌సైట్‌: https://worldskillsindia.co.in

Back..

Posted on 25-12-2019