Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేవీలో పైల‌ట్‌, ట్రాఫిక్ కంట్రోల‌ర్ ఉద్యోగాలు

- ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అవ‌కాశం

భార‌తీయ నావికాద‌ళం షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) విధానంలో పైల‌ట్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ (ఏటీసీ) ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. అవివాహిత పురుషుల‌తోపాటు మ‌హిళ‌లు కూడా ఈ పోస్టుల‌కు అర్హులే. వీటికి ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. స‌ర్వీస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అర్హత సాధించిన‌వారికి జ‌న‌వ‌రి, 2018 నుంచి కోర్సులు ప్రారంభ‌మ‌వుతాయి.

అర్హత‌:
క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఇంజినీరింగ్ పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం ఆఖ‌రు సంవ‌త్సరం ఇంజినీరింగ్ కోర్సు చ‌దువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. ఏటీసీ ఉద్యోగాల‌కు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో 60 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. అలాగే ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉండాలి.

వ‌యోప‌రిమితి:
ఏటీసీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవాళ్లు జ‌న‌వ‌రి 2, 1993 - జ‌న‌వ‌రి 1, 1997 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. పైల‌ట్ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 2, 1994 - జ‌న‌వ‌రి 1, 1999 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.

పైల‌ట్ పోస్టుల‌కు 167 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఏటీసీ పోస్టుల‌కు పురుషులైతే 157 సెం.మీ. మ‌హిళ‌లు 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక‌:
అభ్యర్థుల ద‌ర‌ఖాస్తుల‌ను అక‌డ‌మిక్ ప్రతిభ ఆధారంగా వ‌డ‌పోస్తారు. అర్హత సాధించిన‌వారికి ఎస్ఎస్‌బీ కాల్ లెట‌ర్లు పంపుతుంది. జూన్‌-ఆగ‌స్టు మ‌ధ్యలో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. పైల‌ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి బెంగ‌ళూరులోనూ, ఏటీసీ అభ్యర్థుల‌కు బెంగ‌ళూరు, భోపాల్‌, కోయంబ‌త్తూర్‌, విశాఖ‌ప‌ట్నంల్లో ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. ఈ ఇంట‌ర్వ్యూలు మొత్తం 5 అయిదు రోజుల‌పాటు రెండు ద‌శ‌ల్లో నిర్వహిస్తారు. స్టేజ్‌-1 ఇంట‌ర్వ్యూ ఒక రోజు ఉంటుంది. స్టేజ్-2 ను 4 రోజుల‌పాటు నిర్వహిస్తారు. స్టేజ్‌-1లో అర్హత సాధించిన‌వారికే స్టేజ్‌-2 ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. స్టేజ్-1లో ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ ప‌ర్సెప్షన్, గ్రూప్ డిస్కష‌న్ ప‌రీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్-2లో సైక‌లాజిక‌ల్‌, గ్రూప్ టెస్టులు, ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. వీట‌న్నింటిలో మెరుగ్గా ఉన్నవారికి వైద్యారోగ్య ప‌రీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక‌చేస్తారు. పైల‌ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి అద‌నంగా పైల‌ట్ ఆప్టిట్యూడ్ బ్యాట‌రీ టెస్టు (పీఏబీటీ) నిర్వహిస్తారు.

ఎంపికైతే:
ఉద్యోగానికి అర్హత సాధించిన‌వారికి జ‌న‌వ‌రి, 2018 నుంచి శిక్షణ మొద‌లువుతుంది. అభ్యర్థుల‌కు స‌బ్ లెఫ్టినెంట్ హోదా కేటాయిస్తారు. ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ (ఐఎన్ఏ)- ఎజిమాళ‌(కేర‌ళ‌)లో 22 వారాల‌పాటు నేవ‌ల్ ఓరియంటేష‌న్ కోర్సు శిక్షణ నిర్వహిస్తారు. అనంత‌రం సంబంధిత విభాగంలో ప‌లు చోట్ల ఈ శిక్షణ కొన‌సాగుతుంది. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. పైల‌ట్‌, ఏటీసీ పోస్టుల‌కు ఎంపికైన‌వాళ్లు 14 ఏళ్లపాటు విధుల్లో కొన‌సాగుతారు. ఉద్యోగంలోకి చేరిన‌వాళ్లు ప‌రీక్షల ద్వారా త‌మ స‌ర్వీసు కాలంలో స‌బ్ లెప్టినెంట్ నుంచి కమాండ‌ర్ హోదా వ‌ర‌కు చేరుకోవ‌చ్చు. కెరీర్ ప్రారంభంలో స‌బ్ లెఫ్టినెంట్‌లు రూ.72,444 నుంచి 81,700 వ‌ర‌కు నెల‌స‌రి వేత‌నంగా పొంద‌వ‌చ్చు. వేత‌నంతోపాటు ప‌లు ప్రోత్సాహ‌కాలు అందుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 31
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

Back..

Posted on 14-03-2017

Notification