Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భార‌త్‌లో బీటెక్, విదేశాల్లో ఎంటెక్‌

జేఎన్‌టీయూ-హెచ్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంటిగ్రేటెడ్ డ‌బుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌

ఇంట‌ర్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూ హైద‌రాబాద్ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌+ఎంటెక్ కోర్సుల‌ను విదేశీ విశ్వవిద్యాల‌యాల‌తో క‌లిసి అందిస్తోంది. ఇందుకోసం బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(బీఐటీ), స్వీడ‌న్‌; ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఏఐటీ), బ్యాంకాక్‌ల‌తో జేఎన్‌టీయూ-హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సులో చేరిన విద్యార్థుల‌కు డిగ్రీల‌ను రెండు యూనివ‌ర్సిటీలూ విడిగా ప్రదానం చేస్తాయి. విదేశీ విద్యపై ఆస‌క్తి ఉన్నవాళ్లు, ఫారిన్ డిగ్రీ పొందాల‌నుకునే విద్యార్థులు ఈ కోర్సుల్లో చేర‌వ‌డం ద్వారా ఆశ‌యాల‌ను నెర‌వేర్చుకోవ‌చ్చు. ప‌రీక్షలేవీ రాయ‌కుండానే కోర్సుల్లో ప్రవేశం పొంద‌వ‌చ్చు.

స్వీడ‌న్‌లోని ప్రముఖ యూనివ‌ర్సిటీల్లో బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (బీఐటీ) ఒక‌టి. అలాగే మ‌లేషియాలో ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఏఐటీ), బ్యాంకాక్ పేరొందిన విశ్వవిద్యాల‌యం. ఈ రెండు యూనివ‌ర్సిటీలు జేఎన్‌టీయూ-హైద‌రాబాద్‌తో క‌లిసి డ‌బుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల‌ను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన‌వారికి జేఎన్‌టీయూ ఎంటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. బ్లెకింగ్/ ఏషియ‌న్ యూనివ‌ర్సిటీలు ఎమ్మెస్సీ డిగ్రీని అందిస్తాయి. అయిదేళ్ల కోర్సులో మూడున్నరేళ్లు జేఎన్‌టీయూ-హైద‌రాబాద్‌లోనూ, ఏడాదిన్నర‌పాటు స్వీడ‌న్‌/ బ్యాంకాక్ లో చ‌ద‌వాల్సి ఉంటుంది. విదేశీ విద్య నిమిత్తం జీఆర్ఈ/ టోఫెల్ లాంటి ప‌రీక్షలేమీ రాయాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే అక్కడ చ‌దువుతూనే పార్ట్ టైం ఉద్యోగాల‌ను అధికారికంగా చేసుకోవ‌చ్చు. ఈ కోర్సుల‌కు ఇంటిగ్రేటెడ్ డ‌బుల్ డిగ్రీ మాస్టర్ ప్రోగ్రామ్స్‌(ఐడీడీఎంపీ)గా పేరుపెట్టారు. కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూ-హెచ్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆ వివ‌రాలు చూద్దాం...

బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(బీఐటీ), స్వీడ‌న్‌
కోర్సులు: బీటెక్+ ఎంటెక్
బ్రాంచీలు: సీఎస్ఈ/ ఈసీఈ/ మెకానిక‌ల్‌
సీట్లు: ఈసీఈలో 20, సీఎస్ఈలో 15, మెకానిక‌ల్ 15 సీట్లు ఉన్నాయి.
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు జేఈఈ మెయిన్స్ స్కోర్ లేదా టీఎస్ ఎంసెట్ లో ర్యాంకు త‌ప్పనిస‌రి.
కోర్సు ఫీజు: ప్రతి సెమిస్టర్‌కు సుమారు రూ.75 వేలు చొప్పున తొలి 7 సెమిస్టర్ల వ‌ర‌కు జేఎన్‌టీయూకు చెల్లించాలి. చివ‌రి మూడు సెమిస్టర్లలో ఒక్కో సెమిస్టర్‌కు 35 వేల సెక్‌లు( రూపాయ‌ల్లో చెప్పుకుంటే సుమారు రూ.2,71,000) బీఐటీకి చెల్లించాలి. అయితే మంచి అక‌డ‌మిక్ ప్రతిభ చూపిన విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్ రూపంలో 75 శాతం నుంచి 50 శాతం వ‌ర‌కు ట్యూష‌న్ పీజును బీఐటీ విద్యార్థుల‌కు అందిస్తుంది. కోర్సు చివ‌ర్లో మూడు సెమిస్టర్లు బీఐటీలో చ‌ద‌వాలి. ఈ 18 నెల‌ల‌కు సుమారు రూ.11.5 లక్షల‌కు పైగా ఖ‌ర్చవుతుంది. దీన్ని విద్యార్థులే భ‌రించాలి. ఈ మొత్తానికి సంబంధించి ఆర్థిక హామీని చూపాలి. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొంద‌డానికి అవ‌కాశాలున్నాయి. కోర్సులో చేరిన త‌ర్వాత మ‌ధ్యలో వైదొల‌గ‌డం కుద‌ర‌దు. ఫీజు తిరిగి చెల్లించరు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 2, 2016
రూ. వెయ్యి అప‌రాధ రుసుముతో: ఆగ‌స్టు 4, 2016
కౌన్సెలింగ్ తేదీ: ఆగ‌స్టు 6 (ఉద‌యం 10 గంట‌ల‌కు)

ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఏఐటీ), బ్యాంకాక్
బీఐటీ మాదిరిగానే ఏఐటీతో క‌లిసి జేఎన్‌టీయూ హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంటిగ్రేటెడ్ డ‌బుల్ డిగ్రీ మాస్ట‌ర్ ప్రోగ్రాం(ఐఐడీడీఎంపీ) అందిస్తోంది. కోర్సుల్లో చేరిన‌వారు మూడున్నరేళ్లు జేఎన్‌టీయూలోనూ ఏడాదిన్నర బ్యాంకాక్‌లోనూ చ‌ద‌వాల్సి ఉంటుంది.

కోర్సు: బీటెక్‌+ఎంటెక్‌
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు జేఈఈ మెయిన్స్ స్కోర్ లేదా టీఎస్ ఎంసెట్ లో ర్యాంకు త‌ప్పనిస‌రి.
బ్రాంచీలు: సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఈసీఈ, ఈఈఈ, మెకానిక‌ల్ ఇంజినీరింగ్
సీట్లు: ఈఈఈలో 10, మిగిలిన బ్రాంచీల్లో ఒక్కోదాంట్లో 20 చొప్పున ఉన్నాయి.
ఫీజు: ఒక్కో సెమిస్టరుకు రూ.75 వేలు చొప్పున మొద‌టి ఏడు సెమిస్టర్లకు ఫీజు జేఎన్‌టీయూకు చెల్లించాలి. అలాగే మొద‌టి సెమిస్టర్‌లోనే ఏఐటీకి సుమారు రూ.60 వేలు చెల్లించాలి. దీంతోపాటు 8,9,10 సెమిస్టర్లలో ఒక్కో సెమిస్టర్‌కు సుమారు రూ.2 లక్షల 70 వేలు చొప్పున‌ ఏఐటీకి చెల్లించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ: ఆగ‌స్టు 5
రూ.వెయ్యి అప‌రాధ రుసుముతో: ఆగ‌స్టు 8
కౌన్సెలింగ్ తేదీ: ఆగ‌స్టు 12

గ‌మ‌నిక‌: ఈ కోర్సుల్లో చేర‌గోరే విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌కు జేఎన్‌టీయూ, హైద‌రాబాద్ (కూక‌ట్‌ప‌ల్లి) క్యాంప‌స్‌లో యూజీసీ అక‌డ‌మిక్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియం వ‌ద్ద జులై 29న సాయంత్రం 4 గంట‌ల‌కు అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

Back..

Posted on 27-07-2016