Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తాజా కెరియర్‌... ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌

ఆర్థిక రంగంలో ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అంశం - ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌. ఇది ఇప్పటికే 75 కు పైగా దేశాల్లో విస్తరించింది. ప్రస్తుతం ఈ రంగంలో నిపుణులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మన దేశంలో బీఎసీఈకి చెందిన బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్‌, తఖ్వా అడ్వైజరీ అండ్‌ షరియత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ‘ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌’లో సర్టిఫికెట్‌ కోర్సును సంయుక్తంగా అందిస్తున్నాయి. గతంలోనూ ఈ సంస్థలు ఇస్లామిక్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన వర్క్‌ షాపులు నిర్వహించాయి.

ఏం నేర్పిస్తారు..?
* ఇస్లామిక్‌ ఫైనాన్స్‌: ప్రస్తుత పరిస్థితి, ప్రాముఖ్యం
* ఇస్లామిక్‌ ఫైనాన్స్‌లో ప్రాథమిక అంశాలు
* ఇస్లామిక్‌ ఇన్సూరెన్స్‌
* క్యాపిటల్‌ మార్కెట్‌లో ఇస్లామిక్‌ ఫైనాన్స్‌ ఉపయోగం
* ఇస్లామిక్‌ బాండ్స్‌ ద్వారా క్యాపిటల్‌ మొబిలైజేషన్‌
* ఇస్లామిక్‌ ఫైనాన్స్‌ నేపథ్యంలో సూక్ష్మరుణాలు
* బ్యాంకింగ్‌, ఇస్లామిక్‌ ఫైనాన్స్‌
* భారత్‌లో ఇస్లామిక్‌ ఫైనాన్స్‌: కేస్‌ స్టడీ
* ఫైనాన్స్‌ నిపుణులు, ఫండ్‌ మేనేజర్లు, మర్చంట్‌ బ్యాంకర్లు, కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఫైనాన్స్‌ మార్కెటింగ్‌ ప్రొఫెషనల్స్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, స్టాక్‌ బ్రోకర్లు, విద్యార్థులు - ఇస్లామిక్‌ ఫైనాన్స్‌ గురించి అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు.
* విత్త రంగం, బ్యాంకింగ్‌, బీమా, పెట్టుబడులు, క్యాపిటల్‌ మార్కెట్‌ మొదలైన వాటిపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు.
* కామర్స్‌, ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడే కోర్సు ఇది.
* ఇది ఆన్‌లైన్‌ కోర్సు. ఆసక్తి ఉన్నవారు బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ కేటాయించిన లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* బీఎస్‌ఈ అనుమతించిన పరీక్షా కేంద్రంలో ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్‌ ఇస్తారు.

* మరిన్ని వివరాలకు training@bseindia.com కు మెయిల్‌ చేయొచ్చు.

* వెబ్‌సైట్‌: http://www.bsebti.com/

Back..

Posted on 25-10-2016