Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జెస్ట్‌- 2019

* ఫిజిక్స్‌లో పైచదువులకు..

నింగిలోకి దూసుకుపోయే రాకెట్లు... కనువిందుచేసే లేజర్‌ మెరుపులు...నేల నుంచి నింగిని చూపే టెలిస్కోప్‌లు...ఒకటేమిటి- ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రతి పరికరానికీ మూలాలు భౌతికశాస్త్ర సిద్ధాంతాలే. ఎన్నో రంగాలతో ఈ సబ్జెక్టుకు సంబంధం ఉంది. దేశంలో పేరొందిన ప్రయోగశాలలూ, విద్యాసంస్థలూ ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) నిర్వహిస్తున్నాయి.ఈ పరీక్షలో ప్రతిభ చూపినవారికి పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నెలనెలా స్టైపెండ్‌ వస్తుంది. భౌతికశాస్త్రంలో సత్తా చాటాలనుకున్న గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం!
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) పరిధిలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలున్నాయి. విద్యార్థులను పరిశోధన దిశగా ప్రోత్సహించడానికి వీటిని నెలకొల్పారు. ఈ సంస్థలన్నీ జెస్ట్‌ స్కోరుతో ఫిజిక్స్‌ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.12,000 చొప్పున రెండేళ్లు స్టైపెండ్‌ అందుతుంది. అనంతరం పీహెచ్‌డీ విద్యార్థులకు చెల్లించినట్లుగానే సీఎస్‌ఐఆర్‌ నెట్‌ మాదిరిగానే నెలకు రూ.25,000 చెల్లిస్తారు. మూడోఏట నుంచి ఎస్‌ఆర్‌ఎఫ్‌లో భాగంగా రూ.28,000 చొప్పున ఇస్తారు.

ఇవీ అర్హతలు
ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్‌ చదివివుండాలి. లేదా ఫిజిక్స్‌ సంబంధిత విభాగాల్లో ఏదైనా పీజీ, ఎంటెక్‌ చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు బీఈ/ బీటెక్‌ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ ఎంటెక్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ ఫిజిక్స్‌. కొన్ని సంస్థల్లో డిగ్రీలో మ్యాథ్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివినవారికీ అవకాశం కల్పిస్తున్నారు.
థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ లేదా ఎంసీఏ చదివివుండాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఏదో ఒక కోర్సులో ప్రవేశానికే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15
దరఖాస్తు ఫీజు రూ.300 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 17, 2019 వెబ్‌సైట్‌: https://www.jest.org.in/

ప్రశ్నపత్రం ఇలా...
ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ఇందులో మూడు విభాగాలుంటాయి. ఒక విభాగంలో 15 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు. రెండో విభాగంలో 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. నెగెటివ్‌ మార్కులు లేవు. ఇంకో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. సరికాని జవాబు గుర్తిస్తే మార్కులో మూడోవంతు చొప్పున తగ్గిస్తారు.
జెస్ట్‌ ప్రశ్నపత్రం డిగ్రీ ఫిజిక్స్‌ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి డిగ్రీ పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ఇంటర్‌ ఫిజిక్స్‌ పుస్తకాల నుంచి ప్రాథమికాంశాలపై పట్టు సాధించవచ్చు. ఐఐటీలు నిర్వహించే జామ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ మంచిదే. ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు నెట్‌ ఫిజిక్స్‌ పాత ప్రశ్నపత్రాలను చదువుకోవడం మంచిది.
మాదిరి ప్రశ్నలను జెస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష స్థాయి, ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది.

ఇవీ సంస్థలు
* ఆర్యభట్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, నైనిటాల్‌
* బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
* హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబయి
* హరీష్‌ చంద్ర రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌
* ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌ (ఐసీటీఆర్‌-టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరు
* ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్, కల్పక్కం
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐఐఎ), బెంగళూరు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)- భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), తిరువనంతపురం
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌), చెన్నై
* ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ (ఐఓపీ), భువనేశ్వర్‌
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రిసెర్చ్‌ (ఐపీఆర్‌), గాంధీనగర్‌
* ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐయూసీఏఏ), పుణె
* జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌), బెంగళూరు
* నేషనల్‌ బ్రెయిన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎన్‌బీఆర్‌సీ), బెంగళూరు
* నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఎ-టీఐఎఫ్‌ఆర్‌) పుణె
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌
* ఫిజికల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌), అహ్మదాబాద్‌
* రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్సీఏటీ), ఇండోర్‌
* రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ), బెంగళూరు
* సహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ (ఎస్‌ఐఎన్‌పీ), కోల్‌కతా
* సత్యేంద్రనాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌), కోల్‌కతా
* సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌ (సీఐఎస్‌-టీఐఎఫ్‌ఆర్‌), హైదరాబాద్‌
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), ముంబయి
* కన్సార్టియమ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (యూజీసీ డీఏఈ- సీఎస్‌ఆర్‌), ఇండోర్‌
* వేరిబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌ (వీఈసీసీ), కోల్‌కతా

Back..

Posted on 26-11-2018