Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెర ఏదైనా తరగని క్రేజ్‌!

* యువతను ఆకర్షిస్తున్న సినిమా, టీవీ కెరియర్లు

* జేఈటీ - 2020 ప్రవేశ ప్రకటన విడుదల

రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌, హోదా తెచ్చి పెట్టే సినిమా, టీవీలంటే యువతకెంతో క్రేజ్‌. వీటిలో పనిచేయాలని ఉవ్విళ్లూరేవారూ, ‘ఒక్క చాన్స్‌’ కోసం ఎదురుచూసేవారూ ఎక్కువే. ఆసక్తితోపాటు తగిన నైపుణ్యాలూ ఉంటేనే కదా..అవకాశాలు దక్కేది! ఔత్సాహికులకు పరిజ్ఞానం, నైపుణ్యాల శిక్షణనందించటానికి ఎన్నో సంస్థలున్నాయి. సుప్రసిద్ధ ఎఫ్‌టీఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ సంస్థలు ఓ ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి. దీని ప్రకటన విడుదలైంది!

వినోదం అనగానే ఎక్కువమంది చూసేది వెండితెర, బుల్లితెరల వైపే. తెర ముందే కాదు, వెనక ఉన్నవారికీ గుర్తింపు ఉంటుంది. సినిమా, షార్ట్‌ ఫిలిం, సీరియల్‌.. పేరు ఏదైనా పూర్తవడానికి సృజనాత్మక, ఆర్టిస్టిక్‌, సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారందరి సహకారం అవసరమవుతుంది. అందుకే చాలా సంస్థలు వీటికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. ఒక్కో విభాగానికి సంబంధించి స్పెషలైజ్‌డ్‌ కోర్సులను అందిస్తున్నాయి. యాక్టింగ్‌, డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే రైటింగ్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌, సినిమాటోగ్రఫీ మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి.

ఆసక్తి ఉన్నవారు కోర్సుల్లో చేరి నైపుణ్యాలను అందుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. ఫిలిం, టెలివిజన్‌ రంగానికి సంబంధించి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న సత్యజిత్‌ రే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ), కోల్‌కతా; ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ), పుణె సంయుక్తంగా ప్రవేశ ప్రకటనను విడుదల చేశాయి.ప్రవేశం పొందాలనుకునేవారు జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జేఈటీ)-2020ని రాయాల్సి ఉంటుంది.

ఈ కోర్సులున్నాయ్‌!
సత్యజిత్‌ రే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌
రెండు రకాల కోర్సులున్నాయి. ఒకటి సినిమాకు సంబంధించినవి కాగా, రెండోవి ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియాకు చెందినవి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సినిమా
కోర్సుల వ్యవధి మూడేళ్లు. డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌, యానిమేషన్‌ సినిమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశం పొందాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తి చేసినవారు అర్హులు. సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ కోర్సు ఎంచుకున్నవారు ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. యానిమేషన్‌ సినిమాను ఎంచుకున్నవారికి డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా
రెండేళ్ల వ్యవధి గల కోర్సులు. రైటింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, సినిమాటోగ్రఫీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా, డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా, ఎడిటింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా, సౌండ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తి చేసినవారు చేరటానికి అర్హులు. సౌండ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా కోర్సు ఎంచుకున్నవారు ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

ఎంపిక ప్రక్రియ
మూడు దశల్లో ఎంపిక చేస్తారు. రాతపరీక్ష (జేఈటీ), ఓరియంటేషన్‌, ఇంటర్వ్యూలు ఉంటాయి. మూడింటిల్లో విద్యార్థి ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తరువాతి దశలకు ఎంపిక చేస్తారు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్‌ ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి మెడికల్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది. ఇదివరకే డిగ్రీ పూర్తిచేసినవారు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్‌-ఎలో.. ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌, యానిమేషన్‌ సినిమా, ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, స్క్రీనింగ్‌ యాక్టింగ్‌, స్క్రీన్‌ రైటింగ్‌ ఉన్నాయి.
గ్రూప్‌- బిలో.. డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌
గ్రూప్‌-సిలో.. డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూసింగ్‌/ డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ/ ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌/ వీడియో ఎడిటింగ్‌, సౌండ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా/ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, రైటింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఉన్నాయి.
ఒక్కో గ్రూపు నుంచి ఒకేసారి ఒక్కో కోర్సును ఎంచుకోవచ్చు.

పరీక్ష విధానం
మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. కాలవ్యవధి- 3 గంటలు. విభాగాన్ని బట్టి పరీక్షల్లో మార్పులుంటాయి. సినిమా విభాగాల వారికి సెక్షన్‌-ఎ ఒకేలా ఉంటుంది. సెక్షన్‌-బిలో మార్పులుంటాయి. టీవీ విభాగం మొత్తానికి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఫిలిం విభాగాల కోర్సులకు (డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే రైటింగ్‌ వారికి మినహా) రెండు సెక్షన్లు- ఎ (30 మార్కులు), బి (70 మార్కులు) ఉంటాయి. సెక్షన్‌-ఎలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, సెక్షన్‌-బి డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్‌-ఎ: ఇది అన్ని స్పెషలైజేషన్ల వారికీ కామన్‌గా ఉంటుంది. రెండు విభాగాల నుంచి 30 ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. మొదటి విభాగం జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. జనరల్‌ అవేర్‌నెస్‌ (జాతీయం, అంతర్జాతీయం), భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్ట్‌, ఆర్కిటెక్చర్‌, మ్యూజిక్‌, ఫోక్‌ ఆర్ట్‌ మొదలైన వాటి నుంచి ప్రశ్నలుంటాయి. రెండో విభాగంలో సినిమా సంబంధిత ప్రశ్నలుంటాయి.
సెక్షన్‌-బి: మొత్తం 5 ప్రశ్నలుంటాయి. ఎంచుకున్న విభాగంలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌, ఎబిలిటీని పరీక్షించడం దీని ఉద్దేశం. దీనిలో లాంగ్‌ డిస్క్రిప్టివ్‌, డిస్క్రిప్టివ్‌, షార్ట్‌ నోట్‌ ప్రశ్నలుంటాయి.

డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌ (ఫిలిం) వారికి
సెక్షన్‌-బి: మొత్తం 4 ప్రశ్నలుంటాయి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌. స్క్రీన్‌ప్లే రైటింగ్‌ అంశాలపై ఒకటి (30 మార్కులు), స్టోరీ రైటింగ్‌ ఎబిలిటీపై రెండు ప్రశ్నలుంటాయి. ఒకదానికి సమాధానం (20మార్కులు) రాయాలి. క్రియేటివ్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ డైరెక్షన్‌పై 4 ప్రశ్నలడుగుతారు. రెండింటికి సమాధానం (ఒక్కోదానికి 10 మార్కులు) రాయాలి.

ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా
ఫిలిం విభాగం
అన్నీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లు. డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ కోర్సును ఎంచుకున్నవారు ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. దీనికి అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ లేదా సంబంధిత ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తి చేసినవారు అర్హులు.స్క్రీన్‌ యాక్టింగ్‌, స్క్రీన్‌ రైటింగ్‌ కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.

టీవీ విభాగం
డైరెక్షన్‌, ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. అన్నీ పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. సౌండ్‌ రికార్డింగ్‌, టీవీ ఇంజినీరింగ్‌ కోర్సులకు మాత్రం ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివివుండాలి.

టీవీ/ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా కోర్సుల పరీక్ష విధానం
మూడు సెక్షన్లు ఉంటాయి. 30 మార్కులకు ఎంసీక్యూ, 20 మార్కులకు మీడియా స్పెసిఫిక్‌ డిస్క్రిప్టివ్, 50 మార్కులకు ఏరియా సంబంధిత డిస్క్రిప్టివ్‌ (ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై) ఉంటాయి.
సెక్షన్‌-ఎ: రెండు విభాగాల నుంచి 30 ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. మొదటి విభాగం జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. జనరల్‌ అవేర్‌నెస్‌ (జాతీయం, అంతర్జాతీయం), భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్ట్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, ఫోక్‌ ఆర్ట్‌ మొదలైన వాటి నుంచి ప్రశ్నలుంటాయి. రెండో విభాగంలో టీవీ, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ మీడియా సంబంధిత ప్రశ్నలుంటాయి.
సెక్షన్‌-బి: ఆడియో- విజువల్‌ మీడియంపై విద్యార్థి అవగాహనను పరీక్షిస్తారు. ఒక లాంగ్‌ డిస్క్రిప్టివ్‌ ప్రశ్నను దీనిపై అడుగుతారు. మార్కులు 20.
సెక్షన్‌-సి: దీనిలో విద్యార్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. మొత్తం 5 ప్రశ్నలుంటాయి. షార్ట్‌ డిస్క్రిప్టివ్‌/ ఆబ్జెక్టివ్‌/ పిక్టోరియల్‌ ప్రశ్నలుంటాయి.

ఎఫ్‌టీఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐల ప్రవేశపరీక్ష ముఖ్యతేదీలు
* దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జనవరి 24, 2020
* అడ్మిట్‌ కార్డుల లభ్యత: 2020 ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 14 వరకు
* ప్రవేశపరీక్ష తేదీలు: 2020 ఫిబ్రవరి 15, 16
* ఫలితాల వెల్లడి: మే మూడో వారం
* పరీక్ష కేంద్రాల వెల్లడి: ఫిబ్రవరి 5, 2020 (దేశవ్యాప్తంగా మొత్తం 27 పట్టణాల్లో నిర్వహిస్తారు. పరీక్ష కేంద్ర వివరాలను సంస్థల వెబ్‌సైట్లలో ఉంచుతారు. పరీక్ష కేంద్రాన్ని సంస్థే నిర్ణయిస్తుంది. అభ్యర్థికి మార్చుకునే వీలుండదు)

దరఖాస్తు ఎలా?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://applyadmission.net/jet2020/, https://ftii.ac.in/, http://srfti.ac.in/ వెబ్‌సైట్లలో చేసుకోవచ్చు.

Back..

Posted on 07-01-2020