Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జిప్‌మర్‌లో ప్రత్యేక పరీక్ష

వైద్యవిద్యలో ప్రవేశించాలనుకునేవారికి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్‌ కోర్సుకు దేశంలో అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)- న్యూదిల్లీ తర్వాత జిప్‌మర్‌ పేరున్న సంస్థ. దీనికి పుదుచ్చెరితోపాటు కరేకల్‌ లోనూ క్యాంపస్‌ ఉంది. ఈ రెండు కేంద్రాల్లోనూ 200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. జిప్‌మర్‌ నిర్వహించే ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
పరీక్ష ఇలా...
ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌) లో పరీక్షను నిర్వహిస్తారు. వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఫిజిక్స్‌ నుంచి 60, కెమిస్ట్రీ 60, బయాలజీ 60, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 10, లాజికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు కేటాయించారు. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు చొప్పున ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఒకటి సరైన సమాధానం. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ నుంచే వస్తాయి. పరీక్షలో అర్హత సాధించడానికి అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 40 పర్సంటైల్‌ సాధించాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. జిప్‌మర్‌ పుదుచ్చెరి క్యాంపస్‌లో 150, కరేకల్‌ లో 50 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.
* అర్హత: ఇంటర్‌ బైపీసీ గ్రూప్‌లో 60 (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 50) శాతం మార్కులతో ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* వయసు: డిసెంబరు 31, 2018 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలి. అంటే జనవరి 1, 2002లోగా జన్మించినవారే అర్హులు.
* దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 13 సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.1200. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
* పరీక్ష: జూన్‌ 3న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు
* హాల్‌ టికెట్లు: మే 21 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు వారి ప్రాధాన్యం ప్రకారం మూడింటిని ఎంచుకోవచ్చు. వీటిలో ఏదో ఒకచోట పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి కోరుకున్న కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుంది. ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
* వెబ్‌సైట్‌: ‌www.jipmer.edu.in

Back..

Posted on 02-04-2018