Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
క‌రూర్ వైశ్యా బ్యాంక్‌లో క్లరిక‌ల్ కేడ‌ర్ పోస్టులు

దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒక‌టైన క‌రూర్ వైశ్యా క్లరిక‌ల్ క్యాడ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఫ‌స్ట్‌క్లాస్ మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

విద్యార్హత‌: అభ్యర్థులు ఏదైనా విభాగంలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో జ‌న‌వ‌రి 1, 2017లోగా గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ ఆఖ‌రు సంవ‌త్సరం కోర్సు చ‌దువుతున్నవాళ్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దూర‌విద్యలో డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అన‌ర్హులు.
వ‌యోప‌రిమితి: జ‌న‌వ‌రి 1, 2017 నాటికి క‌నిష్ఠంగా 19 గ‌రిష్ఠంగా 26 ఏళ్లు. పీజీ చదివిన అభ్యర్థుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 28 ఏళ్లు. జ‌న‌వ‌రి 2, 1989 కంటే ముందు జ‌న్మించిన పీజీ అభ్యర్థులు, జ‌న‌వ‌రి 2, 1991 కంటే ముందు జ‌న్మించిన అండ‌ర్ గ్రాడ్యుయేట్లు అన‌ర్హులు. జ‌న‌వ‌రి 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వారికి అర్హత లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా

ప‌రీక్ష ఇలా:
మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి 200 మార్కులు. అయిదు అంశాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని ప‌రీక్షిస్తారు. ప్రతి సెక్షన్‌కూ కొన్ని మార్కులు, కొంత‌ స‌మ‌యాన్ని కేటాయించారు. ఆ వ్యవ‌ధిలో ఆ సెక్షన్ ప్రశ్నలు పూర్తిచేయాలి. దీని ప్రకారం రీజ‌నింగ్‌లో 40 ప్రశ్నల‌ను 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. వీటికి 50 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. వీటిని అర గంట‌లో పూర్తిచేయాలి. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలోని 40 ప్రశ్నల‌ను 30 నిమిషాల గ‌డువులోగా పూర్తిచేయాలి. వీటికి 50 మార్కులు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌(బ్యాంకింగ్ అంశాల‌కు ప్రాధాన్యం) విభాగంలో 40 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి 40 మార్కులు. వ్యవ‌ధి 25 నిమిషాలు. కంప్యూట‌ర్ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి 20 మార్కులు. ఈ సెక్షన్‌కు 20 నిమిషాలు కేటాయించారు. ప‌రీక్ష మొత్తం వ్యవ‌ధి 135 నిమిషాలు. ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 5 ఆప్షన్లు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన జ‌వాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం త‌గ్గిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించిన‌వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ఎంపికైతే:
రూ. 13075 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. దీనికి అద‌నంగా క‌ర‌వు భ‌త్యం(డీఏ), గృహ అద్దె(హెచ్ఆర్ఏ) త‌దిత‌రాలు ఉంటాయి. అన్నీ క‌లుపుకుని ఏడాదికి రూ.3.5 లక్షలు (సీటీసీ) వేత‌నంగా పొంద‌వ‌చ్చు. ప్రొబేష‌న్ వ్యవ‌ధి 6 నెల‌లు. అనంత‌రం శాశ్వత ఉద్యోగిగా ప‌రిగ‌ణిస్తారు.

ముఖ్యైమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 21
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీ: జ‌న‌వ‌రి 13
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.
వెబ్‌సైట్‌: www.kvb.co.in

నోటిఫికేష‌న్‌


Back..

Posted on 12-11-2016