Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కేంద్రీయ విద్యాల‌యాల్లో 6205 ఖాళీలు

దేశ‌వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న వెలువ‌డింది. అన్ని విభాగాల్లోనూ క‌లుపుకుని మొత్తం 6205 ఖాళీలు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లోనే స్వీక‌రిస్తారు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. భ‌ర్తీ ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

మొత్తం పోస్టుల సంఖ్య: 6205
1) ప్రిన్సిప‌ల్‌: 90
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఏదైనా పీజీ, బీఎడ్ పూర్తిచేసుండాలి.
వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 31, 2016 నాటికి 35కి త‌క్కువ కాకుండా 50 ఏళ్లకు మించ‌కుండా ఉండాలి.
పే స్కేల్: రూ. 15600-39100 (గ్రేడ్ పే రూ. 7600)

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (పీజీటీ): 690
విభాగాలు: ఇంగ్లిష్‌-69, హిందీ-62, ఫిజిక్స్‌-68, కెమిస్ట్రీ-61, ఎక‌నామిక్స్‌-48, కామ‌ర్స్‌-96, మ్యాథ్స్‌-73, బ‌యాల‌జీ-66, హిస్టరీ-38, జియోగ్రఫీ-31, కంప్యూట‌ర్ సైన్స్‌-78.
అర్హత: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 50 శాతం మార్కుల‌తో పీజీ ఉత్తీర్ణత‌, బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. కంప్యూట‌ర్ సైన్స్ టీచ‌ర్ పోస్టుల‌కు బీఈ/ బీటెక్‌లో సీఎస్ఈ/ ఐటీ లేదా ఎమ్మెస్సీ(సీఎస్‌) లేదా ఎంసీఏ చ‌దివివ‌నాళ్లు అర్హులు.
గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 31, 2016 నాటికి 40 ఏళ్లకు మించ‌రాదు.
పే స్కేల్‌: రూ.9300-34800(గ్రేడ్ పే రూ.4800)

3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (టీజీటీ): 926
విభాగాలు: ఇంగ్లిష్‌-90, హిందీ-116, మ్యాథ్స్‌-126, సోష‌ల్ స్టడీస్‌-160, సైన్స్‌-120, సంస్కృతం-53, పీ & హెచ్ఈ-67, ఏఈ-120, డ‌బ్ల్యూఈ-74.
అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 50 శాతం మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణత‌, బీఎడ్ పూర్తిచేసి, సీటెట్‌లో అర్హత సాధించాలి.
గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 31, 2016 నాటికి 35 ఏళ్లకు మించ‌రాదు.
పే స్కేల్‌: రూ.9300-34800(గ్రేడ్ పే రూ.4600)

4) ప్రైమ‌రీ టీచ‌ర్లు (పీఆర్‌టీ): 4499
విభాగాలు: పీఆర్‌టీ-4348, పీఆర్‌టీ(మ్యూజిక్‌)-151.
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. సీటెట్‌లో అర్హత సాధించ‌డం త‌ప్పనిస‌రి. మ్యూజిక్ టీచ‌ర్ పోస్టుల‌కు ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో పాటు మ్యూజిక్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 31, 2016 నాటికి 30 ఏళ్లకు మించ‌రాదు.
పే స్కేల్‌: రూ.9300-34800(గ్రేడ్ పే రూ.4200)

ప‌రీక్ష ఇలా..
ప్రిన్సిపాల్ పోస్టుల‌కు:
మొత్తం 3 పార్ట్‌ల్లో 160 ప్రశ్నలు వ‌స్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం ప‌రీక్షకు 160 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. పార్ట్ -1లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, హిందీ ఒక్కో అంశం నుంచి ప‌ది చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో జ‌న‌రల్ నాలెడ్జ్‌, వ‌ర్తమానాంశాల నుంచి 10, లాజిక‌ల్ రీజ‌నింగ్ 10, కంప్యూట‌ర్ లిట‌ర‌సీ 10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-3 అక‌డ‌మిక్ విభాగంలో 30 ప్రశ్నలు, అడ్మినిస్ట్రేష‌న్ అండ్ ఫైనాన్స్‌ విభాగంలో 70 ప్రశ్నలు వ‌స్తాయి. అక‌డ‌మిక్ విభాగంలో చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పెడ‌గాగి 10, పెర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేష‌న్ అండ్ స్కూల్ ఆర్గనైజేష‌న్ 10, టీచింగ్ మెథ‌డాల‌జీ 10 మొత్తం 30 ప్రశ్నలు వ‌స్తాయి.

పీజీటీ పోస్టుల‌కు:
పీజీటీ ప్రశ్నప‌త్రం 200 మార్కుల‌కు ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పార్ట్ -1, పార్ట్‌-2 అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1 లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ హిందీ ఒక్కో స‌బ్జెక్టు నుంచి 20 చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్‌-2లో క‌రెంట్ అఫైర్స్ 20, రీజ‌నింగ్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 20, టీచింగ్ మెథ‌డాల‌జీ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత స‌బ్జెక్టుకు వంద మార్కులు కేటాయించారు.

టీజీటీ(పీఅండ్ హెచ్ఈ, డ‌బ్ల్యుఈ, ఏఈ) పోస్టుల‌కు:
మొత్తం 200 మార్కుల‌కు 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. ప్రశ్నప‌త్రం రెండు పార్ట్‌ల్లో ఉంటుంది. పార్ట్‌-1లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌రల్ హిందీ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్‌-2లో క‌రెంట్ అఫైర్స్ 30, రీజ‌నింగ్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 30, సంబంధిత స‌బ్జెక్టు నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు.

టీజీటీ(లాంగ్వేజ్‌లు, మ్యాథ్స్‌, సోష‌ల్ స్టడీస్‌, సైన్స్‌), ప్రైమ‌రీ టీచ‌ర్ పోస్టుల‌కు:
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు. ప్రశ్నప‌త్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ హిందీ ఒక్కో అంశం నుంచి 15 చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్‌-2లో క‌రెంట్ అఫైర్స్ 40, రీజ‌నింగ్ ఎబిలిటీ 40, టీచింగ్ మెథ‌డాల‌జీ 40 చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు.

ప్రైమ‌రీ టీచ‌ర్(మ్యూజిక్‌):
మ్యూజిక్ టీచ‌ర్ పోస్టుల‌కు కూడా ప్రశ్నప‌త్రం 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ హిందీ ఒక్కో స‌బ్జెక్టు నుంచి 15 చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్‌-2లో క‌రెంట్ అఫైర్స్ 30, రీజ‌నింగ్ ఎబిలిటీ 30, మ్యూజికాల‌జీ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం: 27.09.2016.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.10.2016.
రాత‌ప‌రీక్ష తేది: న‌వంబ‌రు లేదా డిసెంబ‌రులో ప‌రీక్ష నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌

వెబ్‌సైట్‌: http://kvsangathan.nic.in/          www.mecbsekvs.in

నోటిఫికేష‌న్‌


Back..

Posted on 28-09-2016