Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలంగాణ కేజీబీవీల్లో 1050 ఖాళీలు

తెలంగాణ క‌స్తూర్భాగాంధీ బాలికా విద్యాల‌యాలు, అర్బ‌న్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ సీఆర్‌టీ, ఎస్‌వో త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి స‌ర్వ‌శిక్షా అభియాన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల‌కు కేవ‌లం మ‌హిళా అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య‌: 1050
1) పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ‌ర్లు (పీజీసీఆర్‌టీ): 580
స‌బ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ‌మేటిక్స్, ఎక‌నామిక్స్, కామ‌ర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీ, న‌ర్సింగ్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌తోపాటు బీఎడ్ ఉత్తీర్ణ‌త‌.
2) స్పెష‌ల్ ఆఫీస‌ర్లు (ఎస్‌వో): 49
అర్హ‌త‌: పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హ‌త‌ ఉండాలి.
3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ‌ర్ (సీఆర్‌టీ): 359
స‌బ్జెక్టులు: మ్యాథ‌మేటిక్స్, ఫిజిక‌ల్ సైన్స్, బ‌యలాజిక‌ల్ సైన్స్, సోష‌ల్, తెలుగు,హిందీ, ఇంగ్లిష్.
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హ‌త ఉండాలి.
4) ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ (పీఈటీ): 62
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు ఫిజిక‌ల్ ఎడ్యుక‌ష‌న్‌లో స‌ర్టిఫికెట్/ డిప్లొమా లేదా బ్యాచిల‌ర్స్ డిగ్రీతోపాటు క‌నీసం ఒక ఏడాది బీపీఈడీ ఉండాలి.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ఆధారంగా. రాత ప‌రీక్ష‌లు ఆయా పూర్వ‌పు జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఆబ్జెక్టివ్ విధానంలో జ‌రుగుతాయి.
రాత ప‌రీక్షల తేదీలు: ఎస్‌వో-02.07.2018, పీజీసీఆర్‌టీ-03.07.2018, సీఆర్‌టీ, పీఈటీ-04.07.2018.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు 20.06.2018 నుంచి అందుబాటులో ఉంటాయి.
చివ‌రితేది: 23.06.2018.

Notification

Website


Back..

Posted on 20-06-2018