Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
క్రియా కోర్సుల్లోకి ఆహ్వానం

కార్పోరెట్‌ ప్రపంచం, అకడమిక్స్‌ కలిసి ఏర్పరిచిన కొత్త ప్రైవేటు యూనివర్సిటీనే క్రియా. లిబరల్‌ స్టడీస్‌, సైన్స్‌ కోర్సులపైనే ఈ విశ్వవిద్యాలయం దృష్టిసారిస్తోంది. దీనికి సంబంధించిన తరగతులు ఆగస్టు 2019లో ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.

పారిశ్రామికవేత్తలు.. కిరణ్‌ మజూందార్‌ షా, అను అగా, సజ్జన్‌ జిందాల్‌, ఆనంద్‌ మహీంద్రా, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌, మంజుల్‌ భార్గవ తదితరులు ఇందులో భాగంగా ఉన్నారు. చెన్నైకి దగ్గర్లోని శ్రీ సిటీలో క్రియాను ఏర్పాటు చేశారు. దీనిలో ఆర్ట్స్‌, సైన్స్‌ విభాగాల్లో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలు అందిస్తున్నారు.

బీఏ ఆనర్స్‌లో.. ఎకనామిక్స్‌, హిస్టరీ, లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ కోర్సులూ, బీఎస్‌సీ ఆనర్స్‌లో.. కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌, మేథమేటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పన్నెండో తరగతి లేదా తత్సమాన విద్య పూర్తిచేసుండాలి. ఆగస్టు 1, 2019 నాటికి 21 ఏళ్లకంటే తక్కువ వయసు వారై ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ చేసుకోవచ్చు.
ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో దరఖాస్తులను పరిశీలించి, రెండోదశ ‘ఇమ్మర్షన్‌ డే’కు ఎంపిక చేస్తారు. రెండో దశలో క్రియా ఇమ్మెర్సివ్‌ కేస్‌, రిఫ్లెక్షన్‌ ఎస్సేస్‌, కన్వర్సేషన్స్‌, సినాప్సిస్‌లను నిర్వహిస్తారు. ఇవి అభ్యర్థులను ఏదైనా చారిత్రక, ఎకనామిక్‌, సోషల్‌, పొలిటికల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సంబంధిత ప్రదేశానికి పర్యటనకు పంపుతారు. వారి అనుభవాలను వ్యాసం రూపంలో రాయమంటారు. తరువాత ఫ్యాకల్టీతో వన్‌ టూ వన్‌ సెషన్‌ నిర్వహిస్తారు. వీటన్నింటి ఆధారంగా అభ్యర్థి నియామకంపై నిర్ణయం తీసుకుంటారు.
వివరాలకు https://krea.edu.in చూడవచ్చు.

Back..

Posted on 20-11-2018