Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

* 3 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవకాశం

అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులకు సదవకాశం. సింగపూర్‌కు చెందిన స్కిలిజెన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ (ఐఎల్‌ఎస్‌ఓ)ను నిర్వహిస్తోంది. మూడు నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
విద్యార్థులు భావి పౌరులుగా ఎదగడానికి ఎంతవరకూ సంసిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి స్కిలిజెన్‌ ఐఎల్‌ఎస్‌ఓను నిర్వహిస్తోంది. వివిధ రకాల జీవన నైపుణ్యాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ పరీక్ష ఉద్దేశం కూడా.
దీనిలో మూడు నుంచి పన్నెండు తరగతుల వరకు ఎవరైనా పాల్గొనవచ్చు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆయా తరగతుల విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి, పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్‌-1లో మూడు, నాలుగు, ఐదు తరగతులవారూ, గ్రూప్‌-2లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులవారూ, గ్రూప్‌-3లో తొమ్మిది, పది తరగతులవారూ, గ్రూప్‌-4లో 11, 12 తరగతుల వారూ ఉంటారు. 100కుపైగా దేశాల విద్యార్థులు దీనిలో పాల్గొంటున్నారు.

నమోదు ఎలా?
ఆన్‌లైన్‌లో (www.lifeskillsolympiad.org) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో ఈమెయిల్‌ (info@lifeskillsolympiad.org) అయినా పంపొచ్చు. స్కూలు ద్వారానే నమోదు చేసుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా అయినా చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేయించవచ్చు. ఇంటి దగ్గర ఉండి చదువుకునే పిల్లలకూ అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజు 7.99 డాలర్లు (రూ.490).
దరఖాస్తు చివరితేదీ: జనవరి 15, 2019
పరీక్ష తేదీ: జనవరి 27, 2019
* ఫలితాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు, ఈమెయిల్‌ ద్వారా కూడా తెలియజేస్తారు.
* ఇతర వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ ‌www.lifeskillsolympiad.org ను సందర్శించవచ్చు.

పరీక్ష విధానం
పరీక్ష ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. భాషా నైపుణ్యాలను పరీక్షించే పరీక్ష కాదు కాబట్టి, ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సిలిజెన్‌ కరిక్యులమ్‌ ఆధారంగా పరీక్ష ఉంటుంది. పరీక్షలో అడిగే ప్రశ్నలు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా తేలిగ్గా చేసేవిగా ఉంటాయని సంస్థ చెబుతోంది. పరీక్షలో భాగంగా విద్యార్థుల నాయకత్వం, నిర్ణయం తీసుకునే లక్షణాలు, నైతిక విలువలు, బృందంతో పనిచేయడం, కమ్యూనికేషన్‌, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, సమయ పాలన మొదలైన 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలన్నింటినీ పరీక్షిస్తారు.
సన్నద్ధత: వెబ్‌సైట్‌లో సిలబస్‌, లైఫ్‌ స్కిల్స్‌ గైడ్‌, మాదిరి ప్రశ్నలుంటాయి. నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నవారికే ఇవి అందుబాటులో ఉంటాయి. అలాగే గ్రూపులవారీగా మాదిరి పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని సాధన చేసుకోవచ్చు.
రివార్డులివీ: ప్రపంచవ్యాప్తంగా నాలుగు గ్రూపుల నుంచీ గెలుపొందిన వారికి యూఎస్‌ఏలోని హార్వర్డ్‌ యూనివర్సిటీని సందర్శించే అవకాశంతోపాటు మరెన్నో బహుమతులు అందజేస్తారు. పాల్గొన్నవారికీ డిజిటల్‌ సర్టిఫికెట్లతోపాటు పది డాలర్ల విలువైన బహుమతులనూ అందజేస్తారు.

Back..

Posted on 14-01-2019