Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చదువుకోవడానికి ఎన్నో మార్గాలు

ఈనాడు, దిల్లీ: చదువుకోవాలన్న కోరిక ఉంటే కరోనా వైరస్‌ దాన్ని ఆపలేదని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది. విద్యార్జన కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వైబ్‌సెట్ల వివరాలను కళాశాలల, విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ఉంచాలని కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యూజీసీ కార్యదర్శి ఆచార్య రజ్‌నీశ్‌ జైన్‌ లేఖ రాశారు. ‘‘మనందరం కలిసి కోవిడ్‌-19పై యుద్ధం చేస్తున్నాం. ఇళ్లు, వసతిగృహాల్లోనే ఉంటూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేస్తున్నాం. ఆన్‌లైన్‌ అభ్యసనం ద్వారా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ వాటి ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్స్‌ (ఐయూసీలు)లు.. ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్క్‌వర్క్, కన్సార్టియం ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌(సీఈసీ) వంటి ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ)ని అభివృద్ధి చేశాయి. డిజిటల్‌ వేదికగా వీటితో సులభంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

1.

స్వయం ఆన్‌లైన్‌:


https://swayam.gov.in లో జనవరిలో నమోదు చేసుకున్నవారు సెమిస్టర్‌ను కొనసాగించొచ్చు.
2.

యూజీ, పీజీ మూక్స్‌:


సాంకేతికేతర అంశాలకు సంబంధించి http://ugcmoocs.inflibnet.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.
3.

ఈ-పీజీ పాఠశాల:


https://epgp.inflibnet.ac.in ద్వారా సోషల్‌ సైన్స్, ఆర్ట్స్, ఫైన్‌ ఆర్ట్స్, హ్యుమానిటీస్, నాచురల్, మేథమెటికల్‌ సైన్సెస్‌ తెలుసుకోవచ్చు.
4.

ఈ-కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్స్‌:


87 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు సంబంధించి 24,110 మాడ్యూల్స్‌ http://cec.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.
5.

స్వయంప్రభ:


విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు ఇతరులు కూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్‌ తదితర 32 డీటీహెచ్‌ ఛానల్స్‌ https://swayamprabha.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
6.

సీఈసీ-యూజీసీ యూట్యూబ్‌ ఛానల్‌:


విద్యా సంబంధిత లెక్చర్లను ఉచితంగా https://www.youtube.com/user/cecedusat ద్వారా తిలకించవచ్చు.

వీటితోపాటు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ, ఇండియన్‌ ఎలక్ట్రానిక్‌ థీసెస్, డిసర్టేషన్స్‌ కోసం షోద్‌గంగ, వివిధ జర్నల్స్‌ కోసం ఈ-షోద్‌ సింధు, డాటాబేస్‌ నిపుణులు ఇచ్చే సమాచారం కోసం విద్వాన్‌ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయని యూజీసీ తెలిపింది.

Back..

Posted on 27-03-2020